Khammam : లోన్ యాప్ కు యువకుడు బలి

X
By - Vijayanand |19 Feb 2023 4:19 PM IST
ఖమ్మం జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అభం శుభం తెలియని యువకులు లోన్ యాప్‌కు బలవుతున్నారు. తాజాగా 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రఘునాథపాలెం మండలం బావోజి తండాకు చెందిన ఆకాష్ అనే యువకుడు... ఖమ్మంలో ఓ సిల్వర్ షాపులో పనిచేస్తున్నాడు. ఫోన్ యాప్ ద్వారా గతంలో 6 వేలు లోన్ తీసుకున్నాడు. ఇప్పటికే 60వేలు చెల్లించాడు. అయినా ఇంకా చెల్లించాలంటూ వేధిస్తుండటంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com