Jump to content

సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి

వికీపీడియా నుండి
సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి
2017 లో బ్రహ్మేశానంద
జననం (1981-03-12) 1981 మార్చి 12 (వయసు 43)
సర్కెయిమ్, గోవా
ప్రసిద్ధిఅధ్యాత్మికత
పురస్కారాలుపద్మశ్రీ

సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి[1] (జననం 1981 మార్చి 12) భారతీయ ఆధ్యాత్మిక గురువు. "సద్గురుజీ" లేదా "సద్గురుదేవ్" అనే పేరున్న స్వామి సద్గురు బ్రహ్మానందాచార్య స్వామి నుండి శ్రీ దత్త పద్మనాభ పీఠపు గురు శిష్య సంప్రదాయం ప్రకారం ఆత్మజ్ఞానాన్ని, అద్వైత వేదాంతాన్ని స్వీకరించాడు.

ప్రారంభ జీవితం

బ్రహ్మేశానంద ఆచార్య స్వామి 1981 మార్చి 12న గోవాలోని సిర్కైమ్‌లో జన్మించాడు. బాల్యం నుండి ధ్యానం, ఆధ్యాత్మికతల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఏడేళ్ల వయస్సులో అతను వివిధ లక్షణాలను ప్రదర్శించాడు. ఆ వయసు లోనే అతను పంప్ ఆర్గాన్ వాయించేవాడు. భగవద్గీతను చదవడం, పాడడం చేసేవాడు. పాఠశాలలో ఉన్నప్పుడే అతను సన్యాసానికి ఆకర్షితుడయ్యాడు. ' ధ్యాన్ ', ' సాధన ', ' తపస్య ' జీవితాన్ని కోరుకున్నాడు. చివరగా, అతను ఇంటిని విడిచిపెట్టి, కఠినమైన ఆధ్యాత్మిక మార్గాలను అధ్యయనం చేయడానికి, సాధన చేయడానికీ సన్యాసి జీవితాన్ని స్వీకరించాడు.

అతని పూర్వీకుడు అప్పటి దత్త పద్మనాభ సంప్రదాయానికి అధిపతి అయిన[2] బ్రహ్మానందాచార్య స్వామి, అతనిని తన రెక్కల క్రిందకు తీసుకున్నాడు. 21 సంవత్సరాల వయస్సులో, బ్రహ్మానందాచార్య స్వామీజీ వారసుడిగా పద్మనాభ శిష్య సంప్రదాయపు ఐదవ 'పీఠాదిష్'గా బ్రహ్మేశానందాచార్య స్వామీజీ నియమితుడయ్యాడు.

దత్త పద్మనాభ పీఠం పీఠాధీశ్వరుడు

స్వామి, గోవా లోని శ్రీ దత్త పద్మనాభ "పీఠాధిపతి". ఆశ్రమానికి వేల సంవత్సరాల గురు శిష్య పరంపర ఉంది. వేద, సంస్కృత, ఆధ్యాత్మిక, విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

శాంతి, మానవతా కృషి

స్వామి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆధ్యాత్మిక గురువు, శాంతి రాయబారి [3], సర్వమత నాయకుడు,[4] అంతర్జాతీయ వక్త, ఆధ్యాత్మిక, సంఘ సంస్కర్త,[5] వేద, సంస్కృత పండితుడు. అతను ప్రపంచ శాంతి, సామరస్యం కోసం ప్రపంచాన్ని ఒక పెద్ద కుటుంబంగా ఏకం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సద్గురు ఫౌండేషనుకు వ్యవస్థాపకుడు, అధిపతి. చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ ప్రారంభ ప్లీనరీకి స్వామి హాజరయ్యారు.[6][7][8][9] అతని మార్గదర్శకత్వంలో, వేలాది మంది హిందువులు తపోభూమి గురుపీఠ్‌లో జంధ్యాన్ని ధరింరించాడు. ఒకే సమయంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు జంధ్యం ధరించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు. [10]

మూలాలు

  1. Desk, N. T. (2022-02-06). "Pride of Goa | The Navhind Times" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-08.
  2. "SHREE DATTA PADMANABH PEETH Contact Number, Contact Details Ponda - NGO Foundation". www.ngofoundation.in. Retrieved 2023-06-08.
  3. "Indian guru awarded Ambassador of Peace". The Times of India. 2015-11-10. ISSN 0971-8257. Retrieved 2023-06-08.
  4. "Sanatan Dharma unites everyone, says Sadguru Brahmeshanand". The Goan EveryDay (in ఇంగ్లీష్). Retrieved 2023-06-08.
  5. "'Mutual respect is prime requisite for coexistence'". The Times of India. 2022-05-20. ISSN 0971-8257. Retrieved 2023-06-08.
  6. "Tapobhoomi swami at world religious meet in Chicago". The Times of India. 2023-08-16. ISSN 0971-8257. Retrieved 2023-08-18.
  7. "HSS USA participates at the Parade of Faiths Aug. 13". Daily Herald (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-08-17. Retrieved 2023-08-18.
  8. Sharma, Divya (2023-08-16). "कल शिकागो में विश्व धर्म संसद में सद्गुरु ब्रह्मेशानंदाचार्य स्वामीजी का संबोधन - BBC Hindi news" (in హిందీ). Retrieved 2023-08-19.
  9. "Spirituality path to world peace:Brahmeshanand swami in Chicago". The Times of India. 2023-08-21. ISSN 0971-8257. Retrieved 2023-08-22.
  10. "Sacred-thread ritual at Tapobhoomi sets Asia, nat'l records". The Times of India. 2023-08-31. ISSN 0971-8257. Retrieved 2023-09-02.