బహాదుర్ షా జఫర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బహాదుర్ షా చిత్రపటం

2వ బహాదుర్ షా మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు. 'జఫర్' ఇతని కలంపేరు. ఇతని ప్రథమ గురువు 'ఇబ్రాహీం జౌఖ్'. ఇతని ఆస్థానంలో ప్రముఖ కవులు ఇబ్రాహీం జౌఖ్, మిర్జా గాలిబ్. 1857 తిరుగుబాటులో ఆయన పాల్గొన్నారు. తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి అధీనునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్ని ఉంచారు. అయితే చాలామంది చరిత్రకారులు బహదూర్ షా జఫర్ తన ఇష్టపూర్వకంగా కాక, తిరుగుబాటు నాయకుల చేతిలో ఒక కీలుబొమ్మ రాజుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ రీత్యా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో అతను పాలుపంచుకన్నది ప్రత్యక్షం కాదని పరోక్షమేనని పేర్కొన్నారు. ఐతే మరికొందరు చరిత్రకారుల దృష్టిలో మాత్రం ఆయన తిరుగుబాటు నాయకుల్లో ఒకరు, భారతపోరాట వీరుల్లో ఒకనిగా గుర్తింపు పొందారు.

బహదూర్ షా జఫర్ చక్రవర్తిని ఖైదు చేసి ఢిల్లీకోటను ఆంగ్లేయులు పట్టుకున్నాకా అక్కడ వారికి దొరికిన అమూల్యమైన వస్తుజాలంలో చిత్రవిచిత్రమైన సామాన్లు కనబడినవి. అందులో అపూర్వమైన శిలానిర్మితమైన పాత్రలు పూర్వకాలపునాటివి ఎన్నో ఉన్నాయి.[1] 1739లో నాదిర్షా చరిత్రలో కనీవినీ ఎరుగనంత అపురూపమైన సంపదను, ఆపైన 1756-57లో ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ మిగిలిన కొంత సంపదను దోచుకుపోయినాకా కూడా ఆ మాత్రం వస్తుజాలం దొరికిందంటే మొఘల్ సామ్రాజ్య ఉచ్ఛస్థితిలో ఎంత వైభవం అనుభవించిందో అర్థంచేసుకోవచ్చు.

ఇవీ చూడండి

మూలాలు

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.