అంజన ఎరవెల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంజన ఎరవెల్లి, ఈమె పైదరాబాదులో1996 జులై 16న జన్మించింది. ఈమె భర్త రేవంత్, తల్లిదండ్రులు రాణి, భీమ్‍రావ్‍. అంజన అంతర్జాతీయంగా పేరున్న కరాటెక (కరాటే క్రీడాకారిణి). నేపాల్‍లో జరిగిన అంతర్జాతీయ కరాటే మార్షల్‍ ఆర్టస్ ఛాంపియన్‍షిప్‍ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శనను చూపిన తర్వాత ఇప్పటికి మొత్తం 250 పతకాలను గెలుచుకున్నారు. ఈ పోటీలలో క్రమంతప్పకుండా కాటా, కుమిటే పోటీలలో పతకాలు జయించుకున్న తొలి భారతీయ మహిళ ఈమె. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో ఎందరో యువక్రీడాకారిణులకు, క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. తన అధికార బాధ్యతలలో భాగంగా ఆమె, తెలంగాణా రాష్ట్రం అంతా నిరంతరం పర్యటిస్తూ, నవ యువ క్రీడాకారులను గుర్తిస్తూ, వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు.

ఉద్యోగం

ఈమె కరీమ్‍నగర్‍లోని గౌతమ్‍ మోడల్‍ స్కూల్‍లో మాధ్యమిక పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పటినుంచీ, కరాటేపై ఆసక్తి పెరిగింది. కరీమ్‍నగర్‍లోని ట్రినిటీ జూనియర్‍ కాలేజీలో ఇంటర్మీడియేట్‍ చదువుతున్నప్పుడూ, ఆ తర్వాత హైదరాబాద్‍లోని జవహర్‍లాల్‍ నెహ్రూ టెక్నాలజికల్‍ యూనివర్సిటీలో బి.టెక్‍ (ఎలక్ట్రానిక్స్ అండ్‍ కమ్యూనికేషన్‍ ఇంజనీరింగ్‍), ఎమ్‍.టెక్‍., చేస్తున్నప్పుడూ, ఆమె, ఆ క్రీడలో ఎలాగైనా ఉత్తమ శ్రేణికి చేరాలనే తన అభిలాషకు మెరుగులు దిద్దుకుంటూ వచ్చింది. ఇ. శ్రీనివాస్‍వద్ద కఠోర శిక్షణ పొందిన అంజన, ఇప్పటికి మొత్తం 11 దేశాలలో జరిగిన 16 అంతర్జాతీయ ప్రతిభా పోటీలలో పాల్గొంది. 2018లో ఆమె, దక్షిణాఫ్రికాలోని డర్బాన్‍లో జరిగిన కామన్‍వెల్త్ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో పాల్గొంది. స్వదేశంలో ఆమె,  22 జాతీయ పోటీలలో, 40 స్టార్‍ టోర్నమెంట్‍లలో పాల్గొని, 260కి మించిన సంఖ్యలో పతకాలు పొందింది. వీటిలో 165 స్వర్ణ పతకాలు కాగా, 54 రజత పతకాలు, 36 కాంస్య పతకాలు ఉన్నాయి.

సాధించిన ఘనతలు

అంజన 2021లో తెలంగాణ కరాటే అసోసియేషన్‍ ఆఫ్‍ ఇండియా వారి బ్రాండ్‍ ఎంబాసిడర్‍గా నియమితురాలైంది. 2011లో ఆమె, బెస్ట్ ఇంటర్నేషల్‍ రెఫరీ పురస్కారం పొందింది. 2010లో ఆమె, కరాటేలో ఉత్తమ విద్యార్థి పురస్కారాన్నీ అందుకుంది.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

  • 2019 మార్చి నెలలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాజన్న-సిర్సిల్ల జిల్లా కలెక్టర్‍నుండి పురస్కారం
  • 2017 మార్చి నెలలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాజన్న-సిర్సిల్ల జిల్లా కలెక్టర్‍నుండి పురస్కారం
  • 2017లో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాజన్న-సిర్సిల్ల జిల్లా కలెక్టర్‍నుండి పురస్కారం
  • 2017 జూన్‍ నెలలో తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీమ్‍నగర్‍ జిల్లా కలెక్టర్‍నుంచి ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం
  • 2016 మార్చి నెలలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా కరీమ్‍నగర్‍ జిల్లా కలెక్టర్‍, జిల్లా పరిషత్‍ అధ్యక్షుడి నుండి పురస్కారం
  • పాల్గొన్న సుప్రసిద్ధ అంతర్జాతీయ పోటీలు
  • 2019 మే, 24, 25 తేదీలలో జరిగిన నేపాల్‍ ఇంటర్నేషనల్‍ లెవల్‍ టోర్నమెంట్‍లో 2 స్వర్ణ పతకాల గెలుపు
  • 2018 నవంబర్‍, 27నుంచి డిసెంబర్‍ 3 వరకూ దక్షిణ ఆఫ్రికా, డర్బాన్‍ నగరంలో జరిగిన కామన్‍వెల్త్ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో పాల్గొన్నారు.
  • 2018 మే, 10, 11 తేదీలలో జరిగిన థాయ్‍ల్యాండ్‍, బ్యాంకాక్‍ నగరంలో జరిగిన పోటీలలలో 1 స్వర్ణ పతకం గెలుపు
  • 2017 ఫిబ్రవరి, 11 నుంచి 13 తేదీల వరకూ ముంబైలో జరిగిన ఏషియన్‍ లెవల్‍ టోర్నమెంట్‍లో 1 స్వర్ణ పతకం గెలుపు
  • 2016 ఆగస్టు, 23 నుంచి 29 వరకూ జరిగిన ఇండోనేసియా టాంజుంగ్‍ పినాంగ్‍ ఇంటర్నేషనల్‍ ఓపెన్‍ టోర్నమెంట్‍లలో 2 స్వర్ణ పతకాల గెలుపు
  • 2015 ఆగస్టు 11,12,13 తేదీలలో శ్రీలంక, గేల్‍ లో జరిగిన ఇంటర్నేషనల్‍ కరాటే ఓపెన్‍ ఛాంపియన్‍షిప్‍ పోటీలలో 2 స్వర్ణ పతకాలతోబాటుగా గ్రాండ్‍ ఛాంపియన్‍షిప్‍ గెలుపు
  • 2014 జూలై, 16 నుంచి 20వ తేదీ వరకూ బ్యాంకాక్‍, థాయ్‍ల్యాండ్‍లో జరిగిన థాయ్‍ల్యాండ్‍ కరాటే దో ఛాంపియన్‍షిప్‍ పోటీలలో 1 కాంస్య పతకం గెలుపు
  • 2013 నవంబర్‍, 24 నుంచి 28వ తేదీ వరకూ నేపాల్‍, ధంగడిలో జరిగిన ఇంటర్నేషనల్‍ కరాటే  టోర్నమెంట్‍లలో 3 స్వర్ణ పతకాలు, 1 కాంస్య పతకం, ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ పురస్కారాలు.
  • 2012 డిసెంబర్‍ 28 నుంచి 31 వరకూ శ్రీలంక, గేల్‍ లో జరిగిన ఇంటర్నేషనల్‍ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో 3 స్వర్ణ పతకాలు
  • 2012 మే, 2 నుంచి 6వ తేదీవరకూ మలేసియాలోని క్యామరాన్‍ హైల్యాండ్స్లో జరిగిన ఓకినావా గోజిర్యు ఇంటర్నేషనల్‍ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో కాంస్య పతకం
  • 2012 మే, 2 ఏప్రిల్‍ 29నుంచి 30వ తేదీవరకూ జపాన్‍లోని వసాకాలో జరిగిన ఓకసారా   షితోర్యు ఇంటర్నేషనల్‍ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో స్వర్ణ పతకం
  • 2011 ఫిబ్రవరి 10 నుంచి 13వ తేదీవరకూ భారతదేశం, విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్‍ స్టేడియమ్‍లో జరిగిన ఇంటర్‍ కాంటినెంటల్‍ ఏషియా వుకో ఓపెన్‍ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో 4 స్వర్ణ పతకాలు
  • 2009 డిసెంబర్‍ 4 నుంచి 6వ తేదీవరకూ భారతదేశం, హైదరాబాద్‍లోని నోమా ఫంక్షన్‍ హాల్‍లో జరిగిన ఏషియా ఓపెన్‍ కరాటే అండ్‍ కుంగ్‍ఫు ఛాంపియన్‍షిప్‍ పోటీలలో 5 స్వర్ణ పతకాలు
  • 2008 నవంబర్‍ 27నుంచి 30వ తేదీవరకూ భారతదేశం, విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్‍ స్టేడియమ్‍లో జరిగిన ఇంటర్‍ కాంటినెంటల్‍ ఏషియా వుకో ఓపెన్‍ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో స్వర్ణ పతకం
  • 2006 నవంబర్‍ 23 నుంచి 26వ తేదీవరకూ భారతదేశం, విశాఖపట్నంలోనిస్వర్ణభారతి ఇండోర్‍ స్టేడియమ్‍లో జరిగిన ఇంటర్‍ కాంటినెంటల్‍ ఏషియా వుకో ఓపెన్‍ కరాటే ఛాంపియన్‍షిప్‍ పోటీలలో 1 రజత పతకం, 1 కాంస్య పతకం.

మూలాలు