Jump to content

సేనాపతి జిల్లా

వికీపీడియా నుండి
సేనాపతి జిల్లా
జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంసేనాపతి
విస్తీర్ణం
 • Total3,269 కి.మీ2 (1,262 చ. మై)
జనాభా
 (2011)
 • Total3,54,772
 • జనసాంద్రత110/కి.మీ2 (280/చ. మై.)
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

సేనాపతి జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లాలో ఒకటి.

సేనాపతి జిల్లా

[మార్చు]

మణిపూర్ రాష్ట్ర ఉత్తర భూభాగంలో సేనాపతి జిల్లా ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులలో ఉఖ్రుల్ జిల్లా, పడమర సరిహద్దులలో తమెంగ్‌లాంగ్ జిల్లా, ఉత్తర సరిహద్దులలో నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఫెక్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఈస్ట్ ఇంఫాల్ జిల్లా, వెస్ట్ ఇంఫాల్ జిల్లాలు ఉనాయి. ఈ జిల్లా సముద్రమట్టానికి 1061-1788 మీ ఎత్తున ఉంది. జీల్లాలోని పర్వతశ్రేణులు ఉత్తరం నుండి దక్షిణ దిశగా ఏటవాలుగా సాగుతూ ఇంఫాల్ లోయలలో కలిసి పోతున్నాయి..[1]

చరిత్ర

[మార్చు]

సేనాపతి జిల్లా ముందుగా నార్త్ మణిపూర్ జిల్లాగా ఉంటూ తరువాత సేనాపతి జిల్లాగా మారింది. ఈ జిల్లా 1969 నవంబరు 14 నుండి ఉనికిలోకి వచ్చింది. జిల్లా కేంద్రంగా కరాంగ్ ఉండేది తరువాత 1976 డిసెంబరు 13 న జిల్లాకేంద్రం సేనాపతి పట్టణానికి మార్చబడింది. 1983 జూలై 15 నుండి ఈ జిల్లా సేనాపతి జిల్లాగా మారింది.

భౌగోళికం

[మార్చు]

సేనాపతి జిల్లా మణిపూర్ రాష్ట్ర ఉత్తర భూభాగంలో డిగ్రీల 93.29°, 94.15° అక్షాంశం, 24.37°, 25.37° డిగ్రీల రేఖాంశం వద్ద ఉంది. జిల్లా దక్షిణ సరుహద్దులో ఇంఫాల్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఉఖ్రుల్ జిల్లా, పడమటి సరిహద్దులో తమెంగ్‌లాంగ్ జిల్లా, ఉత్తర సరిహద్దులో నాగాలాండ్ జిల్లాలోని ఫెక్ జిల్లా ఉన్నాయి. జిల్లా సముద్రమట్టానికి 1061-2788 ఎత్తులో ఉంది.

వాతావరణం

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ జిల్లా ఉపౌష్ణమండల వాతావరణం కలిగి ఉంది. జిల్లాలో భూమి అధికంగా బంకమట్టితో నిండి ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 38.1 ° సెల్షియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 34.1° సెల్షియస్. వర్షపాతం 670 మి.మీ. జిల్లాలో 110 వాటర్ షెడ్లు ఉన్నాయి. ఒక్కో వాటర్ షెడ్ శక్తితో 2000-3000 హెక్టార్లకు నీరు లభిస్తుంది. ఇవి చివరగా ప్రధాన నదిలో మిళితం ఔతుంటాయి.

ఆర్ధికం

[మార్చు]

వ్యవసాయం

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో 80% భూభాగం అరణ్యాలతో నిండి ఉంది. 20% భూభాగం వ్యవసాయనికి ఉపయోగపడుతుంది. వరి, ఉర్లగడ్డలు, క్యాబేజి, మొక్కజొన్నలు మొదలైన వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేయబడుతున్నాయి. ప్రజలు ప్రధాన వృత్తులలో వ్యవసాయం ప్రధానమైనది. అలాగే జిల్లాలో ప్రజలు టెర్రస్ పంటలు పండించడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు.

మౌళిక వసతులు

[మార్చు]
మౌలిక వసతులు సంఖ్య
1 కమ్యూనిటీ అభివృద్ధి/ట్రైబల్ డెవెలెప్మెంట్ బ్లాక్ 6
2 అటానిమస్ హిల్ డిస్ట్రిక్ కౌంసిల్ 2
3 పోలీస్ స్టేషను 6
4 జనసంఖ్య ఆధారిత పోలీస్ స్టేషను 41,212
5 ఫైర్ స్టేషను/ సబ్- స్టేషను 1
6 విధాన్ సభా సీటు 6
7 ల్లోక్ సభా స్థానం లేదు
8 గ్రామ పంచాయితీ లేదు
9 అసెంబ్లీ నియోజకవర్గం
ఇన్నర్ మణిపూర్ లేదు
బి ఔటర్ మణిపూర్ 6
10 పోస్ట్ ఆఫీస్
ప్రధానకార్యాలయం లేదు
బి సబ్- ఆఫీసు
సి కార్యాలయశాఖ 73
డి లెటర్ బాక్సెస్ (పోస్టాఫీసు అదనం) 26
గ్రామ పోస్ట్‌మన్ 89
11 టెలే కమ్యూనికేధన్
టెలెగ్రాఫ్ ఆఫీసులు లేదు
బి టెలెఫోన్ ఎక్చేంజ్ 5
సి సమైక్య కార్యాలయాలు 9
డి సబ్-స్టేషను 754
డెల్ వర్కింగ్ 751
ఎఫ్ పి.సి.ఒ 10
జి ఎల్.డి.పి.డి.పి.సి.ఒ. (వి.ఐ.పిలు) కనెక్టెడ్ టు వి.సి/జి.పి.సి ఆన్ ఎం.ఎ.ఆర్.ఆర్ 121
12 ఉపాధి
ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ 3
బి రిజిస్ట్రేషన్లు 1,019
సి నియామకాలు లేదు
బి అభ్యర్ధన పత్రాలు 23,145
జనసంఖ్యా పరంగా ఎనొలాయ్మెంటు ఎక్చేంజ్ 82,000
13 పి.హెచ్.డి
గ్రామాలు 43
బి పార్షియల్లి కవర్డ్ 26
14 పవర్
రాష్ట్ర ప్రభుత్వానికి స్వంతమైన జలవిద్యుత్తు 1.30 మెట్రిక్ వాట్లు
బి రాష్ట్ర ప్రభుత్వానికి స్వంతమైన జలవిద్యుత్తు ఉత్పత్తి 0.41 జి.డబ్ల్యూ- హెచ్
సి 132/33 కె.వి సబ్-స్టేషను 2
డి గ్రామాల సంఖ్య 485

విభాగాలు

[మార్చు]

మణిపూర్ రాష్ట్ర జిలాలలో సేనాపతి జిల్లా వైశాల్యంలో ప్రథమ స్థానంలో ఉంది. సేనాపతి జిల్లా పాలన డెఫ్యూటీ కమీషనర్, మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మెజిస్ట్రేట్‌కు సహాయంగా డిస్ట్రిక్ సప్లై ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఒక అసిస్టెంట్ ఎలెక్షన్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఒక సూపరింటెండెంట్ వంటి పలువురు అధికారులు పాలనా నిర్వహణలో సహకరిస్తుంటారు. ది డెఫ్యూటీ కమీషనర్ అదనపు డెవెలెప్మెంట్ కమీషనర్‌గా బాధ్యత వహిస్తారు.

  • ఈ జిల్లా 5 ఉపవిభాగాలుగా విభజించబడింది:
ఉప విభాగం ప్రధానకార్యాలయాలు
1 మావో-మారం తడుబి
2 పయోమాతా పయోమాతా
3 పురు పురు
4 కంగ్పొక్పి కంగ్పొకి
5 సైకు సైకు
6 సైతు -గంఫజోల్ గమ్నొం-సపర్మెయిన.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 354972, [2]
ఇది దాదాపు బెలిజే దేశ జనసంఖ్యకు సమానం [3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 565 వ స్థానంలో ఉంది [2]
1చ.కి.మీ జనసాంద్రత 109 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 25.16%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి 939:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 75%.[2]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

ఈస్ట్ ఇంఫాల్ మావో నాగాలు, మారం, తంగల్, పౌమై, తంగల్, జెమై, లియంగ్మై, రాంగ్మై (కబుయి), తంగ్ఖుల్, మీటియి, తడౌ, నేపాలీలు, వైఫై, చిరు, మరింగ్ మొదలైన గిరిజన తెగలు వారు నివసిస్తున్నారు.

రహదార్లు

[మార్చు]

జాతీయ రహదారి 92, జాతీయ రహదారి 39 ఈ జిల్లాగుండా ఉత్తర, దక్షిణాలుగా నిర్మించబడింది. ఇంఫాల్- తమెంగ్‌లాంగ్ ద్వారా కంగ్పొక్పి మార్గం, మారం-పెరెన్ రోడ్, తడుబి-టొల్లొలి-ఉఖ్రుల్ రోడ్, మారం - న్గరి- కచై రోడ్, కరంగ్- పురుల్- లియై రోడ్, సేనాపతి-కొంగ్‌డై-ఫైబంగ్ రోడ్ మొదలైన రహదారి మార్గాలు జిల్లా వాసులకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

సేనాపతి జిల్లాలో మావోలా, మారం పౌలా, తౌడు భాషలు వాడుకలో ఉన్నాయి.

సంస్కృతి

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో వివిధ సనొరదాయాలకు చెందిన ప్రజలు నివసుస్తున్న కారణంగా వైవిధ్యమైన ఉత్సవాలను పండుగలను జరుపుకుంటారు.

  • కింద జాబితాలో కొన్ని ముఖ్యమైన పండుగలను వరుసక్రమంలో ఉన్నాయి.
  • తౌనిల్:- జనవరి 5 న పౌమినాగాలు కొత్తసంవత్సర వేడుకలను జర్పుకుంటారు. ఈ పండుగ కారణంగా సాంఘికంగా ఒకరితో ఒకరు కలవడం, కుంటబం ఒకటిగా కలవడం వలన కొత్త ఉత్సాహం ఇస్తుంది.
  • లౌనిల్:- పౌమై నాగాల పవిత్ర ఉత్సవాలలో లౌనిల్ ఒకటి. ఈ పండుగను వరిపంట చేతికి వచ్చిన తరువాత జూలై మద్యభాగంలో జరుపుకుంటారు. ఇది అధికంగా మగవారికి ప్రాధాన్యత కలిగిన పండుగ అయినా సోదరులు తమ సోదరిలతో కలవడం ఈ పండుగలో ఒక భాగమే.
  • చీతుని:- మావో నాగాలు 6 రోజులపాటు జరుపుకునే పండుగల చీతుని. ఈ పండుగను చుతునిక్రో మాసం 25 వ రోజు (డిసెంబరు-జనవరి) జర్పుకుంటారు. మావో నాగల సాంస్కృతిక వారసత్వంగా జరుపుకునే ఈ పండుగకు " వేకువ విందు " అని అర్ధం.
  • సాలెని:- ఈ పండుగ మావో నాగాల వారసత్వ ఉత్సవాలలో ఒకటి. ఈ పండుగను మావోనాగాకు సెలెక్రో (జూలై) మాసంలో వరిపంట చేతికి వచ్చిన తరువాత జరుపుకుంటారు. ఈ పండుగలో మగవారు అందరూ నీటి మడుగలో తెల్లవారుఝాములో పవిత్రస్నానాలు చేస్తుంటారు.
  • పొంఘి:- మరం నాగాలు 7 రోజులపాటు జరుపుకునే పండుగ పొంఘి. ఈ పండుగను పొంఘి మాసం 20న (జూలై) వరిపంట చేతికి వచ్చిన తరువాత జరుపుకుంటారు.
  • కంఘి:- మారం నాగాలు కంఘి-కీ (డిసెంబరు) మాసంలో జరుపుకుంటారు. ఈ ఉత్సవం సమయంలో కుస్తీపోటీలు విశేషంగా జరుపుకుంటారు.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
  1. కౌబ్రూ మౌంటేన్.
  2. కౌబ్రూ లైఖ
  3. కంగ్పొక్పి ; సేనాపతి జిల్లాలో వైశాల్యంలో 2 వ స్థానంలో ఉన్న పట్టణం.
  4. మావో గేట్ ; మణిపూర్ హిల్ స్టేషంస్‌లో నాగాలాండ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న హిల్ స్టేషను. ఈ హిల్ స్టేషను సమీపంలో డిజుకో లోయ ఉంది.
  5. సైకుల్
  6. క్రౌచి
  7. షిపావో డైకులు, కొడోం.
  8. బారక్ సౌర్స్.
  9. హౌడు.
  10. కొయిడే బీషో
  11. మాఖేల్
  12. షజౌబా
  13. తుబుఫీ
  14. తఫౌ
  15. మఖుఫీ- అకా పయోమాతా కేంద్రం
  16. ఎమెషీఇఫ్రో
  17. రియిచియోఫెయి
  18. డిజీదురీ
  19. ప్లేస్ ఆఫ్ ది ఖుమె
  20. కౌబ్రూ మౌంటెన్:- మణిపూర్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన శిఖరంగా గుర్తించబడింది. ఈ శిఖరాన్ని పర్యాటకులు వేసవి సమయాలలో మాత్రమే అధిరోహిస్తుంటారు. పర్యాటకులు ఈ శిఖరాన్ని బృందాలుగా అధిరోహిస్తుంటారు. శిఖరాన్ని అధిరోహించే మార్గంలో అతి పెద్ద గుహ ఒకటి ఉంది. పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శినారని విశ్వసిస్తున్నారు.
  21. కౌబ్రూ లైఖ:- మణిపూర్ రాష్ట్రంలోని ప్రఖ్యాత శివాలయాలలో కౌబ్రూ లైఖా ఒకటి. శివరాత్రి, కంవర్డ్ సమయాలలో ఈ ఆలయానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. కౌబ్రూ మౌంటెన్ శిఖరం మీద వదిలో పాలు ఈ అలయంలోకి చేరుకుంటాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. ఈ ఆలయం ఇంఫాల్ నదీత్తీరంలో ఉంది. ఈ ఆలయం జాతీయరహదారి 39 సమీపంలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. http://senapati.nic.in/index.htm
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Belize 321,115 July 2011 est.

వెలుపలి లింకులు

[మార్చు]