అమ్మకోసం... అభిమానుల పడిగాపులు... అయినా ఫలించని .. నిరీక్షణ? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 08, 2014

అమ్మకోసం... అభిమానుల పడిగాపులు... అయినా ఫలించని .. నిరీక్షణ?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరగాలి. కనుక జయలలిత కేసులో తుది నిర్ణయం తీసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు బెయిల్ ఇస్తే అప్పుడు ఆమెకు బెయిల్ మంజూరవుతుంది. లేని పక్షంలో బెయిల్ రానట్టే! 
కాగా, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తే కనుక తమకు అభ్యంతరం లేదని సీబీఐ కూడా చెప్పింది. దీంతో దేశంలోని మీడియా సంస్థలన్నీ జయలలితకు బెయిల్ మంజూరైందంటూ వార్తలు ప్రసారం చేశాయి. అలా జరిగిన కాసేపటికే బెయిల్ ఇవ్వడం లేదంటూ న్యాయస్థానం తీర్పు వెలువరిచింది
అమ్మకోసం... అభిమానుల పడిగాపులు
అనుకున్నట్లే అమ్మ బయటకు వస్తుందని అనుకున్న అభిమానులకు ఒకరు కోర్టునుంచి బయటకు వచ్చి .. అమ్మకు బెయిల్ వచ్చినట్టే అని చెప్పగానే... వార్తా చానల్లు.. జయకు బెయిల్ ఇచ్చినట్లు ఊదరగొట్టాయి.. అంతేగాదు అభిమానులు.. కూడా టపాసులు.. కేరింతలు కొట్టారు.. కొద్దిసేపటికే అంతా తూచ్ బెయిల్ రాలేదని అనగానే... అందరూ ఒక్కసారి నిరాశ్రయులయ్యారు. ర్యాలీలు... పడిగాపులు... బాణసంచా కాల్చిన వారు బోరున విలపించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad