ఇక అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. Photo : Twitter
పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తదుపరి షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరుగనుందట.. భారీగా వేసిన సెట్స్‌లో అల్లు అర్జున్ జాయిన్ అవుతాడట. అక్కడే దాదాపు ఓ 30 రోజుల పాటు షూటింగ్ జరుగునుందని టాక్.. ఈ ముప్పై రోజుల్లో దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ కానుందని.. బ్యాంకాక్‌లోని అక్కడి దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారట టీమ్ . Photo : Twitter
ఇక అది అలా ఉంటే గంగోత్రి సినిమాకు అల్లు అర్జున్ ఫస్ట్ ఛాయిస్ కాదంటున్నారు నటుడు నాగబాబు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న బన్నీ తొలి చిత్రం గంగోత్రి అని తెలిసిందే. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అశ్వినిదత్ నిర్మించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ గంగోత్రి చిత్రంలో నటించడానికి మొదట రామ్ చరణ్‌కు ఆఫర్ వచ్చిందనీ, ఆ తరువాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లోకి వచ్చాడని తెలిపారు. Photo : Twitter
దీనికి కారణం కూడా తెలిపారు నాగబాబు. చరణ్ సినిమా అరంగేట్రం చేయడానికి అప్పటికీ చాలా చిన్నవాడని భావించారనీ, దీంతో అల్లు అర్జున్‌ను ఈ చిత్రానికి సూచించింది చిరంజీవి అంటూ నాగబాబు పేర్కొన్నారు. సినిమాల్లకంటే ముందు చరణ్‌కి మరింత మెచ్యూరిటీ, ట్రైనింగ్ అవసరమని అన్నయ్య చిరంజీవి భావించారనీ అందుకే అల్లు అర్జున్ పేరును సూచించారనీ అన్నారు. ప్రస్తుతం నాగబాబు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోకిరి నుంచి లేటెస్ట్‌గా ప్రభాస్ వర్షం వరకు రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందాయి. ఇక లేటెస్ట్‌గా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా దేశముదురు మళ్లీ థియేటర్లలో విడుదలకానుందని తెలుస్తోంది. ఈ సినిమా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న థియేటర్స్‌లో విడుదలకానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. హన్సిక హీరోయిన్‌గా నటించింది.. Photo : Twitter
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 1 త్వరలో రష్యాలో కూడా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్‌లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. ఈ ఒక్క సీన్‌ను షూట్ చేసేందుకు టీమ్ థాయ్‌ల్యాండ్ వెళ్లనుందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్‌లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. . Photo : Twitter
ఈ సినిమాలో సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుందని తాజా టాక్. ఆమె ఓ 10 నిమిషాల పాత్రలో మెరవనుందట. కథను మలుపుతిప్పే పాత్రలో సాయి పల్లవి నటించనుందని, ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని అన్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్ప తో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్‌లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టనుందో.. Photo : Twitter
‘పుష్ప’ (Pushpa) 1 విషయానికి వస్తే.. ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి కామన్ పీపుల్‌తో పాటు సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్‌ను మెచ్చుకున్నారు. (Twitter/Photo)
ఇక ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ అన్ని భాషల్లో కలిపి 5 బిలియన్ వ్యూస్‌పైగా సంపాదించింది. మొత్తంగా ఎక్కువ మంది యూట్యూబ్‌లో చూసిన పాటల అల్బమ్‌గా పుష్ప రికార్డులకు ఎక్కింది.. పుష్ప 2 డాన్‌గా ఎలా రూల్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ. Allu Arjun Photo : Twitter
హీరోగా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా ఆర్య మూవీ కేరళలోని చాలా థియేటర్లలో 100 రోజులు ఆడింది. బన్ని వచ్చినపుడు ఎవరీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవచ్చా..? ప్రేక్షకుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమర్శలు వచ్చాయి. బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు. కానీ అల్లు అర్జున్‌పై వచ్చాయి. గంగోత్రి విడుదలైనపుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి.ఇపుడ ఏకంగా ఇండియా టుడే ఇంగ్లీష్ కవర్ పేజ్ పై నార్త్‌లో సత్తా చాటుతున్న హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఆర్ఠికల్ రాసే స్థాయికి చేరుకున్నాడు. (Twitter/Photo)
ఆర్య నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతం.. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ నత అద్భుతమైన స్టార్ డమ్.. సూపర్ పర్ఫార్మెన్స్‌తో దుమ్ము దులిపాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు యూత్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. (Twitter/Photo)
ముఖ్యంగా ఇపుడు నార్త్ బెల్ట్ ప్రాంతాల్లో సౌత్ హీరోల సినిమాలకు మంచి గిరాకీ ఉంది. బాహుబలితో ప్రభాస్.. కేజీఎఫ్‌తో యశ్.. అక్కడి ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఆ తర్వాత పుష్పలో అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్యాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా ఇపుడు సౌత్ హీరోలే చిత్ర పరిశ్రమను ఏలుతున్నారనే చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప విషయానికొస్తే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఈ సినిమా సక్సెస్‌తో హీరోగా అల్లు అర్జున్.. నటిగా రష్మిక మందన్న రేంజ్ మారిపోయింది. (Twitter/Photo)