Jump to content

పంచశీల

వికీపీడియా నుండి

భారతదేశ విదేశాంగ విధాన లక్షణాల్లో ప్రధానమైంది పంచశీల. చైనాతో సంధి కుదుర్చుకొనే సందర్భంలో 1954 మే 29న భారతదేశ పంచశీల సూత్రాన్ని రూపొందించటం జరిగింది. పంచశీల అంటే అయిదు సూత్రాల నియమావళి.

పంచశీల సూత్రాలు:

  1. రాజ్యాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వం పట్ల పరస్పర అవగాహన
  2. దురాక్రమణకు పాల్పడకపోవడం
  3. ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం
  4. సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాలు
  5. శాంతియుత సహజీవనం

అంతర్జాతీయ సంబంధాల్లో ప్రంపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుకగా పంచశీలను భావిస్తారు.

పంచశీల ఒప్పందానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

[మార్చు]

భారత్, చైనా, మయన్మార్ దేశాల మధ్య శాంతి, సుహద్భావం కోసం పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకొని 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూడు దేశాల అధ్యక్షులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చైనా, భారత మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పంచసూత్రాలు ఇప్పటికీ వెలుగురేఖలుగా నిలిచాయని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. జిన్‌పింగ్ తిరిగి సందేశమిస్తూ పంచశీల స్ఫూర్తితో ఇరుదేశాల అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగుదామని పిలుపు నిచ్చారు. 20వ శతాబ్దపు అంతర్జాతీయ సంబంధాల్లో పంచశీల ఒప్పందం చారిత్రక ఘట్టమని మయన్మార్ అధ్యక్షుడు యూ థియాన్‌సేన్ పేర్కొన్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పంచశీల&oldid=3856760" నుండి వెలికితీశారు