Jump to content

ఓక్లహోమా నగర హిందూ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 35°32′42″N 97°26′28″W / 35.544888°N 97.441037°W / 35.544888; -97.441037
వికీపీడియా నుండి
ఓక్లహోమా నగర హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:ఓక్లహోమా
ప్రదేశం:ఓక్లహోమా
అక్షాంశ రేఖాంశాలు:35°32′42″N 97°26′28″W / 35.544888°N 97.441037°W / 35.544888; -97.441037

ఓక్లహోమా నగర హిందూ దేవాలయం, అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్ర రాజధాని ఓక్లహోమా నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వేంకటేశ్వరుడు.[1]

చరిత్ర

[మార్చు]

హిందూ భక్తుల మతపరమైన, ఆధ్యాత్మిక అవసరాలకోసం 1982లో ఇండియన్ కల్చరల్ ఫౌండేషన్ స్థాపించబడింది. అక్కడున్న ఐదు కుటుంబాలు వారు కలిసి 1984లో విల్‌షైర్ బౌలేవార్డ్‌లోని 10 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఓక్లహోమా నగర మెట్రోపాలిటన్ ఏరియాలో నివసించిన 1,000 మంది హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా 1989 ఆగస్టులో ఓక్లహోమా నగరంలో 4,000 చదరపు అడుగుల ఈ హిందూ దేవాలయం నిర్మించబడింది.[2] 1991వ దశకంలో దేవాలయానికి ఉత్తరాన 5.11 ఎకరాల స్థలాన్ని సమకూర్చుకుంది.

నిర్మాణం

[మార్చు]

1994లో భారతదేశం నుండి శిల్పులు వచ్చి వెంకటేశ్వరుడు, వినాయకుడు, శివుడు, రాముడు-సీత, రాధా కృష్ణ దేవతలకు ఐదు గర్భగుడులు నిర్మించారు.

ఇతర వివరాలు

[మార్చు]

1998లో, విల్‌షైర్ బౌలేవార్డ్, కోల్ట్రేన్ రోడ్ కూడలిలో ఓక్లహోమా సిటీ వాటర్ లైన్‌పై 6-అంగుళాల ప్రైవేట్ వాటర్ లైన్ ఏర్పాటు చేయబడింది.

మూలాలు

[మార్చు]
  1. "History". Hindu Temple OKC. 2011. Archived from the original on 2022-02-09. Retrieved 2022-03-14.
  2. "Oklahoma City's Hindu Temple". SNU. 11 June 1994. Archived from the original on 2021-05-13. Retrieved 2022-03-14.