Jump to content

కోట జిల్లా

వికీపీడియా నుండి
16:17, 23 జనవరి 2023 నాటి కూర్పు. రచయిత: స్వరలాసిక (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
కోట జిల్లా
కోట జిల్లా రాజస్థాన్ జిల్లా ఎడమ నుండి సవ్యదిశలో: కోటలోని ఛార్ బాగ్, గఢ్ ప్యాలెస్, బావడిలోని స్టెప్‌వెల్, జగ్ మందిర్ సాగర్, కన్సువా శివాలయం
రాజస్థాన్ పటంలో కోట జిల్లా స్థానం
రాజస్థాన్ పటంలో కోట జిల్లా స్థానం
Coordinates (కోట): 25°10′48″N 73°49′48″E / 25.18000°N 73.83000°E / 25.18000; 73.83000
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
విభాగంకోట విభాగం
ప్రధాన పరిపాలనా కేంద్రంకోట
విస్తీర్ణం
 • మొత్తం5,217 కి.మీ2 (2,014 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం19,51,014
 • జనసాంద్రత370/కి.మీ2 (970/చ. మై.)
 • Urban
60.31 percent
జనాభా
 • అక్షరాస్యత76.56
 • లింగ నిష్పత్తి911
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో కోట జిల్లా ఒకటి. కోట పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

చరిత్ర

[మార్చు]

12 శతాబ్దంలో హడా నైనికాధికారి రావ్ దేవా ఈ ప్రదేశాన్ని జయించి బుంది, హడోతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 17 వ శతాబ్దంలో జహంగీర్ చక్రవర్తి కాలంలో బుంది పాలకుడు రావు రతన్ సింగ్ చిన్న కోట ప్రింసిపాలిటీని మాధోసింగ్‌కు ఇచ్చాడు. అప్పటి నుండి కోట రాజపుత్రుల శౌర్యం, సంస్కృతికి చిహ్నంగా మారింది. స్వాతంత్ర్యానికి ముందు కాలంలో సాంఘిక సంస్కర్త " గురు రాధా క్రిష్ణన్ " ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో ఇక్కడ పనిచేస్తూ ప్రజలను ఉత్తేజితులను చేయడంలో కృషిచేసాడు. ప్రభుత్వం గురు రాధా కృష్ణన్‌ను ఖైదు చేయాలని అరెస్ట్ వారెంటు చూసిన ప్రాంతీయ పాలకులకు ఆయన ప్రభుత్వవ్యతిరేక చర్యలు తెలిసిరావడం వలన ఆయన కోట ప్రాంతాన్ని వదిలి వెళ్ళాడు.

సరిహద్దులు

[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో బుంది జిల్లా, తూర్పు సరిహద్దులో బరన్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఝలావర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా ఉన్నాయి. జిల్లాలోఉన్న్ " ఐ.ఐ.టి, జె.ఇ.ఇ. ప్రవేశ పరీక్షల శిక్షణా స్థస్థలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నాయి. జిల్లా ప్రస్తుతం విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది. కోటజిల్లా ఆసియాలో బృహత్తర ఎరువుల తయారీ కేంద్రంగా గుర్తించబడుతుంది.

ఆర్ధికం

[మార్చు]

కోట జిల్లాలో 50 కి.మీ సర్కిల్‌లో 4 పవర్ స్టేషన్లు ఉన్నాయి. మొదటిది కోటకు సమీపంలో రావత్భటా వద్ద ఉన్న ఆటోమాటిక్ పవర్‌స్టేషను , రెండవది " రాజస్థాన్ ఆటోమాటిక్ పవర్ స్టేషను " , కోట నగర సరిహద్దులో ఉన్న చంబల్ నదీ తీరంలో ఉన్న " కోట థర్మల్ పవర్ స్టేషను, మూడవది బరన్ జిల్లాలోని అంట వద్ద ఉన్న " అంటా గ్యాస్ పవర్ ప్లాంట్ ", నాలుగవ జలవిద్యుత్ కేంద్రం.

చారిత్రిక జనాభా

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19012,27,837—    
19112,65,002+1.52%
19212,57,631−0.28%
19312,76,983+0.73%
19413,13,464+1.24%
19513,30,294+0.52%
19614,34,543+2.78%
19716,21,295+3.64%
19818,98,272+3.76%
199112,20,621+3.11%
200115,68,705+2.54%
201119,51,014+2.20%
source:[1]

2011 జనాభా గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,950,491, [2]
ఇది దాదాపు. లెసొతొ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూమెల్సికో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 239 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 334 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.35%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 906:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 77.48%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Decadal Variation In Population Since 1901
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lesotho 1,924,886
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులు

[మార్చు]