వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 53: పంక్తి 53:
===నూనె ఉపయోగాలు===
===నూనె ఉపయోగాలు===


*వేపనూనెకున్న ఓషదగుణంకారణంగా,సబ్బులతయారిలో విరివిగా వాడుచున్నారు.వేపనూనెతోచేసిన సబ్బునురుగఎక్కువగా ఇచ్చును.
* వేపనూనెకున్న ఓషదగుణం కారణంగా, సబ్బుల తయారిలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బునురుగ ఎక్కువగా ఇచ్చును.
*వేపనూనె,సబ్బుద్రవం,నీటిమిశ్రమాన్నిమొక్కలచీడ,పీడలనీవారిణిగాపిచికారిచేసి వాడెదరు.
* వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నీవారిణిగా పిచికారి చేసి వాడెదరు.
*ఆయుర్వేద,యునాని మందులతయారిలో ఉపయోగిస్తారు.
* ఆయుర్వేద, యునాని మందుల తయారిలో ఉపయోగిస్తారు.
*కీళ్ళనొప్పులనివారణకు మర్ధననూనెగా వాడెదరు.
* కీళ్ళనొప్పుల నివారణకు మర్ధననూనెగా వాడెదరు.
*రాత్రితలవెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి,గాలిఅందకుండగా గట్టిగావస్త్రాన్నిచుట్టి వుదయంవరకువుంచిన తలలోనిపేలు చనిపోవును.
* రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి వుదయం వరకు వుంచిన తలలోని పేలు చనిపోవును.
*నేలలోపాతు కర్రభాగానికి,ఇంటిలోని దూలలకు,గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
* నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
*నూనెతీసిన వేపచెక్క(oil cake)ఎరువుగా రసాయనిక ఎరువులతోకలిపి చల్లెదరు.నూనెతీసినచెక్కలో5.2-5.6 వరకు నత్రజనివున్నది.భాస్వరం1.9%,పోటాషియం1.5%వున్నది.
* నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో5.2-5.6 వరకు నత్రజని వున్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% వున్నది.


[[వర్గం:నూనెలు]]
[[వర్గం:నూనెలు]]

10:42, 28 ఆగస్టు 2011 నాటి కూర్పు

వేపనూనె గింజ నుండి నూనెను తీయుదురు. యిది శాక తైలం (vegetable oil). వంటనూనె కాదు.పారీశ్రామికంగా వినియోగిస్తారు.

వేపపళ్ళు

ఎదిగిన చెట్టు నుండి ఎడాదికి 50-60కీ.జి.ల వేపపళ్ళు లభించును. 3-4 సంవత్స్రంలకే పుష్పింఛడం మొదలైనప్పటికి, పళ్ల దిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. పండులో విత్తన శాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఆరిన పండు (dry fruit)లో పిక్క 23-25%, పిక్కలో నూనె శాతం45% వుండును. పండు పైపొర (epicarp)4.5%, గుజ్జు (mesocarp)45%, గింజపెంకు (husk) 25% వుండును. వేపనూనెలో 'అజారిడిరక్టిన్‌' అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm)వుండును. పళ్ళు 1-2సెం.మీ. పోడవులో ధీర్గాండాకరంగా వుండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో వుండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి వుండును.

గింజలనుండి నూనెను తీయువిధానము

నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనె తీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్ద్‌ప్రెస్సింగ్ (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా వున్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె వుండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేపపళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె వుండును. పళ్లను నేరుగా క్రష్‌ చేసిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును, ఆయిల్‌కేకులో 6-8% వరకు నూనె వుండిపోవును. ఇలావుండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె వుండి,35-37% వరకు నూనెను పొందవచ్చును.

నూనె

విత్తనంల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ వున్నబ్రౌనురంగులో కాని వుండి, ఘాటైన వాసన కల్గివుండును. వేపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలైన మిరిస్టిక్‌, పామిటిక్, స్టియరిక్‌ ఆసిడులు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌, లినొలిక్‌ ఆసిడులున్నాయి. నూనెలో వున్న అజాడిరిక్తిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.

'వేపనూనెలోని కొవ్వుఆమ్లాలపట్టిక'

కొవ్వు ఆమ్లం పేరు శాతం
మిరిస్టిక్‌ ఆసిడు 2.6%
పామిటిక్‌ ఆసిడు 1 6-18%
స్టియరిక్ ఆసిడు 1 4-19%
ఒలిక్‌ ఆసిడు 45-58%
లినొలిక్‌ ఆసిడు 7-15%

'వేపనూనె భౌతిక ధర్మాల పట్టిక'

భౌతికధర్మం మితి
తేమ,మలినాలు 1% వరకు
వక్రీభవన గుణకం 1.4615-1.4705/400C
సాంద్రత 0.908-0.934/300C
ఐయోడిను విలువ 65-80
సపొనిఫికెసను విలువ 175-205
అన్‌సపొనిఫియబుల్‌ పధార్ధం 2%గరిష్టంగా
టైటరు 35.80C

వేపనూనెలో ఇంకను స్టెరొలులు (sterols), టెర్పొనొయిడులు (terpenoids), అల్కలైడు (alkalniods)లు, ఫ్లవొనొయిడులు (flavonoids) మరియు గ్లైకొసిడులు (glycosids) వున్నాయి.

నూనె ఉపయోగాలు

  • వేపనూనెకున్న ఓషదగుణం కారణంగా, సబ్బుల తయారిలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బునురుగ ఎక్కువగా ఇచ్చును.
  • వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నీవారిణిగా పిచికారి చేసి వాడెదరు.
  • ఆయుర్వేద, యునాని మందుల తయారిలో ఉపయోగిస్తారు.
  • కీళ్ళనొప్పుల నివారణకు మర్ధననూనెగా వాడెదరు.
  • రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి వుదయం వరకు వుంచిన తలలోని పేలు చనిపోవును.
  • నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
  • నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో5.2-5.6 వరకు నత్రజని వున్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% వున్నది.
"https://te.wikipedia.org/w/index.php?title=వేప_నూనె&oldid=638057" నుండి వెలికితీశారు