వర్గం:తెలుగు కవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బొల్లోజు బాబా

జననం

బొల్లోజు బసవలింగం, అమ్మాజి దంపతులకు బొల్లోజు బాబా 1970 ఆగస్టు 15 న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానాం లో జన్మించారు.

చదువు నివాసం ఉద్యోగం

జంతుశాస్త్రంలో ఎమ్మెసి, ఎం.ఫిల్ చేసారు. కొంతకాలం టీచర్ గా పనిచేసి, ఆంధ్రప్రదేష్ కాలేజ్ సర్విస్ కమిషన్ పరీక్షలు పాసయ్యి 1997లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని పొంది ఆంధ్రప్రదేష్ లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. ప్రస్తుతం కాకినాడలో నివాసమేర్పరచుకొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.

వివాహం, కుటుంబం

వీరికి మండపేటకు చెందిన నరిగిరి సూర్యపద్మతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు అపరాజిత. ఈమె ఎమ్.బి.బి.ఎస్ చేస్తున్నది. కుమారుని పేరు బసవ శ్రీథర్.

మొదటి కవిత

వీరి తండ్రిగారైన బొల్లోజు బసవలింగం నాటకరచయిత. ఎవరుదోషి, వారసుడు, నేటి విద్యార్థి, కృష్ణరాయబారము వంటి నాటకాలు రచించారు. అందుచే వీరి ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన వాతావరణం ఉండేది. ఇంటర్ చదివే సమయంనుంచీ కవితలు అల్లటం మొదలు పెట్టారు. కాలేజ్ మాగజైన్స్ లో తనపేరుతోను, మిత్రుల పేరుతోను అనేక కవితలు అచ్చు అయ్యేవి. ఆ తరువాత యానానికే చెందిన ప్రముఖ కవి శిఖామణి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో వాటిని పత్రికలకు పంపేవారు. 8-11-1991 నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో "ఈ వారం కవిత" గా ప్రచురించబడిన "తిరిగి భవిష్యత్తులోకే" అనే కవిత ద్వారా వీరు సాహితీలోకానికి పరిచయమయ్యారు. ఆ తరువాత క్రమంగా అన్ని ప్రముఖ పత్రికలలోను వీరి కవితలు ప్రచురితమయ్యాయి.

ముద్రిత రచనలు

1.

యానాం విమోచనోద్యమం
2007 లో ప్రచురింపబడింది. ఈ పుస్తకంలో, యానాంలో 1947 నుంచి 1954 మధ్య ఫ్రెంచి వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యపోరాటం గురించి సవివరంగా, ఆనాటి ఛాయా చిత్రాలతో ఉంటుంది.
ఆకుపచ్చని తడిగీతం
 స్వీయ కవితా సంకలనం (2009). దీనికి శిలపరసెట్టి ప్రత్యేక సాహితీ అవార్డు వచ్చింది.  

3.

ఫ్రెంచి పాలనలో యానాం
(2012) - 1724 లో ఫ్రెంచి వారు యానాం వచ్చినప్పటినుంచి 1954 లో వెళ్లిపోయేవరకూ జరిగిన సంఘటనలు, విద్య, చట్ట వ్యవస్థ, రాజకీయ చిత్రణ, వ్యాపారాలు, ఆనాటి సామాజిక వ్యవస్థ, వారుచేసిన నిర్మాణాలు వంటి వివరాలతోకూడిన చారిత్రిక పరిశోధనాత్మక పుస్తకం.

4.

వెలుతురు తెర
(2016) కవితా సంపుటి

5.

స్వేచ్ఛా విహంగాలు
(2016) రవీంద్రుని స్ట్రే బర్డ్స్ అనువాదం

6.

కవిత్వ భాష
(2018) పాశ్చాత్య అలంకారలను వివరించే సాహిత్య వ్యాసాలు

7.

మూడో కన్నీటిచుక్క
(2019) కవిత్వ సంపుటి

e.books ల రూపంలో ఉన్న అముద్రిత రచనలు

1. 'ఎడారి అత్తరులు' ప్రముఖ సూఫీ కవుల గీతాల అనువాదాలు

2. 'ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీటం' Twenty Love poems and a song of despair – Pablo Neruda అనువాదం

3. రవీంద్రుని క్రిసెంట్ మూన్ అనువాదం

4. గాథాసప్తశతి - కొన్ని అనువాదాలు

6. వివిధ పుస్తకాలకు వ్రాసిన సుమారు వందకు పైన సమీక్షా వ్యాసాలు

5. వివిధ ప్రపంచకవుల రెండువందలకు పైన కవితల అనువాదాలు


ప్రసంశలు/అవార్డులు

1. ఆకుపచ్చని తడిగీతం పుస్తకానికి శ్రీ శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం 2010

2. పాలకొల్లుకు చెందిన శ్రీకళాలయ సాంస్కృతిక సంస్థవారిచే రాష్ట్రస్థాయి సాహితీపురస్కారం -2012

3. శ్రీ ర్యాలి ప్రసాద్- డా.సోమసుందర్ స్మారక పురస్కారం 2016

4. ఇస్మాయిల్ సాహితీ పురస్కారం 2017

5. రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2018

వర్గం "తెలుగు కవులు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 581 పేజీలలో కింది 200 పేజీలున్నాయి.

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)