బేసిక్ ఇన్‌స్టింక్ట్
బేసిక్ ఇన్‌స్టింక్ట్ | |
---|---|
దస్త్రం:Basic Instinct.png | |
దర్శకత్వం | Paul Verhoeven |
రచన | Joe Eszterhas |
నిర్మాత | Alan Marshall Mario Kassar |
తారాగణం | |
ఛాయాగ్రహణం | Jan de Bont |
కూర్పు | Frank J. Urioste |
సంగీతం | Jerry Goldsmith |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు |
|
విడుదల తేదీs | మార్చి 18, 1992(Los Angeles) మార్చి 20, 1992 (United States) మే 8, 1992 (France, United Kingdom) |
సినిమా నిడివి | 128 నిమిషాలు[1] |
దేశాలు |
|
భాష | ఆంగ్లం |
బడ్జెట్ | $49 million |
బాక్సాఫీసు | $352.9 million[2] |
బేసిక్ ఇన్‌స్టింక్ట్ అనేది 1992లో వచ్చిన కామోద్దీపనాత్మక, ఉత్కంఠభరిత నియొ-న్వారు[3] చిత్రం. దీని కథ జో ఎస్టెర్హాస్ వ్రాయగా, పాల్ వర్హోవెన్ దర్శకత్వం చేశాడు. కథ మొత్తం ఒక ప్రముఖ గాయకుడి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న శాన్ ఫ్రాన్సిస్కో డిటెక్టివ్ నిక్ కరన్ (మైకల్ డగ్లస్) చుట్టూ తిరుగుతుంటుంది. ఈ హత్యలో ప్రధాన అనుమానితురాలు విచిత్ర స్వభావం గల రచయిత్రి; క్యాథరీన్ ట్రెమెల్ (షరాన్ స్టోన్). దర్యాప్తులో భాగంగా కలుసుకున్న వాళ్ళిద్దరి మధ్యా ఒక సమస్యాత్మక శారీరక సంబంధం ఏర్పడుతుంది.
ఎస్టెర్హాస్ 1980ల్లో ఈ కథను తయారు చేశాడు. విపరీతమైన పోటీ మధ్యలో చివరకు కరోల్కో పిక్చర్స్ నిర్మాణ హక్కులను చేజిక్కించుకుంది. ఆ తరువాత దర్శకుడిగా వర్హోవెన్ ఎంపికయ్యాడు. ట్రెమెల్ పాత్రకు చాలా మంది నటీమణులను పరిగణలోకి తీసుకుని, చివరికి స్టోన్‌ను ఎన్నుకోగా, స్టోన్, డగ్లస్‌లు ప్రధాన పాత్రధారులుగా చేరారు. బలత్కార సన్నివేశంతో పాటు ఇతర విపరీత శృంగార, హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయనే వివాదాలు విడుదలకు ముందే ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. స్వలింగ సంపర్కుల మధ్య సంబంధాలను చూపించిన విధానాన్నీ, బై సెక్సువల్ అమ్మాయిని ఒక మానసిక రుగ్మత ఉన్న హంతకురాలిగా[4][5] చూపించడాన్నీ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు విమర్శించారు. ఒక సన్నివేశములో స్టోన్ కాలు మీద కాలు వేసుకుంటుండగా ఆవిడ జననేంద్రియము కనిపిస్తుంది. ఈ విషయాన్ని తనకు ముందు (చిత్రీకరణలో) చెప్పలేదని ఆవిడ ఆరోపించగా, దర్శకుడు దాన్ని ఖండించాడు.[6][7]
ఈ చిత్రం విడుదలకు ముందు 1972, మార్చి 18న లాస్ ఏంజిలెస్‌లో ప్రదర్శించారు. అమెరికాలో 1972, మార్చ్ 20న ట్రై స్టార్ పిక్చర్స్ దీన్ని విడుదల చేసింది.[8] నటీనటులూ, సంగీతం, ఎడిటింగ్‌ను కొనియాడిన విమర్శకులు, కథా, పాత్రల తీరుతెన్నులను విమర్శించారు. వివాదాలతో పాటు విమర్శలు ఎదురైనప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 352 మిలియన్ డాలర్లు (అంటే సుమారు 35 కోట్లు) వసూలు చేసింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రాల్లో దీనిది నాలుగవ స్థానం. మొదటి మూడు చిత్రాలు: డిస్నీ అలాద్దీన్, ద బాడీగార్డ్, హోమ్ ఎలోన్-2: లాస్ట్ ఇన్ న్యూ యార్క్.[9] తరువాత ఉత్తర అమెరికాలో ప్రదర్శించని అదనపు సన్నివేశాలతో ఈ చిత్రం వీడియో క్యాసెట్, డివిడి, బ్లు-రేలలో విడుదలైంది.[10]
తరువాతి కాలంలో ఈ చిత్రం లైంగికతను చూపించిన విభిన్నమైన విధానానికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక నిపుణుడు దీని గురించి చెబుతూ "ఫిల్మ్ న్వార్ నియమాలను అనుగుణంగా మలుచుకుంటూ, వాటి పరిమితులను అధిగమించిన ఒక నియొ-న్వారు కళాఖండం" అని దీని గురించి చెప్పారు.[11] 4 ఏళ్ళ తరువాత దీనికి కొనసాగింపుగా బేసిక్ ఇన్‌స్టింక్ట్-2 వచ్చింది. ఇందులోను స్టోన్ నటించింది. వర్హోవెన్‌కు మాత్రం ఈ చిత్రంతో సంబంధం లేదు. ఈ కొనసాగింపు చిత్రం పెద్దగా ఆడలేదు.[12][13]
కథ
[మార్చు]శాన్ ఫ్రాన్సికోలో డిటెక్టివ్ నిక్ కరన్ అప్పటికే పాటలు పాడటం విరమించుకున్న ఒక ప్రముఖ గాయకుడైన జానీ బోజ్ హత్య కేసును దర్యాప్తు చేస్తూ ఉంటాడు. ఇతను ఒకమ్మాయితో రతిలోనుండగా ఐస్ పిక్‌తో పొడిచి చంపబడిఉంటాడు. ఆ అమ్మాయి లేత రంగు జుట్టు ఉన్నామె అని తప్పితే తనెవరన్నది తెలియలేదు. ఐతే జానీ ప్రియురాలు, నేర ప్రధాన నవలల రచయిత్రి క్యాథరీన్ ట్రెమెల్ రాసిన నవలలో ఒక నేరం అచ్చం ఇలాగే ఉంటుంది. దీనితో నిక్ ఆమెను అనుమానిస్తాడు. చివరికి క్యాథరీన్ ఐనా హత్య చేసుండాలి లేదా తననెవరైనా ఇరికిస్తూ ఉండాలి అనే నిర్ధారణకు వస్తాడు. తదుపరి విచారణలో క్యాథరీన్ అధికారులకు సహకరించకుండా, పొగ తాగుతూ, కవ్విస్తూ, ప్రేరక భంగిమల్లో కూర్చుంటూ సమాధానాలిస్తుంది. చివరికి నిజ నిరూపణ పరీక్షలో ఏ ఋజువులూ దొరకకపోవడంతో ఆమెను వదిలేస్తారు. మరింత విచారించగా క్యాథరీన్ కు హంతకులతో స్నేహాలుండేవనీ; మచ్చుకు ఆమె ప్రియురాలు రోక్సీ 16 ఏళ్ళ వయసులో అకారణంగా తన తమ్ముళ్ళను చంపుకుందనీ, అలాగే క్యాథరీన్ స్నేహితురాలు హేజెల్ డొబ్కిన్స్ ఏ కారణం లేకుండా తన భర్తనీ, పిల్లల్నీ చంపుకుందనీ తెలుసుకుంటాడు.
విధుల్లో భాగంగా మారువేషంలో ఉండగా, కొకైన్ మత్తులో నిక్ పొరపాటున ఇద్దరు యాత్రికులను కాలుస్తాడు. దీనితో అతను పోలీస్ మానసిక నిపుణురాలు డా॥ బెథ్ గార్నర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈమెతో కూడా నిక్‌కు లైంగిక సంబంధం ఉంటుంది. అదే సమయంలో నిక్, క్యాథరీన్ తన కొత్త నవలలో ముఖ్య పాత్రని నిక్ ఆధారంగా తయారు చేస్తోందనీ, తన ప్రియురాలి విషయంలో ఇబ్బందుల వలన అందులో కథానాయకుడు హత్య చేయబడతాడనీ నిక్ అర్థం చేసుకుంటాడు. అంతర్గత సమాచార విభాగంలోని లెఫ్టినెంట్ మార్టీ నీల్సన్‌కు లంచమిచ్చి క్యాథరీన్ ఇతడి సొంత విషయాలను తెలుసుకుని ఉండవచ్చని నిక్ అనుమానిస్తాడు. ఇంతకు మునుపు ఇతడి మానసిక ఇబ్బందులకు సంబంధించిన దస్త్రం తనకు ఇవ్వాలనీ, లేకుంటే నిక్‌ను పనిలో నుంచి తీసేయాల్సి వస్తుందనీ బెథ్‌పై ఒత్తిడి తెచ్చి, ఆ దస్త్రాన్ని నీల్సన్ తీసుకోవడం కూడా ఆ అనుమానాన్ని బలోపేతం చేస్తుంది. కోపంతో నిక్ నీల్సన్ కార్యాలయంలో అతనిపై చేయిజేసుకుంటాడు. దీని వలన తరువాత కొన్నాళ్ళకి నీల్సన్ హత్య జరిగినప్పుడు నిక్ ప్రధాన అనుమానితుడు అవుతాడు. ఈ హత్య కూడా క్యాథరీన్ చేసుండొచ్చని నిక్ అనుమానిస్తాడు కానీ, అతని ప్రవర్తన మరీ అభ్యంతరకరంగా మారడంతో నిక్ బలవంతంగా సెలవుపై పంపుతారు.
నిక్ క్యాథరీన్ పై విచారణ కొనసాగిస్తూ, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, క్యాథరీన్ తాను నిర్దోషినని ఋజువు చేసుకోవడానికి చూస్తుంటుంది. ఇది జరుగుతుండగానే వీరిద్దరి మధ్యా లైంగిక సంబంధం ఏర్పడుతుంది. ఒకనాడు క్లబ్‌లో నిక్, క్యాథరీన్, రోక్సీ, ఇంకా ఇంకొక అబ్బాయీ, ముగ్గురూ కొకైన్ తీసుకోవడం చూస్తాడు. ఆ తరువాత నిక్ కాసేపు క్యాథరీన్ తో నర్తించగా, ఇద్దరూ ముద్దులాడుకుంటారు. మరికొంత సేపటికి క్యాథరీన్ ఇంట్లో ఇద్దరూ ఒకలాంటి తీవ్రస్థాయి శృంగారంలో మునుగుతారు. వీరిని రహస్యంగా చూసిన రోక్సి, నిక్‌పై అసూయ పెంచుకుంటుంది. అతన్ని కారుతో గుద్ది చంపబోగా, ఆ కారు వేరేచోట గుద్దుకుని రోక్సి చనిపోతుంది. రోక్సి చావు గురించి చింతిస్తూ, రోక్సి లాగే కళాశాలలో చదువుకునే నాళ్ళలో తనకింకొక ప్రియురాలు ఉండేదనీ, ఇలాగే బాగా అసూయ పెంచుకోవడంతో తనని దూరం పెట్టాల్సి వచ్చిందనీ క్యాథరీన్ నిక్‌కు చెబుతుంది. ఇదంతా విన్న నిక్ బహుశా బోజ్‌ను చంపింది క్యాథరీన్ కాదేమోనని అనుకుంటాడు. మరింత విచారించి, క్యాథరీన్ చెబుతున్న ఆ కళాశాల నాళ్ళ నాటి ప్రియురాలు డా॥ బెథ్ అని తెలుసుకుంటాడు. ఆమెను ఈ విషయంపై అడగగా, అది నిజమేననీ, ఐతే అసూయ పెంచుకున్నది క్యాథరీన్ అనీ, అందుకుగాను తానే ఆమెని దూరం పెట్టాననీ బెథ్ చెబుతుంది. ఇంతేకాక వీళ్ళద్దరి అధ్యాపకుడు ఒకరి హత్య కేసు ఆనాడు అపరిష్కృతంగా మిగిలిపోయిందనీ, అతడూ బోజ్ మాదిరిగా ఐస్ పిక్‌తోనే చంపబడ్డాడనీ, ఆ సంఘటనలు క్యాథరీన్ మొదటి నవలల్లో ఒకదానికి ఆధారమయ్యాయనీ నిక్ కనుక్కుంటాడు.
క్యాథరీన్ నవల చివర్లో ఆ నవలలోని డిటెక్టివ్ తన సహోద్యోగి శవాన్ని లిఫ్ట్‌లో కనుక్కోవడం నిక్ కంట పడుతుంది. ఇంతలో క్యాథరీన్ నిక్‌ను దూరం పెడుతుంది. దీనితో నిక్ నొచ్చుకోవడమే కాక, తనకి క్యాథరీన్ పైనున్న అనుమానం పెరుగుతుంది. నిక్ సహోద్యోగి గస్ మొరన్, క్యాథరీన్ కు కళాశాలలో రూమ్మేట్ ఐన మరో మహిళను నిక్ కలుసుకునేలా రంగం సిద్ధం చేస్తాడు. తనని కలుసుకుని క్యాథరీన్, బెథ్‌ల మధ్య ఏమి జరిగిందనే విషయం ఇంకాస్త ఆరా తీయాలన్నది వీళ్ళ ఆలోచన. గస్‌కై నిక్ కార్లో వేచి ఉండగా, లిఫ్ట్‌లో ఉన్న గస్ ఐస్ పిక్‌తో హత్య చేయబడతాడు. ఇంతలో క్యాథరీన్ నవల్లో చివరి పేజీలు గుర్తు చేసుకున్న నిక్, గస్‌ను చూసేందుకై పరిగెత్తుకొచ్చి, నవల్లో మాదిరిగానే అతని శవం అక్కడ పడి ఉండడాన్ని చూస్తాడు. సరిగ్గా అప్పుడే బెథ్ అక్కడికి వస్తుంది. గస్‌ను కలవమని తనకి సందేశం వచ్చిందనీ, తనను కలవాలనీ అడుగుతుంది. బెథ్ ఈ హత్య చేసిందని అనుమానించిన నిక్, ఆమె చేత్తో ఏదో అందుకోబోతుండగా, ఆమె ఏదో ఆయుధాన్ని తీసుకోబోతుందనుకుని ఆమెను కాలుస్తాడు. తీరా చూస్తే ఆమె తన తాళం చెవిని అందుకోబోతూ ఉంటుంది.
బెథ్ ఇంట్లో దొరికిన వివిధ ఆధారాలు ఆమే బోజ్, నీల్సన్, మొరన్‌లనూ, అలాగే తన భర్తనూ చంపిందనేందుకు సానుకూలంగా ఉంటాయి. అలాగే క్యాథరీన్ చిత్రాలూ, పత్రికల్లోని క్యాథరీన్ కథనాల సేకరణ ఆమె ఇంట్లో దొరకడాన్ని బట్టి ఆమెకు క్యాథరీన్ పై పిచ్చి ప్రేమ ఉందని అందరికీ అనిపిస్తుంది. దీనితో ఏమీ పాలుపోక నిక్ ఇంటికి రాగా, అక్కడ క్యాథరీన్ తనని కలుసుకుంటుంది. తనకు కావలసిన వాళ్ళందరూ చనిపోతున్నారనీ, కనుక వారిద్దరూ దూరంగా ఉంటే మంచిదనీ ఆమె సూచిస్తుంది గానీ, చివరకు వారిద్దరూ రమిస్తారు. ఆ తరువాత వారి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటుండగా, మంచం కింద ఒక ఐస్ పిక్ ఉన్నట్లు చూపించబడుతుంది.
నటీనటులు
[మార్చు]నిర్మాణం
[మార్చు]1980ల్లో తయారైన స్క్రీన్‌ప్లేను వేలంపాటలో విపరీతమైన పోటీ మధ్య కరోల్కో పిక్చర్స్ 3 మిలియన్ యు.ఎస్. డాలర్లకు (30 లక్షల డాలర్లు) కొనుక్కుంది.[14][15] ఫ్లాష్ డాన్స్ (1983), జాగ్డ్ ఎడ్జ్ (1985) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలిచ్చిన ఎస్టెర్హాస్, ఈ చిత్ర కథను 13 రోజుల్లో వ్రాసాడు.[16] ఐతే వర్హోవెన్ కథలో కొన్ని మార్పులడగగా, ఎస్టెర్హాస్ వాటికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఇద్దరు స్వలింగ సంపర్కులైన స్త్రీల మధ్య శృంగార సన్నివేశాన్ని చేర్చాలన్న ఆలోచనను ఎస్టెర్హాస్ తీవ్రంగా వ్యతిరేకించారు.[8] వర్హోవెన్ పట్టు విడవకపోవడంతో ఎస్టెర్హాస్, అలాగే నిర్మాత అర్విన్ వింక్లర్‌లు చిత్ర నిర్మాణం నుండి తప్పుకున్నారు.
తరువాత కథలో మార్పులు చేసేందుకు గెరి గోల్డ్‌మెన్ నియమించబడ్డారు. వర్హోవెన్ సూచన మేరకు ఆయన కథను నాలుగు సార్లు తిరగవ్రాసారు. నాలుగోసారి వ్రాసినది చుసాక తన ప్రతిపాదనల్లో కథకు కావలసిన నాటకీయత లేదని, అవి మరీ పిచ్చిగా ఉన్నాయనీ వర్హోవెన్ ఒప్పుకున్నారు. ఐదో సారి తిరగవ్రాసి, చిన్నచిన్న మార్పులు చేర్పులతో దాదాపుగా ఎస్టెర్హాస్ మొదట వ్రాసిన కథకే వచ్చారు.[17] తరువాత జో ఎస్టెర్హాస్ పేరును చిత్రానికి ఏకైక కథకుడిగా వేసారు.
కారులో వెంబడించే సన్నివేశానికి సిద్ధమయ్యేందుకు డగ్లస్ ఒక నాలుగు రాత్రులు శాన్‌ఫ్రాన్సిస్కోలోని కెర్నీ వీధిలోని మెట్ల మీదకి కారును ఎక్కించారు. డగ్లస్ క్యాథరీన్ ట్రమెల్ పాత్రకు కిమ్ బెసింగర్‌ను సూచించాడు కానీ ఆమె ఈ అవకాశాన్ని నిరాకరించింది.[18] ఆయన సూచించిన ఇతర పేర్లు జూలియా రాబర్ట్స్,[19] గ్రేట స్కక్కి,[20] మెగ్ రయన్.[21] వీళ్ళందరూ ఈ అవకాశాన్ని నిరాకరించారు. మిషెల్ ఫైఫర్, జీనా డెయ్విస్, ఖెథ్లీన్ టర్నర్, ఖెలి లిన్చ్, ఎలన్ బార్కిన్, మరియెల్ హెమింగ్వెలు నిర్మాతలు ఈ పాత్రకు అడిగిన ఇతర నటిలు. వీరందరూ ఈ అవకాశాన్ని వద్దన్నారు.[14][22] వర్హోవెన్ డెమీ మూర్‌ను కూడా పరిగణించాడు.[23] ఐతే చివరికి స్టోన్ ఈ పాత్రకు ఎంపికయ్యారు. ఈ చిత్రం తీసే సమయానికి స్టోన్‌కు ఇంకా అంత పేరు లేదు కానీ, ఆవిడ టోటల్ రికాల్‌లో వర్హోవెన్ తో పనిచేసారు. ఆ చిత్రంలో తన పాత్ర చంపబడే ముందు వెంటనే ఆమె భావోద్వేగాల్లో చూపించిన మార్పు, అతన్ని ఆమెను ఎంపిక చేసుకునేలా చేసిందని వర్హోవెన్ అన్నారు. "ఆ మార్పు నన్ను చాలా ఆకర్షించింది. ఆమె కళ్ళల్లోని దుర్మార్గమంతా రెండు సెకెన్లలో ప్రాణం మీద తీపిగా మారిపోయింది."[24] ఆమె పారితోషికం $5,00,000. చిత్ర నిర్మాణ వ్యయంతో పోల్చితే ఇది తక్కువే.[ఆధారం చూపాలి] మైక్ డగ్లస్ చిత్రంలో ఇంకో పెద్ద నటి ఉండాలని పట్టుబట్టారు. ఆయనొక్కరే చిత్రం యొక్క భారాన్ని మోయటానికి సముఖంగా లేరు.[19]
శాన్‌ఫ్రాన్సిస్కోలో చిత్రీకరణకు స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమకారులు హాజరయ్యారు.[25] శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు జనాలను అదుపులో ఉంచగా బందోబస్తు మధ్యన చిత్రీకరణ జరిగింది. ఇవికాక చిత్రీకరణ జరిగిన స్థలాల పక్కన నిరసనకారులు "మీకు 49ers ఇష్టమైతే హారన్ కొట్టండి", "మీరు మగాళ్ళని ఇష్టపడే వాళ్ళైతే హారన్ కొట్టండి" అని వ్రాసి ఉన్న సంజ్ఞలు పట్టుకుని నిలబడ్డారు. ఇక చిత్రీకరణ జరుగు చోట్ల కొందరు లేజర్లూ, ఈలలతో చిత్రీకరణకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేసారు. పోలీసులు తగిన ఆదేశాలతో చిత్రీకరణ స్థలాల్లో ఉన్నప్పటికీ నిర్మాత ఎలన్ మార్షల్ అరెస్ట్ చేయవలసిన నిరసనకారులను ఒక్కొక్కరినీ తానే స్వయంగా ఎన్నుకున్నారు. ఈ పని వలన తరువాత మార్షల్ సిటిజన్స్ అరెస్ట్‌కు గురయ్యారు కానీ పోలీసుల నుండి పరిణామాలేమీ ఎదుర్కోలేదు.[8]
ఒక సన్నివేశములో స్టోన్ కాలు మీద కాలు వేసుకుంటుండగా ఆమె జననాంగము చిత్రీకరించబడింది. ఆమె పాత్ర లోదుస్తులు వేసుకోలేదన్న విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది కానీ ఇలా నేరుగా చూపించబడుతుందని తాను అనుకోలేదని స్టోన్ తర్వాత అన్నారు.[26] తాను తెల్ల నిక్కరు వేసుకున్నాననీ, కానీ కెమెరా మీదకి ఆ నిక్కర్ వెలుగు కొడుతుండడంతో వెర్హోవెన్ దాన్ని తీసేయమన్నారనీ, తెరపై కేవలం తన నీడ మాత్రమే కనబడుతుందని ఆయన భరోసా ఇచ్చారనీ ఆవిడ ఆరోపించారు. తరువాత స్క్రీనింగ్‌లో అందరితో కలిసి చూస్తునప్పుడే తనకు అసలు విషయం తెలిసిందనీ, వెంటనే వెర్హోవెన్‌ను చెంప మీద కొట్టి, తాను అక్కణ్ణుంచి వెళ్ళిపోయానని కూడా ఆవిడ అన్నారు.[7] వెర్హోవెన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఆవిడ అంగం తెరపై కనిపిస్తుందన్న విషయం ఆవిడకి పూర్తిగా తెలియజేయబడ్డదని అన్నారు.[27]
తన పాత్రకీ డగ్లస్‌కీ మధ్యన ఉన్న తీవ్రమైన శృంగార సన్నివేశం, తనకు చిత్రీకరణకు ముందు వివరించేటప్పుడు వెర్హోవెన్ ఆ తీవ్రతను బాగా తగ్గించి చెప్పారని జోన్ ట్రిపుల్హార్న్ అన్నారు.[28]
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి జెర్రీ గోల్డ్‌స్మిత్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రానికి గాను ఆయన పేరు ఎకడమీ పురస్కారానికీ, గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికీ ప్రతిపాదించబడింది.[29] గోల్డ్‌స్మిత్ మాట్లాడుతూ "నేను చేసిన వాటికి బహుశా అన్నిటికంటే కష్టమైనది బేసిక్ ఇన్‌స్టింక్ట్. విభిన్న పాత్రలు గల ఒక క్లిష్టమైన కథ ఇది. ఇది మర్డర్ మిస్టరీనే కానీ మర్డర్ మిస్టరీ కాదు. దర్శకులు పౌల్ వెర్హోవెన్‌కు నాయిక పాత్ర ఎలా ఉండాలనే దాని పై ఒక స్పష్టత ఉంది. కానీ నాకు ఆ తీరుతెన్నులు ఒక పటాన అర్థం కాలేదు. పౌల్ ప్రోత్సాహం వలనే నేను కూర్చిన అత్యుత్తమ స్వరాల్లో ఇది ఒకటైందని అనుకుంటున్నాను. అసలైన కలిసి పనిచేయడం అంటే అదే."[30]
స్వరాలు మార్చ్ 17, 1992లో విడుదలయ్యాయి. అప్పుడు విడుదల కాని అదనపు స్వరాలనూ, అలాగే విడుదలైన వాటికి ప్రత్యామ్నాయ కూర్పులనూ కలిపి 2004లో ప్రమీథియస్ రికార్డ్స్ వెలువరించింది.
మొదటి విడుదల స్వరాలు
[మార్చు]ప్రమీథియస్ వెలువరణ
[మార్చు]చిత్ర విడుదల
[మార్చు]ఎం.పి.ఎ రేటింగ్
[మార్చు]ఈ చిత్రానికి "బలమైన హింసా, ప్రేరపిత సన్నివేశాలూ, మాదకద్రవ్యాల వాడకం, భాష"కు గానూ ఆర్ రేటింగ్ ఇవ్వబడింది. మొదట ఎన్.సి-17 రేటింగ్ ఇవ్వబడినప్పటికీ, ఆ రేటింగ్ వలన వ్యాపార విస్తృతి తగ్గుతుంది కనుక, ట్రై స్టార్, కరొల్కో సంస్థలు వెర్హోవెన్ పై ఒత్తిడి తెచ్చాయి. దీనితో అతను 35–40 సెకన్ల సన్నివేశాలు కత్తిరించి, ఆర్ రేటింగ్ తెచ్చాడు.[14] ఆయన చేసిన మార్పులను గురించి మార్చ్ 1992లో ద న్యూ యార్క్ టైమ్స్ పత్రికకు ఆయనిలా చెప్పారు:
“ | నిజానికి నేనేమీ ఎక్కువగా తీసేయాల్సి రాలేదు. కొన్ని దిశలను మార్చాను. కొంచెం ఏటవాలుగా చూపించి, మరీ నేరుగా కనబడకుండా చేసాను.[14] | ” |
థియేటర్లు
[మార్చు]మార్చ్ 20, 1992న చిత్రం థియేటర్లలో విడుదలయ్యింది.
ఇతర మాధ్యమాలు
[మార్చు]థియేటర్లలో విడుదల తరువాత కత్తిరింపులు లేని రూపంలో అన్‌రేటెడ్‌గా పేర్కొంటూ, 1992లో వీడియో విడుదలైంది. దీని నిడివి 129 నిముషాలు. థియేటర్లలో విడుదలైన ఆర్-రేటెడ్ రూపాన్ని 1997లో డివిడిగా విడుదల చేసారు. 2001లో కత్తిరింపులు లేని రూపంతో పాటు కమిల్ పాల్య వ్యాఖ్యానం, ఇంకా ఒక చిన్న ఐస్ పిక్‌లతో (ప్రతినాయకురాలు వాడిన ఆయుధం) ఒక 'కలెక్టర్స్ ఎడిషన్' విడుదలైంది. 127 నిమిషాల నిడివి ఉన్న ఇది మరలా 2003లో ఒకసారీ, 2006లో ఒకసారీ ఇలా ఇంకో రెండు సార్లు విడుదలైంది.[మూలాన్ని నిర్థారించాలి]
మార్చ్ 2006లో అన్‌రేటెడ్ వెర్షన్ డివీడిగా పునర్విడుదలయ్యింది. దీన్ని అల్టిమేట్ ఎడిషన్‌గా లేబుల్ చేసినప్పటికీ, డైరెక్టర్స్ కట్ అనే పేరు కూడా వాడబడింది. 2007లో డైరెక్టర్స్ కట్ లేబుల్‌తో బ్లూ-రేలో విడుదలైంది.
అన్‌రేటెడ్ వెర్షన్‌లో అదనంగా ఉన్న సన్నివేశాలు:
- మొదటి సన్నివేశంలో జానీ బోజ్ హత్య. కత్తిరింపులు లేని రూపంలో హంతకురాలు బోజ్‌ను మెడ మీదా, ఛాతిలో ముక్కులో పొడుస్తుంటుంది. ఒక పక్క పొడుస్తూనే ఇంకొపక్క నాటుగా రతిని కొనసాగిస్తూనే ఉంటుంది.
- కత్తిరించిన రూపంలో నిక్, బెథ్‌ల శృంగార సన్నివేశములో అతను ఆమె బట్టల్ని చింపేస్తూ, ఆమెను మంచమ్మీదకి తోస్తాడు. తరువాతి సన్నివేశములో వారిద్దరూ నేల పైన పడి ఉంటారు. కత్తిరింపులు లేని రూపంలో వారిద్దరూ నాటుగా రమించడం చూపించబడింది.
- క్లబ్‌లో కలుసుకున్న తరువాత నిక్, ట్రమెల్‌ల సంభోగం నిడివి పెంచి, మరింత తేటగా చూపబడింది.
దర్శకుని పర్యవేక్షణలో, 2019–20లో, చిత్రం దాని 35mm నెగిటివ్ నుండి 4k లోకి స్టూడియో కెనాల్‌చే రీస్టోర్ చేయబడ్డది. ఈ రిస్టోర్డ్ వెర్షన్ యు.కెలో బ్లూ-రె, డివీడీ, డిజిటల్ డౌన్లోడ్లకు జూన్ 14,2021న విడుదల చేయబడింది. 2021లో ఆస్ట్రేలియాలో జులై 7, న్యూజిలాండ్‌లలో జులై 14న విడుదలకు సిద్ధమవుతున్నది.
ఈ వ్యాసం లోని భాగాలను (ఇతర మాధ్యమాలు కు సంబంధించిన వాటిని) తాజాకరించాలి. |
ఈ విడుదలలో కొత్తగా "బేసిక్ ఇన్‌స్టింక్ట్, సెక్స్, డెత్ & స్టోన్" అనే డాక్యుమెంటరీ కూడా జత చేయబడ్డది.[31]
భారతదేశం
[మార్చు]ఈ చిత్రం భారతదేశంలో అంతర్జాలంలో అగస్టు 4, 2020లో విడుదల అయ్యింది. బేసిక్ ఇన్‌స్టింక్ట్ తోపాటు డేంజరస్ డిసైర్ అనే పేరు కూడా దీనికి ఇవ్వబడింది. ఖతర్నాక్ చాహత్ అనే పేరుతో హిందీలోకి అనువదించబడింది.[32]
చిత్ర ఫలితం
[మార్చు]వసూళ్ళు
[మార్చు]ఈ చిత్రం మొదటివారంలో $15 మిల్యన్ (అంటే $1.5 కోట్లు) రాగా, ప్రపంచవ్యాప్తంగా $35,29,27,224 ఆర్జించి, 1992లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలబడింది.[33] ఇటలీలో 155 తెరల్లో ఆడగా మొదటివారంలో గ్రాస్ $5.44 మిల్యన్లు ($54.4 లక్షలు) వసూలు చేసి రికార్డు సృష్టించింది.[34] స్పెయిన్‌లో $21.6 మిల్యన్ ($2.16 కోట్లు) గ్రాస్‌తో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా నిలిచింది.[35][36]
విమర్శకుల స్పందన
[మార్చు]ఈ చిత్రానికి విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. రొటెన్ టమేటోస్‌లో 70 సమీక్షల ఆధారంగా 56% స్కోరూ, 6.10/10 సగటు రేటింగ్ సాధించగా, దీని ఏకాభిప్రాయం ఇలా ఉంది: "అక్కడక్కడా హిచ్‌కాక్ శైలిని తలపించే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌లో షారన్ స్టోన్ ఒక తారగా ఎదిగేందుకు సరిపడా ప్రతిభ కనబర్చారు కానీ, మరీ జుగుప్సాకరంగా, అభ్యంతరకరంగా ఉన్న కథ వలన ఆ నటన వృథా అయ్యింది."[37] మెటాక్రిటిక్‌లో 28 మంది విమర్శకుల సమీక్షల ఆధారంగా చిత్రం యొక్క స్కోర్ 41 గా ఇవ్వబడింది. ఈ స్కోర్ మిశ్రమ సమీక్షలను లేదా ఫర్వాలేదనే ఉద్దేశమిచ్చిన సమీక్షలను సూచిస్తుంది.[38] సినిమాస్కోర్ జరిపిన ప్రేక్షకుల అభిప్రాయ సేకరణలో A+–F మధ్యలో "B+" గ్రేడ్ ఇవ్వబడింది.[39]
న్యూయార్క్ టైమ్స్ విమర్శకురాలు జ్యానిట్ మస్లిన్ చిత్రాన్ని పొగుడుతూ ఇలా అన్నారు: "బేసిక్ ఇన్‌స్టింక్ట్ ఆక్షన్ చిత్రాలు తీయటంలో వర్హోవెన్‌కు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని, హిచ్‌కాక్ తరహా జిజ్ఞాసాత్మక సరుకు వైపుకు మళ్ళించగా, ఫలితాలకు అర్థం పర్థం లేనప్పుడు కూడా అవి మనల్ని అంతర్లీనంగా కుదిపేస్తాయి."New York Times[permanent dead link]. Retrieved November 5, 2007. మాస పత్రిక రోలింగ్ స్టోన్ విమర్శకుడు పీటర్ ట్రావర్స్ చిత్రాన్ని పొగుడుతూ దీన్ని ఒక గిల్టీ ప్లెషర్ చిత్రంగా అన్నారు. వెర్హోవెన్ దర్శకత్వం గురించి చెబుతూ అతని ప్రియాతిప్రియమైన దినుసులున్న కథతో అతను తీసిన చిత్రం అది ఇవ్వాల్సిన సరుకును ఇచ్చిందనీ, ముఖ్యంగా షారన్ స్టోన్ ఐహిక వాంఛలు రేపేటి తన పొగరెక్కిన నడకతో తెర కమిలిపోయేటంత వేడిని రగిలించారని అన్నారు. అలాగే స్టోన్ నటనను పొగుడుతూ: "మొన్నటి వరకు మోడల్ ఐన స్టోన్ మతి పోగొట్టేలా ఉంది. వెర్హోవెన్ చిత్రం టోటల్ రికాల్‌లో ఆర్నాల్డ్ కోపాన్ని ఈమె నషాళానికి అంటించింది కూడా. కాకపోతే చాలా చిరాకు తెప్పించే చిత్రాల్లో (హీ సెడ్, షీ సెడ్; ఇర్రికన్సైలబుల్ డిఫరెన్సెస్) ఏకైక సానుకూలాంశము అవ్వడం ఆమె ప్రస్థానాన్ని నిలువరించింది. బేసిక్ ఇన్‌స్టింక్ట్ స్టోన్‌ని తొంభైలకి శృంగార తాలగా నిలబెట్టినప్పటికీ, ఒక నవ్వు నవ్వాలన్నా, ఒక ఉద్వేగాన్ని చూపించాలన్నా ఆమె అంతే సమర్థవంతంగా చేయగలదని కూడా ఈ చిత్రంతో తెలుస్తోంది."[40]
ఆస్ట్రేలియా విమర్శకుడు షనన్ జె. హార్వే సండే టైమ్స్ పత్రికకు వ్రాస్తూ ఇలా అన్నారు: "1990ల్లోని అత్యుత్తమ నిర్మాణాల్లో ఒకటైన ఇది, ఏ ఒక్క స్త్రీ వాద ప్రదర్శన చేసినదానికంటే కూడా మహిళా సాధికారికతకు ఎక్కువ చేసింది. స్టోన్, తనను తార స్థాయిని ఇచ్చిన ఈ పాత్రలో వేడి పుట్టించేంత ఆకర్షణీయంగానూ, ఐస్ పిక్ అంత చల్లగానూ ఉన్నారు."[41]
చిత్రాన్ని విమర్శించిన వారు చాలా మందే ఉన్నారు.[42] షికాగో సన్-టైమ్స్ విమర్శకులు రోజర్ ఈబర్ట్ నాలుగింటికి రెండు ఇస్తూ, చిత్రాన్ని బాగా తీసారు కానీ చివరి అరగంట నిరాశ పరిచిందని అన్నారు: "ఈ చలనచిత్రం ఒక పదవినోదం లాంటిది. పూరించేవరకు ఆసక్తికరంగా ఉంటుంది. అయిపోయాక మాత్రం ఖాళీలు నిండిపోయిన పనికిరాని చెత్త."[43] షికాగో ట్రిబ్యూన్ విమర్శకులు డేవ్ కెహ్ర్ ఈ చిత్రానికి ప్రతికూల సమీక్షనిస్తూ: "వెర్హోవెన్ చీకటి కోణాన్ని చూపించలేదు, ఊరికే వాడుకున్నారు. రెంటికీ చాలా తేడా ఉంది." అన్నారు.[44]
వివాదాలు
[మార్చు]చిత్రంలోని తేటైన శృంగార సన్నివేశాలూ, హింసా; ముఖ్యంగా బలాత్కార సన్నివేశం, వివాదాలను ఆకర్షించాయి. చిత్రీకరణ దశలోనే స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమకారులు, స్వలింగ సంపర్కులను తప్పుగా చూపించే పోకడను ఈ చిత్రం కూడా అనుసరిస్తోందంటూ తమ నిరసన వ్యక్తం చేసారు.[45] చిత్రం విడుదలైన నాడు రాత్రే స్వలింగ సంపర్క స్త్రీలూ, ద్విలింగ సంపర్కుల ఉద్రమకారుల బృందం 'లేబ్య' సభ్యులు నిరసన వ్యక్తం చేసారు. వేరేవాళ్ళు కూడా జనాల్ని చిత్రానికి వెళ్ళకుండా నిరుత్సాహ పరిచేందుకు థియేటర్ల వద్ద రకరకాల నినాదాలున్న అట్టలతో పడిగాపులు కాసారు. "నా ఐస్‌పిక్‌ను ముద్దాడండి", "హాలీవుడ్ స్వలింగ సంపర్కులపై హింసను ప్రోత్సహిస్తోంది", "క్యాథరిన్ చేసింది!"/ "డబ్బులు మిగుల్చుకోండి—ద్విలిగ సంపర్కురాలు చేసింది."—ఇవి వీరి నినాదాలు.[46] వెర్హోవెన్ బృందాలకు నిరసించే హక్కు ఉందని ఒప్పుకున్నారు కానీ వాళ్ళు ఆటంకపరచడాన్ని తప్పుబడుతూ "మీ గొంతెత్తడం ఫాసిజం కాదు. కుదరదు అంటే ఒప్పుకోకపోవడం—అదీ ఫాసిజం." అన్నారు.[47]
విమర్శకులు రోజర్ ఈబర్ట్ తన సమీక్షలో వివాదాలపై స్పందిస్తూ: "స్వలింగ సంపర్కులను దుర్మార్గులుగా చూపెట్టారనే ఆరోపణ విషయానికి వస్తే, ఈ చిత్రంలో డగ్లస్ మొదలుకొని పరలింగ సంపర్క పాత్రలను కూడా అంతే నీచంగా చూపించారని నిరసనకారులు గమనించాలి. అయినప్పటికీ హాలివుడ్ పట్టువదలకుండా స్వలింగ సంపర్కులను, ముఖ్యంగా స్త్రీలను వంకర బుద్ధులుగా, దుర్మార్గులుగా చూపిస్తోందనే విషయం గమనార్హమే."[48] ప్రముఖ అమెరికా స్త్రీ వాది కమిల్ పాల్యా నిరసనకారులను తప్పు పడుతూ స్టోన్ నటన "ఆడవారు చలనచిత్ర చరిత్రలో కనబర్చిన గొప్ప నటనల్లో ఒకట"నీ, ఆమె పాత్ర "మంచి మోహినీ లాంటి పాత్రల్లో ఒకటి. మోనా లీసానేనేమో అన్నంతగా, ఒక పేగన్ దేవతలాగా ఉంది అది." అనీ పొగిడింది.[49]
పొగ తాగడాన్ని ఆకర్షణీయంగా చూపించినందుకు కూడా చిత్రం విమర్శలనందుకుంది. రచయిత జో ఎస్టెర్హాస్ తరువాతి కాలంలో గొంతు క్యాన్సర్‌తో బాధపడ్డప్పుడు, తన చిత్రాల్లో పొగ తాగడాన్ని ఆకర్షణీయంగా చూపించినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.[50]
చిత్ర విడుదల నుండి కూడా, స్టోన్ తాను కాలు మిద కాలు వేసుకుంటుండగా తన జననాంగము కనబడే సన్నివేశంలో, ఆమె అంగము తెరపై కనబడబోతోందనే విషయం తనకు చెప్పకుండా తీసారని చాలా సార్లు ఆరోపించారు.[7] 1998లో ఇన్సైడ్ ద ఏక్టర్స్ సూడియో వారి ముఖాముఖిలో మాట్లాడుతూ, ముందు తాను కోపగించుకున్నా, దర్శకుని నిర్ఢయం సరైనదేనని తరువాత అర్థం చేసుకున్నానన్నారు: "కొన్నాళ్ళు ఆలోచించాను దీని గురించి. నాకు లోలోపల తెలుసు అతను సరిగ్గానే చేసాడని. అది ఉన్నది అన్న విషయమే నాకు అసహ్యం తెప్పించేది. అంతకంటే నేను అసహ్యించుకునేది ఏమిటంటే, ఆ సన్నివేశానికి ఒప్పుకోవాలో వద్దో నిర్ణయించుకునే అవకాశమివ్వకుండా అతను నా నుండి ఆ సన్నివేశాన్ని దోచుకున్నాడన్నది. కానీ అతను సరిగ్గానే చేసాడు."[51] 2001లో తన స్వానుభవ చరిత్రలో కూడా ఈవిడ సన్నివేశంపై వెర్హోవెన్ తనని తప్పుదారి పట్టించారనీ, కానీ ఆమె అతనిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వదిలేసానని ఆరోపించారు.[52] దీని పై వెర్హోవెన్ స్పందిస్తూ అది అసాధ్యమనీ, తాము ఏమి చేస్తున్నదీ ఆమెకు పూర్తిగా తెలుసుననీ" అన్నారు. ఆ సన్నివేశ విషయంలో పూర్తిగా విభిన్న కథనాలు ఉన్నప్పటికీ, ఆయన స్టోన్ నటనను పొగిడి, తమిద్దరికీ సత్సంబంధాలున్నాయని పేర్కొన్నారు.[53]
పురస్కారాలు
[మార్చు]ఈ చిత్రానికి 1992 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చోటు దొరికింది.
Award | Category | Recipient | Result |
---|---|---|---|
20/20 Awards | Best Actress | Sharon Stone | ప్రతిపాదించబడింది |
Academy Awards[54] | Best Film Editing | Frank J. Urioste | ప్రతిపాదించబడింది |
Best Original Score | Jerry Goldsmith | ప్రతిపాదించబడింది | |
Awards Circuit Community Awards | Best Actress in a Leading Role | Sharon Stone | ప్రతిపాదించబడింది |
Best Film Editing | Frank J. Urioste | ప్రతిపాదించబడింది | |
BMI Film & TV Awards | Film Music Award | Jerry Goldsmith | గెలుపు |
Cannes Film Festival[55][56] | Palme d'Or | Paul Verhoeven | ప్రతిపాదించబడింది |
Chicago Film Critics Association Awards[57] | Best Actress | Sharon Stone | ప్రతిపాదించబడింది |
DVD Exclusive Awards | Best Original Retrospective Documentary | Jeffrey Schwarz | ప్రతిపాదించబడింది |
Golden Globe Awards[58] | Best Actress in a Motion Picture – Drama | Sharon Stone | ప్రతిపాదించబడింది |
Best Original Score – Motion Picture | Jerry Goldsmith | ప్రతిపాదించబడింది | |
Golden Raspberry Awards[59] | Worst Actor | Michael Douglas (also for Shining Through) | ప్రతిపాదించబడింది |
Worst Supporting Actress | Jeanne Tripplehorn | ప్రతిపాదించబడింది | |
Worst New Star | Sharon Stone's tribute to Theodore Cleaver | ప్రతిపాదించబడింది | |
Golden Screen Awards | గెలుపు | ||
Japan Academy Film Prize | Outstanding Foreign Language Film | ప్రతిపాదించబడింది | |
MTV Movie Awards | Best Movie | ప్రతిపాదించబడింది | |
Best Male Performance | Michael Douglas | ప్రతిపాదించబడింది | |
Best Female Performance | Sharon Stone | గెలుపు | |
Most Desirable Female | గెలుపు | ||
Best Villain | ప్రతిపాదించబడింది | ||
Best On-Screen Duo | Michael Douglas and Sharon Stone | ప్రతిపాదించబడింది | |
Nikkan Sports Film Awards | Best Foreign Film | గెలుపు | |
Saturn Awards | Best Horror Film | ప్రతిపాదించబడింది | |
Best Director | Paul Verhoeven | ప్రతిపాదించబడింది | |
Best Writing | Joe Eszterhas | ప్రతిపాదించబడింది | |
Best Actress | Sharon Stone | ప్రతిపాదించబడింది | |
Best Music | Jerry Goldsmith | ప్రతిపాదించబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "BASIC INSTINCT (18)". British Board of Film Classification. 1992-03-18. Archived from the original on September 19, 2020. Retrieved 2013-04-19.
- ↑ Box Office Mojo Archived జూలై 20, 2017 at the Wayback Machine. Retrieved October 22, 2011.
- ↑ Silver, Alain; Ward, Elizabeth; eds. (1992). Film Noir: An Encyclopedic Reference to the American Style (3rd ed.). Woodstock, New York: The Overlook Press. ISBN 0-87951-479-5
- ↑ Leistedt, Samuel J.; Linkowski, Paul (January 2014). "Psychopathy and the Cinema: Fact or Fiction?". Journal of Forensic Sciences. 59 (1): 167–174. doi:10.1111/1556-4029.12359. PMID 24329037. S2CID 14413385.
- ↑ "Dr. Fredricks Cinema Therapy Blog - Narcissistic personality disorder". Dr. Randi Fredricks, PhD. Archived from the original on సెప్టెంబరు 15, 2013. Retrieved ఏప్రిల్ 18, 2014.
- ↑ Owoseje, Toyin (2021-03-20). "Sharon Stone says she was misled about explicit interrogation scene in 'Basic Instinct': Vanity Fair". CTVNews (in ఇంగ్లీష్). Archived from the original on March 20, 2021. Retrieved 2021-03-21.
- ↑ 7.0 7.1 7.2 "A Conversation with Sharon Stone" from the Basic Instinct: Ultimate Edition DVD (Lions Gate Home Entertainment, 2006).
- ↑ 8.0 8.1 8.2 "Basic Instinct". AFI Catalog of Feature Films. American Film Institute. Archived from the original on June 9, 2019. Retrieved July 28, 2019.
- ↑ "Basic Instinct (1992) - Box Office Mojo". Boxofficemojo.com. Archived from the original on July 20, 2017. Retrieved November 22, 2017.
- ↑ Basic Instinct (1992) - IMDb, archived from the original on April 7, 2017, retrieved 2020-10-08
- ↑ Murray, Terri (2008). Feminist Film Studies: A Teacher's Guide. Auteur.
- ↑ "Moviefone Top 25 Box Office Bombs of All Time". Moviefone.com. Archived from the original on జూలై 23, 2008. Retrieved సెప్టెంబరు 5, 2008.
- ↑ "Worst of the Worst 2009 - Dragonfly". Rotten Tomatoes. మార్చి 16, 2010. Archived from the original on మార్చి 16, 2010. Retrieved నవంబరు 22, 2017.
- ↑ 14.0 14.1 14.2 14.3 Weinraub, Bernard (March 15, 1992). "'Basic Instinct': The Suspect Is Attractive, and May Be Fatal". The New York Times. Archived from the original on January 2, 2017. Retrieved 2009-08-09.
But the sexual content of the film helped determine the choice of its female star. Ms. Stone, who played Arnold Schwarzenegger's wife in 'Total Recall', was cast in 'Basic Instinct' only after better-known actresses like Michelle Pfeiffer, Kim Basinger, Geena Davis, Ellen Barkin and Mariel Hemingway rejected her part, largely because it demanded so much nudity and sexual simulation.
- ↑ "Retrospectives: BASIC INSTINCT". Archived from the original on నవంబరు 13, 2007. Retrieved నవంబరు 6, 2007.
- ↑ "Wisdom Wednesday: Joe Eszterhas' 10 Golden Rules of Screenwriting by Joe Eszterhas". Moviemaker Magazine. October 2, 2013. Archived from the original on August 3, 2020. Retrieved November 22, 2017.
- ↑ "AFI Catalog of Feature Films: Basic Instinct". catalog.afi.com. Archived from the original on June 9, 2019. Retrieved December 28, 2019.
- ↑ "Basic Instinct". AMC. Archived from the original on March 2, 2019. Retrieved 2020-06-06.
- ↑ 19.0 19.1 Warren, Jane (March 29, 2011). "Michael Douglas's real basic instinct". Daily Express. Archived from the original on December 28, 2013. Retrieved December 27, 2013.
- ↑ "BBC - Drama Faces - Greta Scacchi". Archived from the original on జనవరి 5, 2009. Retrieved ఆగస్టు 9, 2009.
- ↑ "BBC - Films - interview - Meg Ryan". Bbc.co.uk. Archived from the original on November 19, 2019. Retrieved November 22, 2017.
- ↑ "Why Kelly Lynch Doesn't Regret Turning Down 'Basic Instinct'".
- ↑ Bryce Hallett (10 February 2001). "Her world's a stage". Sydney Morning Herald. p. 3.
- ↑ Siegel, Alan (June 4, 2020). "Arnold Schwarzenegger's Mission to Mars". The Ringer. Archived from the original on June 5, 2020. Retrieved June 5, 2020.
- ↑ Basic Instinct (Making of, The). 20th Century Fox. 2001.
- ↑ Sharon Stone talking about Basic Instinct. 2014-09-12. Archived from the original on 2021-12-12. Retrieved 2018-01-30 – via YouTube.
- ↑ "'INSTINCT' TELLS HIM NO". Pagesix.com. August 20, 2000. Archived from the original on November 20, 2017. Retrieved November 22, 2017.
- ↑ "Jeanne Tripplehorn in The Firm". ew.com. Retrieved 2022-01-28.
- ↑ "Filmtracks: Basic Instinct (Jerry Goldsmith)". Filmtracks.com. Archived from the original on November 22, 2017. Retrieved November 22, 2017.
- ↑ Velez, Andy. "Evening the Score" Jerry Goldsmith interview Archived ఏప్రిల్ 30, 2013 at the Wayback Machine. Barnes & Noble. Retrieved 2011-06-06.
- ↑ "'Basic Instinct' Gets 4K Restoration by Studiocanal, Set for Theatrical, Home Entertainment Releases". Variety.com. April 21, 2021. Retrieved June 2, 2021.
- ↑ https://m.imdb.com/title/tt0103772/releaseinfo
- ↑ "1992 Worldwide Grosses". Box Office Mojo. Archived from the original on December 16, 2019. Retrieved May 4, 2013.
- ↑ Groves, Don (28 September 1992). "'Basic' boffo in Italo bow". Variety. p. 29.
- ↑ "Top 10 grossers in Spain". Variety. 4 October 1993. p. 66.
- ↑ Groves, Don (November 22, 1993). "Dinos set o'seas mark of $500 mil". Variety. p. 16.
- ↑ "Basic Instinct". Rotten Tomatoes. Fandango. Archived from the original on August 30, 2017. Retrieved March 26, 2022.
- ↑ "Basic Instinct". Metacritic. CBS Interactive. Archived from the original on March 3, 2015. Retrieved February 5, 2015.
- ↑ "CinemaScore". cinemascore.com. Archived from the original on January 2, 2018. Retrieved May 12, 2021.
- ↑ Travers, Peter. Basic Instinct. Rolling Stone Archived జూన్ 28, 2011 at the Wayback Machine. Retrieved March 10, 2011.
- ↑ "Basic Instinct". Rotten Tomatoes. Archived from the original on October 11, 2019. Retrieved February 20, 2020.
- ↑ Lundin, Leigh (2010-07-25). "Erotic Mystery Thrillers". Criminal Brief. Archived from the original on April 16, 2021. Retrieved December 10, 2020.
- ↑ Ebert, Roger. "Basic Instinct". Rogerebert.com. Archived from the original on May 29, 2020. Retrieved June 6, 2020.
- ↑ Kehr, Dave. "Blatant 'Instinct'." Chicago Tribune Archived జూన్ 6, 2020 at the Wayback Machine. Retrieved June 6, 2020.
- ↑ Los Angeles Times, April 29, 1991: Gays Bashing Basic Instinct. See also Phyllis Burke, Family Values: Two Moms and Their Son. New York: Random House (1993), which covers the protests over several chapters.
- ↑ Couvares, Francis G. (2006). Movie Censorship and American Culture (2nd ed.). ISBN 978-1-55849-575-3. Archived from the original on April 16, 2021. Retrieved March 9, 2021.
- ↑ Keesey, Douglas (2005). Paul Verhoeven. p. 130. ISBN 978-3-8228-3101-4.
- ↑ "Basic Instinct". Chicago Sun-Times.[permanent dead link]
- ↑ Paglia, Camille. Vamps & Tramps: New Essays. London: Penguin Books, 1994. p. 489
- ↑ Ball, Ian (August 22, 2002). "A smoking star is a loaded gun". The Daily Telegraph. London. Archived from the original on August 21, 2017. Retrieved April 2, 2018.
- ↑ Inside the Actors Studio interview with Sharon Stone. Episode dated January 10, 1999.
- ↑ Toyin Owoseje. "Sharon Stone says she was misled about explicit scene in 'Basic Instinct'". CNN. Archived from the original on March 20, 2021. Retrieved 2021-03-20.
- ↑ Brent Lang. "'Benedetta' Director Paul Verhoeven on Sex, His Jesus Fascination and Hollywood Puritanism'". Variety (magazine). Retrieved 2021-07-07.
- ↑ "The 65th Academy Awards (1993) Nominees and Winners". Academy of Motion Picture Arts and Sciences (AMPAS). Archived from the original on November 9, 2014. Retrieved October 22, 2011.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;festival-cannes.com
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Awards 1992: All Awards". festival-cannes.fr. Archived from the original on 21 February 2015.
- ↑ "1988-2013 Award Winner Archives". Chicago Film Critics Association. Retrieved August 24, 2021.
- ↑ "Basic Instinct – Golden Globes". HFPA. Retrieved July 5, 2021.
- ↑ Wilson, John (August 23, 2000). "Ceremonies Presented at The Hollywood Roosevelt Hotel Oscar Room, March 28, 1993". Razzies.com. Archived from the original on 2009-02-28. Retrieved October 31, 2016.
వెలుపలి లంకెలు
[మార్చు]- మూలాల లోపాలున్న పేజీలు
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- 1992 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from December 2014
- All pages needing factual verification
- Wikipedia articles needing factual verification from April 2008
- తాజాకరించవలసిన వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with GND identifiers
- అమెరికన్ సినిమాలు
- ఆంగ్ల భాషా సినిమాలు
- హాలీవుడ్ సినిమాలు