సీప్లేన్
సీప్లేన్ (ఆంగ్లం: Seaplane) అనేది నీటి వనరుల నుండి టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక రకం విమానం.[1] సీప్లేన్లను సాధారణంగా వాటి సాంకేతిక లక్షణాల ఆధారంగా రెండు వర్గాలుగా విభజిస్తారుః ఫ్లోట్ ప్లేన్, ఫ్లయింగ్ బోట్. విమానాశ్రయాలలో కూడా టేకాఫ్, ల్యాండ్ చేయగల వీటిని హైడ్రోప్లేన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వేగంతో నడుస్తున్నప్పుడు నీటి ఉపరితలాన్ని స్కిమ్ చేయడానికి హైడ్రోడైనమిక్ లిఫ్ట్ సాంకేతికతను ఉపయోగిస్తాయి.[2][1] 14, 19 సీట్ల కెపాసిటీ కలిగిన ఈ చిన్న తరహా ఉభయచర విమానాలతో మారుమూల ప్రాంతాలను చేరుకోవడానికి, స్థానికంగా పర్యటక రంగ అభివృద్ధికి దోహదపడతాయి. రన్‌వేకి బదులుగా, ఈ విమానం నీటిపై టేకాఫ్, ల్యాండ్ అయ్యే సీప్లేన్ ఒక్కసారి ఇంధనాన్ని నింపితే 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రాత్రి ప్రయాణానికి అనుమతి ఉండదు. వాటర్‌ప్లేన్ బేస్‌లను 'వాటర్‌డ్రోమ్‌లు' అంటారు. నీటిపై తేలియాడే వాటర్‌డ్రోమ్‌ల నుండి ప్రయాణీకులు విమానం ఎక్కుతారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీ-ప్లేన్
[మార్చు]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైల క్షేత్రం చేరుకోవడానికి విజయవాడ నుంచి భక్తులకు సీ ప్లేన్ సర్వీసు అందుబాటులోకి తేవడంలో భాగంగా 2024 నవంబరు 9 నుండి ట్రయల్ రన్ ప్రారంభించబడింది. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ సీ ప్లేన్ నిర్వహణ చేపడుతుండగా, స్పైస్‌జెట్ ఆధ్వర్యంలోని సీప్లేన్ ప్రకాశం బ్యారేజి వద్ద ఉన్న పున్నమి ఘాట్, శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ల మధ్య ప్రతిరోజు నడుస్తాయి. వీటి మధ్య కేవలం 45 నిమిషాల ప్రయాణం ఉంటుంది. నల్లగొండ పరిధిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద సీ ప్లేన్ ల్యాండ్ అయ్యాక దాదపు రెండు కిలోమీటర్ల దూరం బోటులో ప్రయాణం చేసి పాతాళగంగకు చేరుకోవచ్చు. అక్కడ భక్తులు బోట్ దిగి రోప్ వే ద్వారా శ్రీశైలానికి చేరుకోవాల్సి ఉంటుంది.[3]
పర్యావరణ సమస్యలు
[మార్చు]వాటర్‌డ్రోమ్‌లను వాస్తవానికి తీరం వెంబడి నిర్మించాల్సి ఉంటుంది, అయితే పర్యావరణవేత్తలు, సాంప్రదాయ మత్స్యకారుల నుండి వ్యతిరేకత కారణంగా, వాటర్‌డ్రోమ్‌లను బ్యాక్ వాటర్ మధ్యలో నిర్మిస్తారు. తీరం నుండి స్పీడ్ బోట్ల ద్వారా ప్రయాణికులను వాటర్‌డ్రోమ్‌లకు తరలిస్తారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Gunston, "The Cambridge Aerospace Dictionary", 2009.
- ↑ de Saint-Exupery, A. (1940). "Wind, Sand and Stars" p33, Harcourt, Brace & World, Inc.
- ↑ "విజయవాడ నుంచి శ్రీశైలానికి గంటన్నరలో వెళ్లిపోవచ్చు! | vijayawada to srisailam sri plane trail run full details | Sakshi". web.archive.org. 2024-11-09. Archived from the original on 2024-11-09. Retrieved 2024-11-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ജലവിമാനം അടുത്തയാഴ്ച;ഇറങ്ങുന്നത് കായലിന് നടുവിൽ". മാതൃഭൂമി. 2013 മേയ് 27. Archived from the original on 2013-05-27. Retrieved 2013 മേയ് 27.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help)