వాడుకరి చర్చ:Bollojubaba: కూర్పుల మధ్య తేడాలు
Bollojubaba (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bollojubaba (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 75: | పంక్తి 75: | ||
==సోమసుందర్ గారి బొమ్మ== |
==సోమసుందర్ గారి బొమ్మ== |
||
మీరు అప్లోడ్ చేసిన [[:బొమ్మ:DSC06912.JPG]]ను [[ఆవంత్స సోమసుందర్]] అనే వ్యాసంలో ఉంచాను. అయితే ఈ బొమ్మకు కాపీ హక్కుల వివరాలు తెలుపవలసి ఉంది. మీరు సోమసుందర్ గారి అనుమతితో ఈ ఫొటో తీసుకొన్నారని నాకు అనిపిస్తుంది. అంటే వారికి అభ్యంతరం ఉండకూడదు. అలాగయితే తెలుపండి. బొమ్మకు creative commons అనే ట్యాగ్ పెడతాను --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 20:21, 13 అక్టోబర్ 2008 (UTC) |
మీరు అప్లోడ్ చేసిన [[:బొమ్మ:DSC06912.JPG]]ను [[ఆవంత్స సోమసుందర్]] అనే వ్యాసంలో ఉంచాను. అయితే ఈ బొమ్మకు కాపీ హక్కుల వివరాలు తెలుపవలసి ఉంది. మీరు సోమసుందర్ గారి అనుమతితో ఈ ఫొటో తీసుకొన్నారని నాకు అనిపిస్తుంది. అంటే వారికి అభ్యంతరం ఉండకూడదు. అలాగయితే తెలుపండి. బొమ్మకు creative commons అనే ట్యాగ్ పెడతాను --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 20:21, 13 అక్టోబర్ 2008 (UTC) |
||
== సహాయ అభ్యర్ధన == |
|||
కాసుబాబు గారికి |
|||
నమస్కారములు |
|||
సోమసుందర్ గారి వ్యాసాన్ని సరిదిద్దాను. పరిశీలించండి. దయచేసి వికీకరించవలసినదిగా కోరుచున్నాను. |
|||
భవదీయుడు |
|||
బొల్లోజు బాబా |
04:54, 29 అక్టోబరు 2008 నాటి కూర్పు
స్వాగతం
Bollojubaba గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చాపేజిలో నన్ను అడగండి.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ సమూహములో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
- అఖరిగా, వికీపీడియా లో మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. చర్చసాయీరచనలు 01:30, 28 ఏప్రిల్ 2008 (UTC)
సంతకం ఎలా ఉండాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు. అభిరుచులలో "సభ్యుని వివరాలు" ట్యాబులో "ముద్దుపేరు" ఒక దాన్ని ఎంచుకుని మీ సంతకాన్ని మార్చుకోవచ్చు. చర్చాపేజీల్లో ఏదైనా రాసినపుడు తప్పక సంతకం చెయ్యాలి. మరిన్ని వివరాలకు వికీపీడియా:కస్టమైజేషన్ చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
యానాం గురించి
బొల్లోజు బాబా గారూ!
నమస్కారం. తెలుగు వికిపిడియాలో మీరు వ్యాసాలు కూర్చడానికి ప్రయత్నిస్తున్నందుకు అభినందనలు. మీ బ్లాగు కూడా చూశాను. చరిత్ర పట్ల, సాహిత్యం పట్ల మీకు ప్రత్యేక ఆసక్తి ఉన్నదనుకొంటాను. మీరు మీ సభ్యుని పేజీలో వ్రాసిన విషయం గురించి ఈ క్రింది సూచనలు, వ్యాఖ్యలు గమనించగలరు. వికీ పీడియా విధానాలు, లక్ష్యాలు మీకు అంతగా పరిచయం ఉండకపోవచ్చును అని ఈ సుదీర్ఘమైన వివరణ ఇస్తున్నాను. అన్యధా భావించవలదు.
- సాధారణంగా రచయితలు తమను గురించి తమ సభ్య పేజీలో వ్రాసుకొంటారు. తాము వ్రాసే సమాచారాన్ని వేరే వ్యాసాలలో వ్రాస్తారు. ఇప్పటికే వ్రాసిన కొన్ని ఇతర వ్యాసాలు పరిశీలిస్తే మీకు అవగాహన వస్తుంది.
- మీరు మీ సభ్య పేజీలో వ్రాసిన యానం విమోచనోద్యమం సమాచారం చాలా చక్కగాను, ఆసక్తికరంగాను ఉంది. అభినందనలు.
- మీరు వ్రాసిన విషయాన్ని విభజించి రెండు వేరు వేరు వ్యాసాలుగా కూర్చితే బాగుంటుంది. ఉదాహరణకు (1)యానాం విమోచనోద్యమం - ఇందులో ఆ ఉద్యమం నేపధ్యం, పోరాట క్రమాలు, పరిణామాలు, నాయకులు వంటి విషయాలు వ్రాయవచ్చును. (2) యానాం విమోచనోద్యమం (పుస్తకం) - ఇది మీరు వ్రాసిన పుస్తకం గురించి. ఇందులో రచయిత గురించి, లోపలి అంశాల గురించి, ఇతర విశేషాలగురించి ఉండవచ్చును.
- ప్రస్తుతం మీకు వికీపీడియా క్రొత్త గనుక, మీరు అనుమతిస్తే, మీరు ఇప్పటికే వ్రాసిన విషయాన్ని రెండు వ్యాసాలుగా నేను విభజిస్తాను. తరువాత ఆ వ్యాసాలను మీరు ఇంకా విస్తరించవచ్చును లేదా సరి దిద్దవచ్చును.
- మరొ కొన్ని ముఖ్య విషయాలు మీరు గమనించవలసిందిగా మనవి
- వికీపీడియాలో వ్యాసాలు ఫలాని రచయితల పేర్లమీద ఉండవు. ఇది ఉమ్మడి కృషి. మీరు వ్రాసిన విషయాలను మరెవరైనా (నిర్దాక్షిణ్యంగా కూడా) మార్చే అవకాశం ఉంది. కనుక ఫలాని వ్యాసం ఫలాని వారు వ్రాశారన్న ఫుట్‌నోట్ ఉండదు. రచయితల పేర్లు వ్యాసం చరిత్రలో ఆటోమాటిక్‌గా నమోదు అవుతాయి.
- మీరు ఇప్పటికే వ్రాసిన విషయాన్ని కొంత "వికీకరంచడం" జరుగుతుంది. అంటే అభిప్రాయాలు, గౌరవ వచనాలు వంటివి, ఆధారం లేనివి తొలగించబడుతాయి. ఇది వారి పట్ల అగౌరవ సూచకంగా కాదు. ఏక వచన సంబోధనమే వికీలో మంచిదన్న అభిప్రాయంతో. (ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతున్నది)
- వికీపీడియాలో రచయితలు తమను గురించిన వ్యాసాలు వ్రాయకూడదని ఒక నియమం ఉంది. అందుకు corollary గా బహుశా రచయితలు తమ పుస్తకాల గురించి కూడా వ్రాయకూడదనుకొంటాను. (ప్రచార ధోరణిని నియంత్రించడాననికి ఈ నియమం ఉద్దేశింపబడింది. మీ పుస్తకం గురించి వ్యతిరేక భావంతో కాదు). కనుక మీ పుస్తకం గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని మీరు వ్రాయడం ఉచితం కాదు.
ఇన్ని నియమాలు మీ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయాలని కాదు సుమండీ. దయచేసి వికీలో ఇతర వ్యాసాలు పరిశీలించండి. ఈ నియమాల సదుద్దేశాన్ని మీరు గమనించగలరు. సమిష్టి కృషిగా తెలుగు వికిపీడియాను ఒక సమగ్ర తెలుగు విజ్ఞాన సర్వస్వంగా తీర్చి దిద్దడానికి సహకరించమని కోరుతున్నాను. మీకు ఆసక్తి ఉన్న అంశాలపై మరిన్ని వ్యాసాలు వ్రాయండి. ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో తప్పక వ్రాయండి.
అన్నట్లు నాదో సందేహం - యానం లేదా యానాం - ఏది సరైన పదం?
ధన్యవాదాలతో, మిత్రుడు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:29, 5 మే 2008 (UTC)
సహాయం కావాలి
అయ్యా నేను యానం విమోచనోద్యమము అనే వ్యాసం వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను, రెండు సార్లు టైపుచేసాను. పంపించాను. అదిమీకు చేరిందోలేదో తెలియదు. దయచేసి దానిని ఎడిట్ చేసి ప్రదర్శించండి. చరిత్రలో అదొక ముఖ్యమైన ఘట్టం. దాన్ని పదిమందికి తెలిసేలా చేయండి. కొన్ని ఫొటోలు కూడాఉన్నాయి. వాటిని ఎలా అప్లోడ్ చెయ్యాలో తెలియటంలేదు.
దయచేసి నన్నెవరైన చెయ్యితిరిగిన వాళ్లు దత్తత తీసుకొని మార్గ దర్శకత్వం వహించండి.
దీనితరువాత ఫ్రెంచ్ యానంలో 1820-40 లలో సుమారు 3000 వేల మంది విదేశాలకు ఎగుమతి చేయబడ్డారు. ఇది ఒకరకమైన బానిస వ్యాపారం. దీనిపైన కూడా చాలా ముఖ్యమైన చారిత్రాత్మక ఘట్టం.
దీనిని కూడా మీ సహాయంతో వికిలో ఉంచాలని ఆసిస్తున్నాను. హెల్ప్ చెయ్యండి. కాసుబాబు గారికి సోమసుందర్ గారి వ్యాసాన్ని దిద్దుబాటు చేసాను. కొన్ని అతిశయోక్తులను తొలగించాను. ఒక సారి పరిశీలించి వికీకరించవలసినది గా కోరుచున్నాను.
భవదీయుడు. బొల్లోజు బాబా
బొల్లోజు బాబా bollojubaba@gmail.com
http://sahitheeyanam.blogspot.com/
తప్పక వ్రాయండి, సందేహించ వద్దు
బొల్లోజు బాబా గారూ! మీరు వ్రాసిన ఈ అభ్యర్ధన చూడక ముందే నేను మీ చర్చా పేజీలో కొన్ని విషయాలు వ్రాశాను. మీరు సందేహించకుండా వికిపీడియాలో ఇలాంటి వ్యాసాలు వ్రాస్తూ ఉండండి. ఏమైనా సందేహాలుంటే ధారాళంగా అడగండి. మీకు వికీపీడియాలో అందరి సహకారాలు తప్పక లభిస్తాయి. ఒక్క రోజు ఆగితే మీరు ఇప్పటికే వ్రాసిన విషయాన్ని కొంచెం పునర్వ్యవస్థీకరించి నేను వ్యాసాలుగా ఉంచుతాను. అంతే కాదు, ఇంకా ఏయే విషయాలపై వ్యాసాలు వ్రాయాలని మీకు ఆసక్తి ఉందో చెప్పండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ పేజీలోనే {{సహాయం కావాలి}} అని టైపు చేసి, ఆక్రింద మీ ప్రశ్నలను అడగండి వీలయినంత త్వరలో ఎవరో ఒకరు మీ ప్రశ్నలకు సమాధానం చెబుతారు.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:49, 5 మే 2008 (UTC)
వ్యాసం తయారయింది. చూడండి
బొల్లోజు బాబా గారూ! మీరు వ్రాసిన విషయాన్ని యానాం విమోచనోద్యమం అనే వ్యాసంలోకి మార్చాను. స్వల్ప మార్పులు చేసి, బొమ్మలు అతికించాను. దయచేసి ఒకమారు చూసి ఏనైవా సవరణలుంటే చేయగలరు. ఇంకా మీకు ఆసక్తి ఉన్న విషయాలపై వ్యాసాలు వ్రాస్తూ ఉండండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:12, 6 మే 2008 (UTC)
సోమసుందర్ గారి బొమ్మ
మీరు అప్లోడ్ చేసిన బొమ్మ:DSC06912.JPGను ఆవంత్స సోమసుందర్ అనే వ్యాసంలో ఉంచాను. అయితే ఈ బొమ్మకు కాపీ హక్కుల వివరాలు తెలుపవలసి ఉంది. మీరు సోమసుందర్ గారి అనుమతితో ఈ ఫొటో తీసుకొన్నారని నాకు అనిపిస్తుంది. అంటే వారికి అభ్యంతరం ఉండకూడదు. అలాగయితే తెలుపండి. బొమ్మకు creative commons అనే ట్యాగ్ పెడతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:21, 13 అక్టోబర్ 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
కాసుబాబు గారికి నమస్కారములు సోమసుందర్ గారి వ్యాసాన్ని సరిదిద్దాను. పరిశీలించండి. దయచేసి వికీకరించవలసినదిగా కోరుచున్నాను. భవదీయుడు బొల్లోజు బాబా