Jump to content

తకేషి కిటానో

వికీపీడియా నుండి
తకేషి కిటానో
తకేషి కిటానో (2017)
జననం (1947-01-18) 1947 జనవరి 18 (వయసు 77)
అడాచి, జపాన్‌
ఇతర పేర్లుబీట్ తకేషి
విద్యాసంస్థమీజీ విశ్వవిద్యాలయం
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1969–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • మికికో మజ్డా (1980-2019)
  • కియోకో యోకోయ్ (2020-ప్రస్తుతం)
పిల్లలు
  • షోకో కిటానో
  • అట్సుషి కిటానో
పురస్కారాలుగోల్డెన్ లయన్ (1997)
సంతకం

తకేషి కిటానో, జపనీస్ హాస్యనటుడు, నిర్మాత. తన స్వదేశమైన జపాన్‌లో హాస్యనటుడిగా, టీవీ హోస్ట్‌గా ప్రసిద్ధి చెందిన తకేషి నిర్మాతగా, నటుడిగా, టీవీ హోస్ట్‌గా విదేశాలలో బాగా పేరు పొందాడు.

జననం

[మార్చు]

తకేషి కిటానో 1947, జనవరి 18న టోక్యోలోని అడాచిలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. ఇతని తండ్రి హౌస్ పెయింటర్‌గా పనిచేశాడు.[1] తల్లి విద్యావేత్త.[2] కిటానో మీజీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివాడు. 19 సంవత్సరాల వయస్సులో చదువు మానేసిన తకేషి కిటానో, హాస్యనటుడు కావడంకోసం 1972లో అసకుసా జిల్లాకు వెళ్ళాడు. అసకుసా ఫ్రాన్స్-జా స్ట్రిప్ క్లబ్‌లో ఎలివేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నప్పుడు, అక్కడి హాస్యనటుడు సెంజాబురో ఫుకామికి అప్రెంటిస్ అయ్యాడు.[3][4]

సినిమారంగం

[మార్చు]

మీజీ విశ్వవిద్యాలయంలో చదువుకున్న సమయంలో టోక్యో నగరం అసకుసాలోని ఫ్రాన్స్-జా స్ట్రిప్ థియేటర్‌లో హాస్యనటుడిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. 1973లో కియోషి కనెకోతో కలిసి టూ బీట్ అనే హాస్యనట బృందాన్ని ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత బీట్ కియోషి గా మారి, కిటానో బీట్ తకేషి అనే పేరును స్వీకరించాడు. 1980లలో ఒరెటాచి హైకిన్-జోకు వంటి టీవీ షోలలో నటించాడు. అత్యధిక వీక్షకుల రేటింగ్ 29.1%, 24.7% నమోదు చేసిన తకేషీస్ కాజిల్ టెలివిజన్‌లో పేలుడు ప్రజాదరణ పొందింది. దర్శకుడు నగీసా అషిమా తీసిన మెర్రీ క్రిస్మస్, మిస్టర్ లారెన్స్ (1983)లో నటుడిగా గుర్తింపు పొందాడు. 1989లో కింజి ఫుకాసా వైదొలిగిన తర్వాత వయోలెంట్ కాప్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 1998లో వచ్చిన హనా-బి సినిమాకు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్నాడు. అకిరా కురోసావా, హిరోషి ఇనగా తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న మూడవ జపనీస్ దర్శకుడిగా నిలిచాడు. 2017 అక్టోబరులో కిటానో తన ఔట్రేజ్ క్రైమ్ త్రయాన్ని ఔట్రేజ్ కోడా విడుదలతో పూర్తి చేశాడు.[5] గేమ్ షో తకేషీస్ కాజిల్ (1986-1990) హోస్ట్ చేయడం, బ్యాటిల్ రాయల్ (2000) సినిమాలో నటించడం కోసం అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ది చెందాడు.

జపనీస్ సినిమా విమర్శకుడు నాగహారు యోడోగావాతో కలిసి అనేక అవార్డులను గెలుచుకున్నాడు. ఇతనిని ప్రభావవంతమైన సినిమా నిర్మాత అకిరా కురోసావాకు "నిజమైన వారసుడు" అని పిలిచాడు.[6]

2000లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కిటానో

అవార్డులు

[మార్చు]

కిటానో 1997లో హానా-బి సినిమాకు 54వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన గోల్డెన్ లయన్ అవార్డును గెలుచుకున్నాడు. 2008లో 30వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోలైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు.[7] 2010, మార్చిలో కిటానో కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ఆఫ్ ఫ్రాన్స్‌గా ఎంపికయ్యాడు.[8] 2022, ఏప్రిల్ 29న ఇటలీలో జరిగిన 24వ ఫార్ ఈస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఉడిన్ 2022లో గోల్డెన్ మల్బరీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.[9]

దర్శకత్వం

[మార్చు]
  • వాయిలెంట్ కాప్ (1989)
  • బాయిలింగ్ పాయింట్ (1990)
  • ఎ సీన్ ఎట్ ది సీ (1991)
  • సోనాటైన్ (1993)
  • గెట్టింగ్ ఎనీ? (1995)
  • కిడ్స్ రిటర్న్ (1996)
  • హనా-బి (1997)
  • కికుజిరో (1999)
  • బ్రదర్ (2000)
  • డాల్స్ (2002)
  • జాటోచి (2003)
  • తకేషిస్' (2005)
  • గ్లోరీ టు ది ఫిల్మ్ మేకర్! (2007)
  • అకిలెస్ అండ్ ది టార్టాయిస్ (2008)
  • ఔట్ రేంజ్ (2010)
  • బియాండ్ ఔట్రేజ్ (2012)
  • ర్యూజో అండ్ ది సెవెన్ హెంచ్‌మెన్ (2015)
  • ఔట్రేజ్ కోడా (2017)
  • కుబి (2023)

నటుడిగా

[మార్చు]
  • గో, గో, సెకండ్ టైమ్ వర్జిన్ (1969)
  • షింజుకు మ్యాడ్ (1970)
  • మకోటో (1980)
  • డంప్ మైగ్రేటరీ బర్డ్ (1981)
  • మనోన్ (1981)
  • సుక్కరి... సోనో కిడే (1981)
  • సీక్రెట్ ఆఫ్ సమ్మర్ (1982)
  • మెర్రీ క్రిస్మస్, మిస్టర్ లారెన్స్ (1983)
  • మస్కీట్ ఆన్ ది టెన్త్ ఫ్లోర్ (1983)
  • కనాషి కిబున్ డి జోక్ (1985)
  • యషా (1985)
  • కామిక్ మ్యాగజైన్ (1986)
  • అనెగో (1988)
  • వాయిలెంట్ కాప్ (1989)
  • బాయిలింగ్ పాయింట్ (1990)
  • సెట్సునా కిమోనో, సోరే వా ఐ (1990)
  • హోషి వో సుగు మోనో (1990)
  • ఎ లెజెండ్ ఆఫ్ టర్మాయిల్ (1992)
  • డయాక్సిన్ ఫ్రమ్ ఫిష్! (1992)
  • స్త్రరోటిక్ లియైసన్స్ (1992)
  • సిల్వర్ బాల్ (1992)
  • సోనాటైన్ (1993)
  • క్యోసో టాంజో (1993)
  • గెట్టింగ్ ఎనీ? (1995)
  • జానీ మెమోనిక్ (1995)
  • గోనిన్ (1995)
  • హనా-బి (1997)
  • టోక్యో ఐస్ (1998)
  • కికుజిరో (1999)
  • టబూ (1999)
  • రిమైన్స్ జాంక్యో యొక్క అవశేషాలు (1999)
  • బ్రదర్ (2000)
  • బాటిల్ రాయల్ (2000)
  • జటోయిచి (2003)
  • బాటిల్ రాయల్ II: రిక్వియం (2003)
  • ఇజో (2004)
  • బ్లడ్ అండ్ బోన్స్ (2004)
  • ది గోల్డెన్ కప్ వన్ మోర్ టైమ్ (2004)
  • తకేషిస్' (2005)
  • అరకిమెంటరీ (2005)
  • గ్లోరీ టు ది ఫిల్మ్ మేకర్! (2007)
  • ది మాన్‌స్టర్ X స్ట్రైక్స్ బ్యాక్/అటాక్ ది G8 సమ్మిట్ (2008) - టేక్-మాజిన్
  • అకిలెస్ అండ్ ది టార్టాయిస్ (2008)
  • ఔట్ రేంజ్ (2010)
  • డియరెస్ట్ (2012)
  • బియాండ్ ఔట్రేజ్ (2012)
  • ర్యూజో 7 (2015)
  • మోజు (2015)
  • ఉమెన్ ఆర్ స్లీపింగ్ (2016)
  • ఘోస్ట్ ఇన్ ది షెల్ (2017) - చీఫ్ డైసుకే అరమాకి
  • ఔట్రేజ్ కోడా (2017)
  • కుబి (2023) - హషిబా హిడెయోషి

టెలివిజన్

[మార్చు]
  • దౌజండ్స్ స్టార్స్ అండ్ ఒక రాత్రి (1980–1981)
  • ది మంజాయ్ (1980–1982)
  • ఒరెటాచి హైకిన్-జోకు (1981–1989)
  • బకుమాట్సు సీషున్ గ్రాఫిటీ: సకామోటో రైమా (1982), యమౌచి యాడో
  • వారట్టే పొన్! (1983)
  • సూపర్ జాకీ (1983–1999)
  • స్పోర్ట్స్ తైషో (1985–1990)
  • ఒవరై అల్ట్రా క్విజ్ (1989–1996, 2007)
  • జెంకి టీవీ (1985–1996)
  • తకేషీస్ కాస్టల్ (1986–1989)
  • టివి టాకిల్ (1989–ప్రస్తుతం)
  • హైసీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (1991–1997)
  • డేరెడెమో పికాసో (1997–ప్రస్తుతం)
  • కిసేకి టైకెన్!
  • కోకో గా హెన్ డా యో నిహోంజిన్ (1998–2002)
  • ముసాషి (2003)
  • క్విజ్ $ మిలియనీర్ (2009)
  • ఫుజి (1991–ప్రస్తుతం)
  • కిటానో ఫ్యాన్ క్లబ్
  • కిటానో ఫుజి
  • అదాచి-కు నో తకేషి, సెకై నో కిటానో
  • సైతో సింగు-పది
  • కిటానో టాలెంట్ మీకాన్
  • తకేషి కిటానో కామెనెసి యూనివర్శిటీ మ్యాథమెటిక్స్
  • అకా మెదకా (2015)
  • హగోకు (2017)
  • ఇడాటెన్ (2019), కొకొంటెయ్ షిన్‌షా వి
  • టూ హోమ్‌ల్యాండ్స్ (2019), హిడెకి టోజో

రేడియో

[మార్చు]
  • బీట్ తకేషి ద్వారా ఆల్ నైట్ నిప్పన్ (1981–1990)
  • బీట్నిక్ రేడియో (1997–2000)
  • బీట్ తకేషి సాహిత్య రాత్రి చర్చ
  • అంతర్జాతీయ పురుషుల స్నేహ పుస్తక ప్రదర్శన

పుస్తకాలు

[మార్చు]
  • Gerow, Aaron (2007). Kitano Takeshi. British Film Institute. ISBN 978-1-84457-166-6.
  • Abe, Casio (2005). Beat Takeshi vs. Takeshi Kitano. Kaya Press. ISBN 1-885030-40-1.
  • Kitano, Takeshi (1988). Asakusa Kid. Japan: Shincho-Sha.
  • Kitano, Takeshi (1998). Asakusa Kid. Paris: Motifs. ISBN 2842612795.
  • Kitano, Takeshi (2003). Rencontres du Septième Art. Arléa. ISBN 2869596197.
  • Kitano, Takeshi (2005). Naissance d'un Gourou. Editions Denoël. ISBN 2207254917.
  • Kitano, Takeshi (2008). La Vie en gris et rose. Philippe Picquier. ISBN 978-2809700220.
  • Kitano, Takeshi (2012). Boy. Wombat. ISBN 978-2919186136.

డిజైనర్‌గా

[మార్చు]
  • తకేషి నో చోసెంజో (1986)

నటుడిగా

[మార్చు]
  • యాకుజా 6: ది సాంగ్ ఆఫ్ లైఫ్ (2016)

మూలాలు

[మార్చు]
  1. "Такеши Китано » Arthouse.Ru". Archived from the original on 4 October 2013. Retrieved 2023-06-19.
  2. ""Beat" Takeshi: The Hollywood Flashback Interview". thehollywoodinterview.blogspot.com. 26 July 2008. Retrieved 2023-06-19.
  3. Schilling, Mark (2003). The Yakuza Movie Book : A Guide to Japanese Gangster Films. Stone Bridge Press. pp. 73–76. ISBN 1-880656-76-0. Archived from the original on 17 అక్టోబరు 2007.
  4. "Asakusa's resilience rubs off on France-za theater, cradle of postwar pop culture". Japan Times. 19 November 2015. Retrieved 2023-06-19.[permanent dead link]
  5. Tomita, Hidetsugu (3 December 2016). "Finale from Outrage". GQ Japan.
  6. Kirkup, James (23 November 1998). "Obituaries: Nagaharu Yodogawa". The Independent. Archived from the original on 26 May 2022. Retrieved 2023-06-19.
  7. "30th Moscow International Film Festival (2008)". MIFF. Archived from the original on 3 April 2014. Retrieved 2023-06-19.
  8. "Kitano awarded French arts honor". Japan Times. 11 March 2010. Retrieved 2023-06-19.
  9. "Takeshi Kitano Receives Lifetime Achievement Award In 24th Film Festival In Italy - Japan Inside". 2022-05-01. Retrieved 2023-06-19.

బయటి లింకులు

[మార్చు]