SPEED UP VIZAG TEMPLE FOOTPATH ROUTE-JEO _ విశాఖపట్నం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మెట్ల మార్గాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి _ జేఈవో శ్రీ వీర బ్రహ్మం

VISAKHAPATNAM, 11 APRIL 2023: TTD JEO Sri Veerabrahmam who inspected the Srivari temple at Visakhapatnam on Tuesday, instructed the officials concerned to complete the construction works of the footpath route at a faster pace.

He directed the Engineering officials that the footpath route under construction at Rishikonda should be finished within a month. He also said the operation of footwear-keeping racks, parking area, Jalaprasadam centres should be properly ensured.

“The lighting of Sankhu Chakra Tirunamam should be clearly visible even from a far distance. Keep the premises clean and green”, he directed the concerned.

CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu,  Superintendent Sri Venkatraman and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

విశాఖపట్నం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మెట్ల మార్గాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి

– అభివృద్ధి పనులను పరిశీలించిన

– జేఈవో శ్రీ వీర బ్రహ్మం

విశాఖపట్నం, 11 ఏప్రిల్ 2023: విశాఖపట్నం ఋషికొండ వద్ద టీటీడీ ఇటీవల నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి నిర్మాణంలో ఉన్న మెట్ల మార్గం పనులను నెల రోజుల్లోపు వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో కలిసి జేఈవో విశాఖపట్నంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన జలప్రసాదం కేంద్రాలు, ఆలయానికి విచ్చేసే భక్తులకు పార్కింగ్, పాదరక్షలు భద్రపరచు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయానికి అవసరమైన నీటి సరఫరా నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయం క్రింద భాగంలో ఉన్న వేచి ఉండే గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ఆలయం చుట్టూ లైటింగ్, శంఖు చక్ర నామాలు దూర ప్రాంతాల నుండి చూసే విధంగా లైటింగ్ తో ఏర్పాటు చేయాలన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో టిటిడి జలప్రసాదం, ఆలయంలోపల సెక్యూరిటీ, విజిలెన్స్, సిసి టి వి గది, పబ్లికేషన్స్ స్టోర్, ఉగ్రాణం, వాహనాలు ఉంచే గది, తదితర ప్రాంతాలను జేఈవో పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఆలయానికి శోభ తెచ్చే విధంగా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ, పచ్చదనాన్ని మరింత పెంచాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇంజనీరింగ్ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జేఈవో వెంట సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈ ఈలు శ్రీ నాగరాజు, శ్రీ ఆనందరావు, ఆలయ సూపరిండెంట్ శ్రీ వెంకట్రామన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజు ఇతర అధికారులు ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.