మౌనం
Appearance
- మౌనం అర్ధాంగీకారం
- మౌనమె నీ భాష ఓ మూగ మనసా
- - ఆత్రేయ
- మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిని...
- -
- మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది... ఎదిగే కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది...
- నీ వివేకం గురించి నీకు సందేహంగా ఉన్నపుడు మౌనంగా ఉండడం ఉత్తమం.
- నీవు చేసిన లోకోపకారాల గురించి మౌనంగా ఉండు. కాని నీకు ఇతరులు చేసిన సేవలను అందరికీ చాటిచెప్పు.
- కాని నా మాటలు నిశ్శబ్దపు వాన చుక్కలలాగా కురిశాయి. మౌనం నూతి అంచులలో ప్రతిధ్వనించాయి..
- పాల్ సైమన్, The Sound of Silence
- వినిపించిన రాగాలు మధురమైనవి. కాని ఇంతకు ముందు విననివి ఇంకా మధురమైనవి. కనుక మౌనమైన వాయిద్యాలలారా! మీ సంగీతాన్ని కొనసాగించండి.
- జాన్ కీట్స్, Ode on a Grecian Urn
- మనుష్యుల మధ్య సంబంధాలలో విషాదం ఎప్పుడు మొదలవుతుంది? మాటలను అపార్ధం చేసికోవడం వలన కాదు. మౌనాన్ని అర్ధం చేసుకోకపోవడం వలన.
- చివరకు మనకు గుర్తుండేది శతృవుల మాటలు కాదు. మిత్రుల మౌనమే చిరకాలం జ్ఞాపకం ఉంటుంది.
- మాట్లాడాల్సిందెప్పుడు? మౌనంగా ఉండాల్సిందెప్పుడు? - ఇది తెలియడం ఒక గొప్ప వరం.
- మాటలకంటే మౌనంలో ఎక్కువ అర్ధం దాగి ఉంటుండి.
- మౌనం చాలా బోరు కొడుతుంది.
- ఒకోమారు మౌనం అన్నింటికంటే తీవ్రమైన విమర్శ అవుతుంది.
- మౌనంలో కూడా వ్యాకరణ దోషాలుంటాయి.
- స్టానిస్లా జెర్జీ లెక్, Unkempt Thoughts
- నువ్వు చెప్పనవసరం లేని విషయాలు నీ సంపదలు.
అనవసరమైన విషయాలు మాట్లాడితే సంభాషణ బలహీనమౌతుంది.
అనవసరమైన విషయాలు వింటే నీ వినికిడి మందగిస్తుంది.
నువ్వు వింటానికి ముందే నీకు తెలిసిన విషయాలు నీ వ్యక్తిత్వం అవుతాయి. నీ మనుగడకు అవి ప్రాణాలు.- విలియమ్ స్టాఫర్డ్, Crossing Unmarked Snow
- నీ హృదయాన్ని తరచి చూడు. సలహాలు, ఉపాయాలు చెప్పేవారు నీకు నిజమైన సన్నిహితులు కారు. కష్టసుఖాలలో మౌనంగా నీకు తోడుండి నీ అనుభూతులను పంచుకొనేవారు, దిక్కుతోచనప్పుడు తానుకూడా నీతో విషాదాన్ని అనుభవించేవాడు నిజమైన స్నేహితుడు.