Jump to content

వికీపీడియా:నిర్ధారత్వం

వికీపీడియా నుండి
(వికీపీడియా:V నుండి దారిమార్పు చెందింది)
సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: ప్రశ్నింపబడిన, లేదా ప్రశ్నింపబడే అవకాశం ఉన్న విషయాలన్నింటికీ, మరియు కొటేషన్లకు విశ్వసనీయమైన, ఇంతకుముందు ప్ చూపాలి


ఏదైనా విషయాన్ని వికీపీడియాలో వ్రాయవచ్చునా అనే సమస్యకు ప్రామాణికత - నిజం మాత్రమే కాదు, నిర్ధారింప తగినది (verifiability, not truth). అంటే వికీపీడియాలో ఉంచిన విషయాలు ఇంతకు ముందే విశ్వసనీయమైన ప్రచురణలలో వెలువడి ఉండాలి. ఇది నిజం అనుకుంటే చాలదు. ముఖ్యంగా వివాదాస్పదం కావచ్చుననిపించే విషయాలకు, లేదా ఇతరులు ప్రశ్నించిన విషయాలకు విశ్వసనీయమైన మూలాలు చూపడం చాలా అవుసరం. అలా చూపలేని పక్షంలో ఆ విషయాలను తొలగించాలి ({{fact}} (ఆధారం చూపాలి అని వస్తుంది) అనే మూస తగిలించి వదిలేస్తే చాలదు.)

వికీపీడియా:నిర్ధారింప తగినది అనేది వికీపీడియా రచనలకు వర్తించే మూడు మౌలిక సూత్రాలలో ఒకటి. తక్కిన రెండు వికీపీడియా:తటస్థ దృక్కోణం మరియు వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం - ఈ మూడు సూత్రాలు వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక సంయుక్తంగా, విచక్షణతో అమలు చేయాలి.

ఆధారం ఎవరు చూపాలి?

[మార్చు]

వికీలో ఆ విషయం వ్రాసిన వారు లేదా చెరిపివేసిన విషయాన్ని పునస్థాపించినవారు తగిన ఆధారాలను చూపాలని ఆశిస్తాము. ఇందుకు విషయంపాఠంలోపల అంతర్గతంగా సముచితమైన మూలాలను పేర్కొనవలసి ఉంది. [1]

అలా మూలాలను చూపని పక్షంలో ఆ విషయాలను తొలగించడం సరైన పద్ధతి. అయితే రచయితలకు తగిన హెచ్చరిక, అవకాశం ఇచ్చేందుకు మూలాలు అవసరమనిపించిన చోట {{fact}} అనే మూసను ఉంచి, దానికి తగిన స్పందనలను పరిశీలించండి . లేదా వ్యాసంలో కనిపించని వ్యాఖ్యలు ఉంచితే రచయితలు దానిని దిద్దుబాట్ల సమయంలో మాత్రమే చూడగలుగుతారు. [2]

ముఖ్యంగా జీవించి ఉన్న వ్యక్తులను, లేదా సంస్థలను కించపరిచేలా ఉన్న విషయాలు తగిన ఆధారాలు లేకుండా ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించవచ్చును. ఈ విషయమై (en:Wikipedia:Biographies of living persons) జిమ్మీ వేల్స్ ఇలా అన్నాడు.

I can NOT emphasize this enough. There seems to be a terrible bias among some editors that some sort of random speculative 'I heard it somewhere' pseudo information is to be tagged with a 'needs a cite' tag. Wrong. It should be removed, aggressively, unless it can be sourced. This is true of all information, but it is particularly true of negative information about living persons.

మూలాలు

[మార్చు]

విశ్వసనీయమైన మూలాలు

[మార్చు]

వికీపిడియాలోని వ్యాసాలు ఇతరులు ప్రచురించిన వాటిపై ఆధారపడుతాయి గనుక ఆ మూలాలు కూడా విశ్వసనీయమైనవి, సత్యానికి కట్టుబడేవి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనేవి అయి ఉండాలి.[4] వ్రాసిన వ్యాసాలలోని విషయాన్ని నిర్ధారించడానికీ, దానిని ఎక్కడినుండి సేకరించారో ఆ రచయితలను, ప్రచురణ కర్తలను పేర్కొనడానికీ, గ్రంధ చౌర్యాన్ని అరికట్టడానికీ, కాపీ హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికీ కూడా ఈ ప్రమాణాలు పాటించడం చాలా అవసరం. మూలాలలో ఉన్నంత భావం కంటే ఎక్కువగా వికీపీడియా రచనలలో ధ్వనించరాదు. విపరీతమైన విషయాలకు (exceptional claims) ఖచ్చితమైన మూలాలు మరింతగా అవసరమౌతాయి. అన్ని రచనలూ తటస్థ దృక్కోణానికి అనుగుణంగా ఉండాలి. ఆయా వ్యాసాలలో ఉన్న విషయాలపై ప్రధాన అభిప్రాయాలతో పాటు, ఇతర అభిప్రాయాలను కూడా తగినంతగా, ఆధారాలతో సహా, పేర్కొనాలి.

రచయితలు పేర్కొన్న మూలాలు ఆయా రంగాలకు చెందిన నమ్మకమైన ప్రచురణలు - జర్నల్‌లు, పాఠ్యపుస్తకాలు, ప్రధాన వార్తా పత్రికలు - అయితే వాటి పట్ల విశ్వాసం పెరుగుతుంది. విషయంలోని నిజాన్ని, దాని చట్టపరమైన సమస్యలను కూలంకషంగా పరిశీలించిన తరువాత ప్రచురించే ప్రచురణలు విశ్వసనీయమైన మూలాలు అనవచ్చును. అన్నింటికంటే, ఆయా రంగాల్లోని నిపుణుల పరిశీలనలో వెలువడే ప్రచురణలు అత్యంత ఆదరణీయాలు. వీటి గురించిన మరికొన్ని వివరాలు ఈ ఆంగ్ల వికీ వ్యాసంలో చూడవచ్చును.

ప్రశ్నార్ధకమైన మూలాలు

[మార్చు]

నిజాన్ని నిర్ధారించుకోకుండా అవాకులూ, చవాకులూ ప్రచురించే సంస్థలనుండి వెలువడిన ప్రచురణలపై విశ్వసనీయత రావడం కష్టం. ఒక విధమైన అభిప్రాయానికి లేదా వాదానికి పట్టం కట్టే వెబ్‌సైటులు ఈ కోవలోకి వస్తాయి. ఇటువంటి మూలాలను ఆ సంస్థల గురించి లేదా వ్యక్తుల గురించి వ్రాసే వ్యాసాలలో మాత్రం వాడవచ్చును. Articles about such sources should not repeat any contentious claims the source has made about third parties, unless those claims have also been published by reliable sources.

స్వీయ ప్రచురణలు

[మార్చు]

స్వీయ ప్రచురణలు అంటే కర పత్రాలు కావచ్చును. పార్టీ ప్రణాళికలు కావచ్చును. లేదా వ్యక్తులు లేదా సమూహాలు నడిపే వెబ్‌సైటులు కావచ్చును. చాలా బ్లాగులు ఈ కోవలోకి వస్తాయి. అటువంటి ప్రచురణలలో ఉన్న విషయాలు ఆ దృక్కోణాన్ని ఉదాహరించడానికి తప్ప ఇతర నిర్ధార ప్రయోజనాలకు వాడడం వలన ప్రయోజనం లేదు.[5]

స్వీయ ప్రచురణలు ఆ రంగంలో ఆ వ్యక్తులకున్న స్థానాన్ని బట్టి అంగీకరించవచ్చును. కానీ ఇటువంటి మూలాలను విచక్షణతో, తప్పని పరిస్థితిలో మాత్రం వాడాలి. అది ఆ వ్యక్తుల లేదా సంస్థల ప్రయోజనాలను పెంపొందించే ఉద్దేశ్యంతో రూపొందించిన మూలమైతే అసలు పనికిరాదు. ఒకరి అభిప్రాయం నిజంగా ఆమోదయోగ్యమైతే మరెక్కడైనా అది ప్రచురించి ఉండాలి. స్వీయ ప్రచురణలను ఆ రచయితల జీవిత చరిత్రకు సంబంధించిన వ్యాసాలలో మూలాలుగా అసలు వాడకూడదు.(en:WP:BLP#Reliable sources).

వికీపీడియాలోని వ్యాసాలను, వికీ చర్చలలోని విషయాలను మూలాలుగా పేర్కొనరాదు.

వార్తాపత్రికలు - పత్రికల బ్లాగులు

[మార్చు]

కొన్ని వార్తాపత్రికలు, పత్రికలు, ఇతర వార్తా సంస్థలు బ్లాగులు అని పిలిచే ప్రత్యేక అంతర్జాల శీర్షికలను నిర్వహిస్తాయి.రచయితలు వృత్తినిపుణుడు (ప్రొఫెషనల్స్) అయితే ఇవి ఆమోదయోగ్యమైన వనరులు కావచ్చు, కానీ బ్లాగులు వార్తా సంస్థ యొక్క సాధారణ నిజ నిర్ధారణ ప్రక్రియకు లోబడి ఉండకపోవచ్చు కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి. ఒక వార్తా సంస్థ ఒక బ్లాగులో ఒక అభిప్రాయ భాగాన్ని ప్రచురిస్తే, ఆ ప్రకటనను రచయితకు ఆపాదించండి, ఉదా. "జేన్ స్మిత్ ఇలా రాశాడు ..." అయుతే ఇందులో పాఠకులు వదిలిపెట్టిన బ్లాగ్ వ్యాఖ్యలను మూలాలుగా ఎన్నడూ ఉపయోగించవద్దు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
ఆంగ్ల వికీపీడియాలో ఈ విషయానికి సంబంధించిన వ్యాసాలు

మూలాలు

[మార్చు]
  1. When content in Wikipedia requires direct substantiation, the established convention is to provide an inline citation to the supporting references. The rationale is that this provides the most direct means to verify whether the content is consistent with the references. Alternative conventions exist, and are acceptable when they provide clear and precise attribution for the article's assertions, but inline citations are considered "best practice" under this rationale. For more details, please consult en:Wikipedia:Citing_sources#How_to_cite_sources.
  2. See en:Help:Editing#Basic text formatting: "Invisible comments to editors only appear while editing the page. If you wish to make comments to the public, you should usually go on the talk page."
  3. Jimmy Wales (2006-05-16). ""Zero information is preferred to misleading or false information"". WikiEN-l en:electronic mailing list archive. Retrieved 2006-06-11.
  4. ఇక్కడ "మూలము" అంటే మూడు భాగాల మిశ్రమం - ఆ ప్రచురణ, దానిని సృష్టించిన (వ్రాసిన) వారు, దానిని ప్రచురించిన వారు. ఈ మూడూ కూడా విశ్వనీయతపై గణనీయమైన ప్రభావం కలిగి ఉండవచ్చును.
  5. "Blogs" in this context refers to personal and group blogs. Some newspapers host interactive columns that they call blogs, and these may be acceptable as sources so long as the writers are professionals and the blog is subject to the newspaper's full editorial control. Where a news organization publishes the opinions of a professional but claims no responsibility for the opinions, the writer of the cited piece should be attributed (e.g., "Jane Smith has suggested ..."). Posts left by readers may never be used as sources.