చర్చ:బ్లాగు
చదివేవారిని చదువరి-చదువరులు అన్నట్లే బ్లాగింగు చేసే వారిని బ్లాగరి-బ్లాగరులు అనడం ఎలా ఉంటుంది? (ప్రస్తుతం బ్లాగరు-బ్లాగర్లు అని, బ్లాగకుడు/రాలు-బ్లాగకులు అని అంటున్నాం.) -త్రివిక్రమ్ 15:59, 11 జూలై 2006 (UTC)
- బ్లాగరి, బ్లాగరులే సరైన పదాలు. ఈ వ్యాసంలో నేనవే వాడాను. కానీ ఒకచోట స్పెల్లింగు తప్పు పడి బ్లాగర్లు అని పడింది, సరిదిద్దుతాను. Blogroll ను బ్లాగ్ధార అనవచ్చునా?__చదువరి (చర్చ, రచనలు) 07:20, 12 జూలై 2006 (UTC)
- బ్లాగ్ధార పదం బాగుంది. కానీ blogroll కి సరిపోదేమో? బ్లాగ్పట్టీ, బ్లాగ్జాబితా రెండూ అంత బాలేవు.--వీవెన్ 09:00, 12 జూలై 2006 (UTC)
బ్లాగోళం
Blogsphere: బ్లాగ్గోళం కంటే బ్లాగోళం బాగుంటుంది కదా. (కూడలికి పెట్టాలనుకున్న పేర్లలో అదొకటి.) --వీవెన్ 05:16, 12 జూలై 2006 (UTC)
- బ్లాగావరణం ఎలా ఉంది? Blogosphere ను Stratosphere, Atmosphere అనే ధోరణిలో వాడినట్లున్నారు. __చదువరి (చర్చ, రచనలు) 07:20, 12 జూలై 2006 (UTC)
- బాగుంది. అదే సరైంది అని కూడా అనిపిస్తుంది. ఈ పదాలు వాడకం ద్వారా స్థిరపడాల్సిఉంది. --వీవెన్ 09:00, 12 జూలై 2006 (UTC)
where can we write about Telugu Blogging...
మనము తెలుగు బ్లాగులు వాటి ప్రస్థానం గురించి ఒక చిన్న ఉప శీర్షిక వ్రాయాలేమో కదా!
- కిరణ్ కుమార్ చావా
దాకా వర్సస్ వరకు
నాగరాజు గారూ, మీ మార్పులు బాగున్నాయి. దాకా వర్సస్ వరకు
ఈ రెంటిలో ఏది వాడాలి? ఎవరు నిర్ణయిస్తారు? Chavakiran 05:42, 10 జూలై 2007 (UTC)
కామన్స్ లో ఉన్న ఫోటోలు బ్లాగులో వాడవచ్చునా?
సహాయం అందించబడింది
వికీ నియమాల అనుసారంగా నేను వ్రాసే వ్యాసాలు సాధ్యమైనంత తటస్థ దృక్కోణాన్ని అవలంబిస్తూ వ్రాస్తూ ఉంటాను. అయితే, వీటిలో నా వ్యక్తిగత భావాలు చొప్పించటం నియమాలకు విరుద్ధం, కావున ఈ వ్యాసాలలో నేను వ్రాయలేని/వ్రాయకూడని అంశాలు నా బ్లాగులలో వ్రాసుకొంటున్నాను. అయితే, ఈ సందర్భంగా బ్లాగులలో "దీని గురించి తెలుగు వికీలో మరింత చదవండి" అనే లంకె కూడా ఉంచవచ్చు అని తెలుసుకొన్నాను. ఇక అసలు ప్రశ్న:
కామన్స్ లో ఉన్న బొమ్మలు నేను నా బ్లాగులలో వాడవచ్చునా? ఉదా: రాయలసీమ సంస్కృతి వ్యాసం లో కొన్ని ఛాయాచిత్రాలు నేను తీసినవే. వీటి వలన ఎటువంటి ప్రమాదము లేదు. కానీ కొన్ని వేరేవారు తీసినవి ఉంటాయి కదా? అవి కూడా నేను బ్లాగులలో వాడవచ్చునా? అనేదే సందేహం. నివృత్తి చేయగలరు.
- శశి (చర్చ) 10:43, 30 ఆగష్టు 2015 (UTC)
- వికీపీడియాలో ఉన్న సమాచారమంతా బ్లాగుల్లో వాడుకోవడం సంగతి అటుంచండి, పుస్తకాలుగా ప్రచురించుకుని అమ్ముకునేందుకు పాశ్చాత్య దేశాల్లో వ్యాపారసంస్థలున్నాయి. అది చట్టబద్ధం, కొంతవరకూ అభిలషణీయం. తెవికీలో ఉన్న సమాచారం నూటికి తొంభైశాతం వ్యాపార అవసరాల రీత్యా కూడా ఉపయోగించుకోవచ్చు అన్నప్పుడు బ్లాగుల్లాంటి సరదా కోసం నడిపేవాటికి అభ్యంతరమే ఉండబోదు. అలానే వికీకామన్స్ లో ప్రచురించే దాదాపు అన్ని ఫోటోలూ కమర్షియల్ రీయూజ్ విత్ క్రెడిట్స్ కిందికి వస్తాయి. ఇవి ఉద్దేశించిందే మీలాంటి, నాలాంటి వాళ్ళు కాపీహక్కులు ఉల్లంఘించకుండా హాయిగా వాడుకోవడానికి. కాబట్టి ఆ ఫోటో తీసినవారికి క్రెడిట్స్ ఇచ్చేసి శుబ్భరంగా వాడేసుకోవచ్చు. happy blogging. --పవన్ సంతోష్ (చర్చ) 07:11, 31 ఆగష్టు 2015 (UTC)
- ధన్యవాదాలు పవన్ సంతోష్ . ఇహ జూస్కో, తెవికీలో నేను వ్రాసిన ప్రతి వ్యాసానికీ ఒహ బ్లాగు రాస్తా. నే రాసిన ప్రతి బ్లాగుకు తెవికీ వ్యాసం లంకె చేర్చుతా. కుమ్మేస్తా!!! - శశి (చర్చ) 07:00, 1 సెప్టెంబరు 2015 (UTC)