మూవ్ మెంట్ చార్టర్/అంశాలు/విలువలు & సూత్రాలు
This was a historical draft of the Wikimedia Movement Charter. The latest version of the Charter that is up for a global ratification vote from June 25 to July 9, 2024 is available in the main Meta page. We thank the stakeholders of the Wikimedia movement for their feedback and insights in producing this draft. |
మేము ఒక వాస్తవ ఆధారిత, స్వేచ్ఛ, సమ్మిళిత విజ్ఞానాన్ని సమకూర్చే విధానానికి ప్రాతినిధ్యం వహిస్తాము. మా ప్రాజెక్టుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు జ్ఞానం సమకూర్చడంతో పాటు, స్వతంత్రంగా వారి వారి ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కల్పిస్తున్నాము. మా విధివిధానాలు, రోజువారీ అభ్యాసాలు సముదాయ విలువల ద్వారా మార్గనిర్దేశం చేయబడి, వికీమీడియన్లందరు సమానంగా పాల్గొనే అవకాశం కల్పించడానికి రూపొందించబడ్డాయి.
మా "విలువలు, సూత్రాలు" జ్ఞానాన్ని అందరికి అందుబాటులో ఉంచటం సమిష్టిగా చేసే కృషి అని గ్రహిస్తూ వాటిపై దృష్టి సారించడం లక్షంగా ఎంచుకోవటం జరిగింది.
స్వేచ్ఛ విజ్ఞానం & ఓపెన్ సోర్సు
మా ప్రాజెక్టు వేదికల ద్వారా మేము అందించే సాఫ్టువేరు, సమాచారం అంతా కూడా స్వేచ్ఛ జ్ఞానాన్ని అందించే స్పూర్తితో ఓపెన్ లైసెన్సింగ్ పరివర్తన సాధనాన్ని ఉపయోగించి అందజేస్తున్నాము. మేము నిర్వహించే ప్రాజెక్టులతో సహా అన్నింటిలోనూ చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న జ్ఞానానికి స్థలం కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాము .
స్వాతంత్ర్యత
మేము చేసే పని ఎవరి పట్ల పక్షపాతం వహించకుండా, స్వేచ్ఛ జ్ఞానాన్ని నిర్మాణానికి పాటు పడతాము. మేము వాణిజ్య, రాజకీయ లేదా ఇతర ద్రవ్య లేదా ప్రచార ప్రభావాలచే నడపబడము.
సమగ్రత
మేము వ్యక్తుల-కేంద్రీకృత భాగస్వామ్య సహ-సృష్టి దృష్టిని ప్రోత్సహిస్తాము. మేము నిర్వహించే ప్రాజెక్టులు అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంటూ, విశ్వజనీనకంగా, సహాయక సాంకేతికతతో విభిన్న వేదికల్లో అందుబాటులో ఉండాలని తలుస్తున్నాము. మా విధానాలు సముదాయాల వైవిధ్యత, హక్కులను కాపాడటానికి నిర్మించబడ్డాయి. దీని అమలుకు మేము ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేస్తాము, తద్వారా ప్రతి సభ్యుడి కృషి విలువైనదిగా గుర్తిస్తూ, సమగ్రతను స్థాపిస్తాము.
అనుసంధానాలు
మా వేదికలపై/ప్రాజెక్టులలో అలాగే సంస్థాగత పరిపాలనలోనూ సముచితంగా ఉండే స్థాయి లేదా స్థానిక స్థాయిలో అధికారాన్ని అందజేస్తాము. తద్వారా, ప్రపంచ ఉద్యమ విలువలకు అనుగుణంగా పనిచేసే సమాజాల సమర్థవంతమైన స్వీయ-నిర్వహణ, స్వయంప్రతిపత్తిని మేము నిర్ధారిస్తాము.
నిష్పాక్షికత
ఆచరణాత్మక వికేంద్రీకరణ, స్వయంప్రతిపత్తి ద్వారా మేము సముదాయాలను శక్తివంతం చేస్తూ వారికి మద్దతు అందిస్తాము. జ్ఞానం ప్రాతినిధ్యంలో సమానత్వంతో పాటు, వనరుల సమానత్వాన్ని మేము పాటుపడతాము. మా వాడుకరులకు, పాల్గొనే వారందరికీ గోప్యత వంటి డిజిటల్ హక్కుల ఈక్విటీని సాధ్యమైనంత విస్తృత స్థాయిలో అందించడానికి ప్రయత్నిస్తాము.
జవాబుదారీతనం
మా డాక్యుమెంటులను అందరికి అందుబాటులో ఉంచుతూ, పారదర్శకతతో మేము జరిపే కార్యక్రమాల గురించిన బహిరంగ నోటీసులు అందిస్తూ, మా చార్టర్ లో వివరించిన పాత్రలు, బాధ్యతల అంశాలలో సముదాయాలను భాగస్వామ్యం చేస్తూ, అందరి అభిప్రాయాలకు ప్రాతినిధ్యం ఇవ్వటంలో జవాబుదారిగా ఉంటాము.
స్థితిస్థాపకత
ఉచిత జ్ఞానానికి ఒక వేదిక ఎలా ఉండగలదనే విజన్ ను నిరంతరం పునరుద్ధరిస్తూ, ఆవిష్కరణ ప్రయోగాల ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడుపుతాము. మేము సాక్ష్యాలతో నడిచే సమర్థవంతమైన వ్యూహాలు, పద్ధతులను అనుసరిస్తాము. మేము మా వేదికలలో, సముదాయాలలో సుస్థిరత సంస్కృతిని ప్రోత్సహిస్తాము.