బ్రూస్ మారిసన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రూస్ డోనాల్డ్ మారిసన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లోయర్ హట్, న్యూజీలాండ్ | 1933 డిసెంబరు 17|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 96) | 1963 1 March - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 1 April 2017 |
బ్రూస్ డోనాల్డ్ మారిసన్ (జననం 1933, డిసెంబరు 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1963లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కుడి-చేతి మీడియం పేస్ బౌలింగ్, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణించాడు.[1]
క్రికెట్ కెరీర్
[మార్చు]మోరిసన్ 1933, డిసెంబరు 17న లోయర్ హట్‌లో జన్మించాడు. 1951 డిసెంబరులో హాక్ కప్‌లో నెల్సన్‌లో జరిగిన ఒక అవే మ్యాచ్ లో తన స్థానిక జట్టు హట్ వ్యాలీ కోసం మొదటిసారి ఆడాడు.[2] 20 ఏళ్ళ వయస్సులో, 1954 జనవరి 7న బేసిన్ రిజర్వ్‌లో ఒటాగోపై వెల్లింగ్‌టన్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఒటాగో మొదటి ఇన్నింగ్స్‌లో 4–70, ఆ తర్వాత వారి రెండో ఇన్నింగ్స్‌లో 7–42 సాధించాడు.[3] తర్వాతి మ్యాచ్ లో ఈడెన్ పార్క్‌లో ఆక్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5–60తో తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు. బ్యాట్‌తో నాటౌట్‌గా 33 పరుగులు చేశాడు.[4] 16.68 సగటుతో 22 వికెట్లతో సీజన్‌ను ముగించాడు.[5]
ఎంసిసికి వ్యతిరేకంగా వెల్లింగ్టన్ టూర్ మ్యాచ్ లో బేసిన్ రిజర్వ్‌లో ట్రెవర్ బెయిలీ, బిల్ ఎడ్రిచ్, కోలిన్ కౌడ్రీల వికెట్లను తీశాడు.[6] 16 వికెట్లతో సీజన్‌ను ముగించాడు.[7]
1997–98లో బెర్ట్ సట్‌క్లిఫ్ మెడల్‌లో ఉమ్మడి మొదటి విజేతగా నిలిచాడు. ఇది వెల్లింగ్‌టన్ ప్రాంతంలో జూనియర్ క్రికెట్‌కు చేసిన కృషికి గుర్తింపుగా న్యూజీలాండ్‌లో క్రికెట్‌కు అత్యుత్తమ సేవలకు అందితుంది.[8] కొన్ని సంవత్సరాలు వెల్లింగ్టన్ సెలెక్టర్‌గా కూడా ఉన్నాడు. ట్రెంథమ్‌లో నివసించడానికి పదవీ విరమణ చేసే ముందు హట్ వ్యాలీలో స్పోర్ట్స్ గూడ్స్ వ్యాపారాన్ని నడిపాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "Bruce Morrison". Cricinfo. Retrieved 27 February 2020.
- ↑ Cricket Archive
- ↑ Cricket Archive
- ↑ Cricket Archive
- ↑ Cricket Archive
- ↑ Cricket Archive
- ↑ Cricket Archive
- ↑ "New Zealand Cricket Awards". NZ Cricket Museum. Archived from the original on 22 July 2019. Retrieved 27 February 2020.
- ↑ Leggat, David (30 March 2018). "New Zealand Cricket's one test wonders: Bruce Morrison". NZ Herald. Retrieved 26 October 2021.