ఒకప్పుడు తెలుగులో పాత సినిమాలు రీ రిలీజ్‌లు అనేవి ఎక్కువగా ఉండేవి. శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వీటి దూకుడు తగ్గింది. తాజాగా గత కొన్ని రోజులుగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ అనే ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి తాజాగా ఈ కోవలో పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హిట్ ‘ఖుషీ’ మూవీ న్యూ ఇయర్ కానుకగా థియేటర్స్‌లో మళ్లీ విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. (Twitter/Photo)
21 యేళ్ల క్రితం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఏ.ఎమ్.రత్నం నిర్మించిన ‘ఖుషీ’ సినిమాలో సరసన భూమిక నటించింది. ఈ సినిమా అంటే ప్రేక్షకుల్లో వైబ్రేషన్స్ మొదలైవుతున్నాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్‌కు మరింత చేరువయ్యారు.ముఖ్యంగా సిద్దు సిద్ధార్ధ రాయ్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు అప్పటి యూత్‌ను కనెక్ట్ అయ్యాయి. (Twitter/Photo)
డిసెంబర్ 31న విడుదలైన పవన్ కళ్యాణ్ జల్సా మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 3.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హిట్‌గా రీ రిలీజ్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ చిత్రం రెండో రోజు 1.52 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 5.14 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపిచింది. ఓవర్సీస్ + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 5.91 కోట్లు రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. (Twitter/Photo)
ఒక్క నైజాంలోనే ఈ సినిమా మొదటి రోజు రూ. 1.65 కోట్లు వసూళ్లును రాబట్టింది. ఏపీ మరియు తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. ఖుషీ 3.62 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత జల్సా మూవీ రూ. 2.57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో రెండో స్థానంలో ఉంది. పోకిరి ఫష్ట్ డే 1.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో మూడో ప్లేస్‌లో ఉంది. ఒక బిల్లా రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ. 85 లక్షలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అటు బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 64 లక్షలు రాబట్టి 5వ స్థానంలో నిలిస్తే... వర్షం రూ. 15 లక్షల గ్రాస్ వసూళ్లతో 6వ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
ఓవర్సీస్+ ఇతర రాష్ట్రాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఖుషీ .. రూ. 4.15 కోట్ల గ్రాస్.. జల్సా మూవీ రూ. 3.20 కోట్ల గ్రాస్ వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. పోకిరి మూవీ రూ. 1.73 కోట్ల గ్రాస్ వసూళ్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ మూవీ రూ. 1.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇక ‘బిల్లా’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 1.05 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా నైజాం (తెలంగాణ)తో పాటు రెండు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఖుషీ సినిమా రీ రిలీజ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి హీరోగా పవన్ స్ఠామినా ఏంటో ప్రూవ్ చేసింది. (Twitter/Photo)
2001లో విడుదలైన ఈ సినిమా ఆ యేడాది సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ యేడాది బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమా హైయ్యెస్ట్ గ్రాసర్‌గా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఖుషీ సినిమా వాల్డ్ వైడ్‌గా 21 యేళ్ల క్రితమే రూ. 27 కోట్ల కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. (Twitter/Photo)
ముఖ్యంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ పలికిన హావ భావాలు.. సిద్దు.. సిద్ధార్ధ్ రాయ్ అంటూ చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు పూనకంతో ఊగిపోయారు. (File/Photo)
అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విలన్‌ను ఉద్దేశిస్తూ.. నువ్వు గుడుంబా శంకర్ అయితే ఏంటి.. ? తొక్కలో శంకర్ అయితే ఏంటి అన్న డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయాయి. (Twitter/Photo)
ఈ సినిమాను ఎస్.జె.సూర్య.. తమిళంలో విజయ్, జ్యోతిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఖుషీ’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్,భూమికలతో తెరకెక్కించారు. హీరోగా పవన్ కళ్యాణ్ నటించిన 7వ సినిమా. (Twitter/Photo)
ఈ సినిమాకు మణిశర్మ అందించిన బాణీలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రం 70 కేంద్రాల్లో 100 రోజులుకు పైగా నడిచింది. (Twitter/Photo)
ఖుషీ సినిమా 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ నడిచింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాను ముందుగా విజయ్.. తమిళంలో చేసారు. ఆ తర్వాత ఫర్దీన్ ఖాన్, కరీనా కపూర్‌లు హిందీలో ఖుషీ టైటిల్‌తో ఈ సినిమా చేసారు. ఆ తర్వాత కన్నడలో గణేష్, హీరో హీరోయిన్లుగా ‘ఎనో ఊతర’ పేరుతో రీమేక్ అయింది. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ నటించిన చాలా చిత్రాలు ఏప్రిల్ నెలలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అందులో ‘ఖుషీ’ సినిమా కూడా ఉంది. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. ఇప్పటికే ఓటీటీ, యూట్యూబ్‌తో పాటు శాటిలైట్‌లో ఎన్నో సార్లు ప్రసారమైన పవన్ కల్యాణ్ అభిమానులు 21 యేళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తే ఇపుడు కూడా ఓ రేంజ్‌లో ఈసినిమా చూసి ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర మరోసారి బ్లాక్ బస్టర్ చేసారనే చెప్పాలి. (Twitter/Photo)