వైరాగ్యం
వైరాగ్యం అంటే విరక్తి, అయిష్టత, నిరాసక్త త, విముఖత అనే వివిధ పదాలే వైరాగ్యం యొక్క అర్ధంగా భావించవచ్చు. వైరాగ్యం అనేది ఎలాంటి విషయాల్లో ఎప్పుడు ఏర్పడుతుందీ అంటే వివిధ సందర్భాల్లో నిరాశ కలిగినపుడు ఆయా విషయాలపట్ల నిరాసక్తత కలుగుతుం ది. ఉదాహరణకు ఎవరైనా దగ్గరి బంధువులు మరణించినప్పుడు వారి అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్ళిన క్రమంలో మనిషి జీవితం ఇంతేనా అనే వైరాగ్యం కలుగుతుంది.
తాత్కాలిక వైరాగ్యాలు
[మార్చు]కొన్ని ఉదాహరణలు
[మార్చు]- గర్భధారణ జరిగి తొమ్మిది నెలలు గడిచి ప్రస వించే సమయం ఆసన్నమైనపుడు ప్రసవించే సమయంలో అనుభవించే ప్రసవ వేదనకు ఈ సుఖాన్ని ఆశించేనా నేను గృహిణిగా జీవిస్తున్న ది అనే వైరాగ్యం కలుగుతుంది.
- అపరిమితమైన లాభాలను ఆశించి భారీ ఎత్తు న పెట్టుబడులను పెట్టి, ఆ తరువాత ఫలితంగా నష్టాలను ఎదుర్కొన్నపుడు ఇటువంటి వ్యాపారం కోసమా నేను పెట్టుబడులు పెట్టింది అనే వైరాగ్యం కలుగుతుంది.
- కన్నబిడ్డల్ని అప్పటి వరకు అల్లారుముద్దుగా పెంచినప్పటికీ, ఆ పుట్టిన బిడ్డలే పెరిగి పెద్దవా ళ్ళయిన తరువాత తనను ఏవగించుకున్నప్పు డు ఇటువంటి బిడ్డల కోసమా నేను నా యొక్క ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకున్నది అనే వైరాగ్యం కలుగుతుంది.
- ఆశించిన ప్రయోజనాలు దక్కకపోతే తనకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించిన యాజమా న్యం పట్ల ఇలాంటి సంస్థకోసమా నేను అహ ర్నిశలూ కృషి చేసింది అనే వైరాగ్యం ఒక ఉద్యోగిలో కలుగుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే మన నిత్య జీవితంలో మనకు కలిగే వైరాగ్యాలు అనేకం. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే వైరాగ్యాలను అ న్నింటిని రూపుమాపే శక్తి కాలానికే ఉంది. అదే ఎప్పటికప్పుడు మనలోని వైరాగ్యాన్ని పార ద్రోలుతుంది, భవిష్యత్తు పట్ల మనలో ఎన్నో ఆశలు రేకెత్తిస్తుంది. ఫలితం... శ్మశానానికి వెళ్ళి వచ్చిన తరువాత అప్పటి వరకు ఇదేనా మనిషి జీవితం అంటూ వైరాగ్యం చెందిన వ్యక్తి తన స్వకుటుంబీకులను చూడగానే అతనిలో చోటు చేసుకున్న వైరా గ్యం కాస్తా మటుమాయం అవుతుంది.
ఫలితం వచ్చిన తర్వాత మాయం
[మార్చు]- బిడ్డను కన్న తరువాత కొద్ది కాలానికి ఆ బిడ్డ పలికే ముద్దుమాటలకు మురిసిపోయే ఆ తల్లికి బిడ్డ పట్ల ప్రేమ, అటువంటి బిడ్డను అందించిన భర్త పట్ల మరింత ప్రేమ కలుగుతాయి. ఆమెలో ప్రసవ సమయంలో చోటు చేసుకున్న వైరా గ్యం ఆమెలో మటుమాయం అవుతుంది.
- లాభాల కోసం వ్యాపారం చేసిన వ్యాపారికి అను కోకుండా నష్టం ఏర్పడటంతో కలిగిన వైరాగ్యం అదే వ్యాపారంలో తానూహించలేనంతగా లాభాలను చూసిన రోజున అతడిలో వ్యాపారం పట్ల చోటు చేసుకున్న వైరాగ్యం మటు మాయం అవుతుంది. అదే వ్యాపారం కోసం అనునిత్యం అతని జీవితమంతా పరితపిస్తా డు.
- తనను తూలనాడిన బిడ్డల పట్ల పొందిన వైరాగ్యం ఆ బిడ్డలే తాము చేసిన తప్పును గ్ర హించి క్షమించమని అడిగినప్పుడు పెద్దల్లో అ ప్పటివరకు చోటు చేసుకున్న వైరాగ్యం మటు మాయమై బిడ్డల పట్ల ప్రేమ పొంగి పొర్లుతుంది.
- తాను కోరిన స్వప్రయోజనాలను సిద్ధించని నేపథ్యంలో తనకు ఉపాథిని కల్పించిన సంస్థ పట్ల, తాను చేసే ఉద్యోగం పట్ల వైరాగ్యం పొందిన ఉద్యోగి, తన విషయంలో చిన్న సహాయం చేసినట్లయితే తన ఉద్యోగం పట్ల, ఆ ఉద్యోగా న్ని ఇచ్చిన సంస్థపట్ల అభిమానం పెల్లు బుకు తుంది, అప్పటి వరకు అతడిలో చోటు చేసు కున్న వైరాగ్యం మటుమాయం అవుతుంది.
ఇలా తాత్కాలికంగా కలిగిన వైరాగ్యం కాలం యొక్క బలీయమైన శక్తితో మటుమాయం అ వుతుంది. అతడిలో భవిష్యత్తు పట్ల మనలో ఎన్నో ఆశలు రేకెత్తిస్తుంది. వాస్తవానికి ఇవన్నీ వైరాగ్యాలు కావు.
నిజమైన వైరాగ్యం
[మార్చు]ప్రసవ వేదన పడిన సందర్భంలో తనకు కలిగిన అవస్థ భగవత్ ప్ర సాదితమైన దనీ, ఆ అవస్థను పొందిన తాను భగవంతుడి సృష్టి క్రమంలో ఒక నిమిత్త మాత్రురాలిననీ బాలింతరాలైన ఒక స్త్రీ గ్రహించి నప్పుడూ, తాను చేసిన వ్యాపారంలో ఏర్పడిన నష్టం తన అకృత్యాలకు భగవంతుడు విధించి న శిక్ష అని ఒక వ్యాపారస్తుడు గ్రహించినప్పు డూ, బిడ్డలు తనను తూలనాడటం తన ప్రార బ్దమని, అం దులో తన బిడ్డల ప్రమేయం లేదని ఒక తండ్రీ లేదా ఒక తల్లి గ్రహించినప్పు డూ, తాను కోరే స్వప్రయోజనం తనకు ఉపా ధి కల్పించిన సం స్థకు బరువు కా వడం వల్లనే తనకు సంస్థ ప్ర యోజనం కల్పిం చలేదని ఒ క ఉద్యోగి గ్రహిం చినప్పుడూ వారిలో చోటు చేసుకొనే అనుభూతి వారిని అన్నింటికీ అతీ తంగా మారుస్తుంది. అదే నిజమైన వైరాగ్యం.
నిజమైన వైరాగ్యం తో మనిషి మహోన్నతుడు
[మార్చు]అటువంటి స్థిరమైన, వాస్తవికమైన వైరాగ్యం పొందడం వల్లనే మనిషి మహోన్నతుడు అవు తాడు. అప్పటివరకు తాను ఆశించిన తాత్కాలి క ప్రయోజనాలు ఎంతవరకు శాశ్వతంగాని లుస్తాయనే సత్యాన్ని గ్రహిస్తాడు. అశాశ్వతమైన వీటన్నింటికన్నా శాశ్వతమైనది ఏదనే జిజ్ఞా స అతడిలో మొదలవుతుంది. ఈ క్రమంలో తనలో చోటుచేసుకున్న వైరాగ్యాన్ని స్థిరీకరిం చుకొని అన్వేషణ చేసినప్పుడే కొంత కాలానికి సృష్టిలో మనకు కన్పిస్తున్న, మనలో ఆశలు రే కెత్తించేవి అన్నీ కూడా అశాశ్వతమైనవనీ, శా శ్వతమైనది భగవత్ మార్గమనీ దానిలోనే పర మార్ధం ఉందనీ కనుగొన్న మరుక్షణాన అతడి అన్వేషణ ముగుస్తుం ది. అలా అన్వేషణ ము గిసిన అన్వేషకుడే అస లైన విరాగి. అతడు అ నుభవించేదే అసలైన వై రాగ్యస్థితి. ఇదే అతడిని శాశ్వతమైన పరమపదా నికి చేరువచేస్తుంది.
ఏకాదశ వైరాగ్యములు
[మార్చు]1. విత్తము. 2. ఆయువు. 3. అహంకారము. 4. చిత్తము. 5. ఆశ. 6. తనువు. 7. యౌవనము. 8. రూపము. 9. జరము. (ముసలితనము)10. కాలము. 11. గృహస్థ వైరాగ్యము.