Jump to content

వీర్యం

వికీపీడియా నుండి
(వీర్యము నుండి దారిమార్పు చెందింది)
Spermatozoa, in this case human, is a primary ingredient in normal semen, and the agent of fertization of the female ova

వీర్యము లేదా రేతస్సు ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది పురుషాంగము నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది. పురుషులలో కౌమార దశ నుండి వీర్యోత్పత్తి ప్రారంభమౌతుంది. వృషణాలు ఇందుకొ తోడ్పడతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలనల్ని దాని రికార్డులను గమనిస్తే, 1950 కన్నా ముందు ఒక మి.లీ వీర్యంలో 110 మిలియన్ల శుక్రకణాలు ఉండేవి. 1980 నాటికి అది 60 మిలియన్లకు తగ్గిపోయింది. ఆ తరువాత క్రమంగా 40 కి , 20 కి పడిపోయింది. ప్రస్తుతం అది 15 మిలియన్లకు పడిపోయింది. విచిత్రం ఏమిటంటే ఎంతకు పడిపోతే అదే ప్రామాణికమనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఇది సంతానలేమికి మాత్రమే కాదు. శుక్రకణాలతో పాటు టెస్టోస్టెరాన్ హార్మోన్లు కూడా తగ్గిపోయి ఒక దశలో నపుంసకత్వానికి కూడా దారితేసే ప్రమాదం ఉంది.

మానవ జీవితంలో పునరుత్పత్తి వ్యవస్థ ఇంత ప్రాధాన్యతను ఎందుకు సంతరించుకుంది? కేవలం, మానవ మనుగడకో, శరీర సమతుల్యతకో తోడ్పడుతుందని కాదు. మరి దేనికి? భూమండలం మీద జీవరాశి కొనసాగడానికి ఇది మూలమూ, అవ శ్యమూ కాబట్టి. కాకపోతే మిగతా వ్యవస్థల్లాగే సంతాన కారణమైన ఈ పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఎన్నో ఆటుపోట్లకు గురవుతోంది. వాతావరణ కాలుష్యాల నుంచి ఆహారపు అలవాట్ల దాకా, శారీరకమే కాకుండా మానసిక కారణాలు ఈ జీవోత్పత్తి వ్యవస్థను కుంటుపడేలా చేస్తున్నాయి. అందులో శుక్రకణాల క్షీణగతి ఒక దిగ్భాంతికర పరిణామంగా మనకు కనపడుతుంది.1950 నుంచి ఈ 2013 దాకా శుక్రకణాల సంఖ్య నిదానంగా తగ్గుతూనే ఉంది.

ఈ క్రమంలో కేవలం శుక్రకణాల సంఖ్య మాత్రమే కాదు. పురుషత్వానికి ప్రతిరూపమైన టెస్టోస్టెరాన్ హార్మోన్ల సంఖ్య కూడా తగ్గుతోంది. ఈ పరిణామాలతో సంతాన లేమితో పాటు . నపుంసకత్వం కూడా దాపురిస్తుంది. ఎంతకు పడిపోతే అంతే గొప్ప అనుకునే తత్వమే ఇందుకు కారణం. మి.లీ వీర్యంలో 110 మిలియన్లు ఉండే వీర్య కణాలు ఓ 60 ఏళ్లలో 15 మిలియన్లకు పడిపోయాయీ అంటే, మరో 50 ఏళ్లలో ఏ స్థాయికి పడిపోతుంది? శుక్రకణాల సంఖ్య 0 అంటే ఒక పెద్ద సున్నా ఏర్పడటమేగా? అసలు శుక్రకణాలే లేని ఒక నిర్వీర్య ప్రపంచమే కదా మునుముందు ఏర్పడేది? ప్రతిసారీ పతనంతో రాజీపడటమే కానీ, ఆ ప్రమాదపు తీవ్రతను గుర్తించడం లేదు.

వివిధ దశల్లో

[మార్చు]

ఒక మి. లీ వీర్యంలో ఉండవలసిన సంఖ్య కన్నా తక్కువగా ఉంటే ప్రస్తుత స్థితిలో 15 మిలియన్ల కన్నా తక్కువగా శుక్రకణాలు ఉండడాన్ని లో-స్పెర్మ్ కౌంట్ అంటారు. శుక్రకణాల ఏకీకృతం తక్కువగా ఉంటే దాన్ని ఆలిగోస్పెర్మియా అంటారు. ఒకవేళ శుక్రకణాల సంఖ్య అసలే లేకపోతే దాన్ని అజూస్పెర్మియా అంటారు. శుక్రకణాల్లో స్త్రీ అండాశయంలోకి చొచ్చుకు వెళ్లే చలన శక్తి లేకపోవడాన్ని అస్తెనోజూస్పెర్మియా అంటారు. శుక్రకణాల రూపంలో లోపం ఉంటే దాన్ని టెరటోజూస్పెర్మియా అంటారు.

లో-స్పెర్మ్ లక్షణాలు

[మార్చు]

శుక్రకణాల లోపాన్ని తెలిపే మొట్టమొదటి లక్షణం సంతానం కలిగించే శక్తి కొరవడటమే. దీనికి తోడు శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం, అంగస్తంభనలు ఎక్కువ సేపు ఉండకపోవడం, పురుషాంగంలో, వృషణాల్లో నొప్పి, వాపు రావడం, ముఖంలో గానీ, మిగతా శరీర భాగాల్లోని వెండ్రుకలు రాలిపోవడం, ఇతరమైన హార్మోన్ సమస్యలు తలెత్తడం ఇవన్నీ శుక్రకణాల సంఖ్య తగ్గడాన్ని తెలిపే లక్షణాలు. వీటన్నిటికీ హార్మోన్ వ్యవస్థలో వచ్చే తేడాలే మూలం. టెస్టోస్టెరాన్ హార్మోన్లు తగ్గిపోయినప్పుడు కండరాల వ్యవస్థలో క్షీణగతి ఏర్పడుతుంది. ఎముకలు గుల్లబారిపోతాయి. అసహనం, చికాకు , దేనిమీదా లగ్నం కాలేని ఒక అమనస్కత ఇలాంటి మానసిక ప్రకోపాలు ఏర్పడతాయి. చర్మం నిర్జీవంగా మారుతుంది. రక్తహీనత ఏర్పడుతుంది. జీవక్రియలు కుంటుపడతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్లు తగ్గడం వల్ల ఏర్పడిన శరీరంలోని అసహజ స్థితి వల్ల ఆ వ్యక్తి కేన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

వాజీకరణ

[మార్చు]

ఏడాది పాటు గర్భనిరోధక సాధనాలేవీ లేకుండా రతిలో పాల్గొన్నా సంతానం కలగకపోతే, మీరు వెంటనే వాజీకరణ స్పెషలిస్టును సంప్రదించడం అవసరం. పురుషాంగంలో గానీ, వృషణాల్లోగానీ, నొప్పి, వాపు ఉన్నా అంగస్తంభనలో లోపాలు ఉన్నా, శీఘ్రస్ఖలన సమస్యలు ఉన్నా శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోయినా వాజీకరణ స్పెషలిస్టును తప్పనిసరిగా సంప్రదించాలి. గతంలో వృషణాలకు గానీ, గజ్జ భాగంలో గానీ, స్క్రోటమ్‌లో గానీ సర్జరీ చేసుకుని ఉన్నా స్పెషలిస్టును కలవడం తప్పనిసరి.

వాజీకరణ విశిష్ఠత

[మార్చు]

వాజీ అంటే శుక్రం అనే అర్థమూ ఉంది. అందుకే శుక్రకణాలు తగ్గిపోయిన వారికి వాజీకరణ చికిత్స ఒక దివ్యవైద్యంగా పరిగణించబడింది. శుక్రదోషాలు ఉన్నవారికి, శండత్వం అంటే సంతాన సామర్థ్యం కొరవడిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎవరికైనా రసధాతువులో సమస్య ఉండి శుక్రలోపాలు ఏర్పడుతున్న వారికి రసాయన చికిత్సలు అవసరమవుతాయి. అలాకాకుండా సమస్య అంతా శుక్రధాతువులోనే ఉంటే వారికి వాజీకరణ చికిత్సలు అవసరమవుతాయి. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న వారికే కాదు.

శుక్రం ఇన్‌ఫెక్షన్లకు గురైన వారికి, శుక్రకణాలు నిర్జీవంగా మారుతున్నవారికి, వీర్యంలో పునరుత్పత్తి తత్వం తగ్గిపోయే వారికి కూడా వాజీకరణ చికిత్సలు తప్పనిసరి అవుతాయి. వాజీకరణ చికిత్స, శుక్రకణాల సంఖ్యను వాటి నాణ్యతను, చలనశక్తిని పెంచడమే కాకుండా, నిండైన పురుషత్వాన్ని నిలబెట్టే టెస్టోస్టెరాన్ హార్మోన్ల వృద్ధికి కూడా అద్భుతంగా తోడ్పడుతుంది. ఇప్పటికే శుక్రకణాలు త గ్గపోయిన వారే కాదు, ఇప్పుడు బాగానే ఉన్నా మునుముందు తగ్గిపోయే అవకాశాల్ని అరికట్టడానికి కూడా వాజీకరణ చికిత్సలు తప్పని సరి.

వీర్య కణం ప్రేరణగా రోబో

[మార్చు]

వీర్య కణం ఆధారంగా శాస్త్రవేత్తలు ఒక సూక్ష్మ రోబోను తయారుచేశారు. అది అయస్కాంత క్షేత్రం సాయంతో పనిచేస్తుంది. శరీరంలో ఔషధాల చేరవేతకు, ఐవీఎఫ్ విధానంలోను, సూక్ష్మ స్థాయిలోని ఇతర అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన సర్తాక్ మిశ్రా కూడా ఉన్నారు.

నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటీ, కైరోలోని జర్మన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మ్యాగ్నెటోస్పెర్మ్ అనే ఈ రోబోను తయారుచేశారు. దీన్ని డోలనంలో ఉన్న బలహీన అయస్కాంత క్షేత్రాల ద్వారా నియంత్రిస్తారు. ఈ రోబో పొడవు 322 మైక్రాన్లు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ చాలా ఉత్పత్తుల పరిమాణం తగ్గిపోతుందని మరో శాస్త్రవేత్త ఖలీల్ చెప్పారు. శరీరంలో ఔషధాలను చేరవేయడానికి, ఐవీఎఫ్ విధానానికి, మూసుకుపోయిన రక్తనాళాలను తెరిపించడానికి ఉపయోగించవచ్చని వివరించారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-06. Retrieved 2014-06-03.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-06. Retrieved 2014-06-03.
పెట్రిల్ పాత్ర లో సేకరించిన మానవ వీర్యము

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వీర్యం&oldid=4339779" నుండి వెలికితీశారు