Jump to content

శక్తి మోహన్

వికీపీడియా నుండి
శక్తి మోహన్
వృత్తి
  • డాన్సర్
  • కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
బంధువులు

శక్తి మోహన్, భారతీయ సమకాలీన నృత్య కళాకారిణి. జీ టీవీ నిర్వహించిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సీజన్ 2 విజేతగా నిలిచింది ఆమె. ఆ తరువాత స్టార్ ప్లస్ లో ప్రదర్శితమవుతున్న డ్యాన్స్ ప్లస్ సీజన్ 1,2లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. 2015లో అంతర్జాతీయ డ్యాన్స్ షో డ్యాన్స్ సింగపూర్ డ్యాన్స్ కు కూడా న్యాయనిర్ణేతగా చేసింది. రెమో డిసౌజా చేస్తున్న డ్యాన్స్ సినిమాలో సల్మాన్ యూసఫ్ ఖాన్ సరసన నటించబోతోంది శక్తి. ఆమె నృత్య శక్తి అనే డ్యాన్స్ ట్రూప్ నడుపుతోంది. ఈ ట్రూప్ ద్వారా ఆమె ఎన్నో అంతర్జాతీయ టూర్స్ చేస్తుంటుంది. ముంబైలో స్టుడియో కూడ నిర్మించింది శక్తి. నృత్య శక్తి  డ్యాన్స్ పాఠశాలలో అన్ని రకాల నృత్య కళాకారులకూ శిక్షణ ఇస్తారు.[1][2] దిల్ దోస్తీ డ్యాన్స్ అనే సీరియల్ లో కూడా నటించింది ఆమె. ధూమ్3 సినిమాలోని కామ్లీ పాటకు కొరియోగ్రాఫర్ వైభవ్ మర్చెంట్ కు సహాయ కొరియోగ్రాఫర్ గా పని చేసింది శక్తి.[3] 2014లో ఝలక్ దిఖలాజా షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది ఆమె. 

వ్యక్తిగత జీవితం

[మార్చు]

12 అక్టోబరు 1985న జన్మించింది శక్తి. ఆమెకు ముగ్గురు అక్కా చెల్లెళ్ళున్నారు. ప్రముఖ కళకారిణులు నీతీ మోహన్, ముక్తీ మోహన్, కృతీ మోహన్ లు ఆమె సోదరిలు.[4] నిజానికి శక్తిది ఢిల్లీ కాగా, ఆమె ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ముంబైలోని బిర్లా బాలికా విద్యాపీఠ్ లో ప్రాధమిక విద్యనభ్యసించిన శక్తి, సెయింట్ గ్జేవియర్స్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ లో ఎం.ఎ చదివింది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కు వెళ్ళక ముందు ఆమె ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ అవ్వలనుకునేది.2009లో టెరెన్స్ లూయిస్ డ్యాన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ట్రస్ట్ ద్వారా డ్యాన్స్ లో డిప్లమో చేసింది శక్తి.

డ్యాన్స్ కెరీర్

[మార్చు]

డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లో గెలువడంతో, 2012, 2013 డ్యాన్స్ థీమ్ తో క్యాలెండర్లు తయారు చేసింది శక్తి.[5] 2012లో ఆమె సంగీత దర్శకుడు మొహమద్ ఫైరౌజ్ తో కలసి న్యూయార్క్ లో బిబిసి నిర్వహించిన డ్యాన్స్ ప్రాజెక్ట్ చేసింది శక్తి.[6] తన అక్కాచెల్లెళ్ళతో కలసి ఒక డ్యాన్స్ మ్యూజిక్ వీడియో చేసింది ఆమె.[7] 2013లో డ్యాన్స్ లో మెలుకువలు, సూచనలతో వీడియోలు తయారు చేసి, యూట్యూబ్ చానల్ లో పెడుతుంటుంది శక్తి.[8] ఒకసారి ఝలక్ దిఖలాజా షోకు అతిధిగా వచ్చిన పరిణీతి చోప్రా, తాను శక్తి మోహన్ కు ఫ్యాన్ ను అని చెప్పడం విశేషం.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Parineeti-Chopra-is-a-fan-of-Shakti-

మూలాలు

[మార్చు]
  1. web|url=http://movies.ndtv.com/movie_story.aspx? Archived 2012-07-11 at Archive.today
  2. "Shakti Mohan in Tees Maar Khan". Hindustan Times. 28 April 2010. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 9 March 2012.
  3. "Shakti Mohan Wiki, Biography, Dance Plus Judge, Dance India Dance Winner, Neeti Mohan's Sister". spellceleb.com. 20 August 2015. Archived from the original on 24 ఆగస్టు 2015.
  4. Tags: (12 April 2011). "The Mohan sisters are on a roll". Tellychakkar.com. Archived from the original on 24 ఏప్రిల్ 2012. Retrieved 17 April 2012.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  5. Pandey, Chulbuli (18 December 2012). "Dance reality show winner Shakti Mohan launches her own calendar". Mid-Day.
  6. "BBC World News Collaborative Culture (Collaboration Culture) Shakti Mohan". U’th Time. 10 July 2012. Archived from the original on 24 సెప్టెంబరు 2014. Retrieved 9 మే 2017.
  7. "Shakti Mohan's sisters, Neeti and Mukti, help her achieve her dream". TellyChakkar. 4 January 2013.
  8. "Here's a chance to learn dancing from Shakti Mohan...read more to find out". TellyChakkar. 4 June 2013.