Jump to content

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం

వికీపీడియా నుండి
అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం
జరుపుకొనే రోజుమే 25
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు
ఎటాన్ పాట్జ్

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తప్పిపోయిన పిల్లల, అపహరణకు గురైన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1][2] 2001 నుండి 6 ఖండాల్లోని 20కి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

1979, మే 25న న్యూయార్క్ లో పాఠశాలకు వెళుతున్న ఆరేళ్ల పిల్లవాడైన ఎటాన్ పాట్జ్ అదృశ్యమయ్యాడు. ఎప్పటికీ చేధించలేని మిస్టరీగా ఆ కేసు మిగిలిపోయింది. అంతేకాదు దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజలు కోపంతో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తూ, ర్యాలీలు తీశారు. 1983లో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మే 25ను ఎటాన్ పాట్జ్ జ్ఞాపకార్ధంగా జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవంగా ప్రకటించాడు.[3][4] 2001, మే 25న మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు.[5][6]

కార్యక్రమాలు

[మార్చు]

1998లో యునైటెడ్ స్టేట్స్ లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఐసీఎంఈసీ) అనే సంస్థ ప్రారంభించబడింది. పిల్లల అపహరణ, పిల్లలపై లైంగిక వేధింపులు, పిల్లల దోపిడి లేకుండా ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి పనిచేస్తున్న లాభప్రేక్షలేని సంస్థ ఇది.[7][8][9]

అల్బేనియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చిలీ, కోస్టారీకా, ఈక్వడార్, జర్మనీ, గ్రీస్, గౌతమాలా, ఐర్లాండ్, ఇటలీ, జమైకా, లుధియానా, మెక్సికో, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రష్యా, సెర్బియా, దక్షిణ కొరియా, స్పెయిన్, తైవాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి 29 దేశాలు ఈ ఐసీఎంఈసీ పరిధిలో పనిచేస్తున్నాయి.[9]

ప్రపంచవ్యాప్తంగా పిల్లల అపహరణ సమస్యను గుర్తించడానికి, పిల్లలను సంరక్షణకు తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి తల్లిదండ్రులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చేలా ఐసీఎంఈసీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.[10][11][12][13][14]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి, మెయిన్ ఫీచర్ (24 May 2018). "మరపురాని చిహ్నాలు!". www.andhrabhoomi.net. కందగట్ల శ్రవణ్‌కుమార్. Archived from the original on 24 మే 2018. Retrieved 25 May 2020.
  2. సాక్షి, ఎడ్యుకేషన్ (22 May 2020). "మే 25 వరల్డ్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే(ప్రపంచ తప్పిపోయిన బాలల దిన్సోవం)". www.sakshieducation.com. Archived from the original on 25 May 2020. Retrieved 25 May 2020.
  3. "May 25 – International Missing Children's Day" Archived 2020-10-20 at the Wayback Machine, Help Bring Them Home
  4. "National Missing Children's Day", Office of Juvenile Justice and Delinquency Prevention
  5. "International Missing Childrens Day May 25, 2014", An Garda Síochána, May 25, 2014
  6. "Missing Children's Day passes unnoticed". The News International, Pakistan. 26 May 2010. Archived from the original on 9 డిసెంబరు 2014. Retrieved 25 మే 2020.
  7. "Global Missing Children's Network". NCMEC. Archived from the original on 2 March 2015. Retrieved 26 May 2020.
  8. EC-Council (2009). Computer Forensics: Investigating Network Intrusions and Cyber Crime. Cengage Learning. pp. 11–26, 11–31 to 11–33. ISBN 1435483529.
  9. 9.0 9.1 "Global Missing Children's Network".
  10. "Missing Persons: International Missing Children's Day: May 25". Australian Federal Police. Archived from the original on 6 డిసెంబరు 2014. Retrieved 26 మే 2020.
  11. Jack Quann (25 May 2014). "Today marks International Missing Children's Day; It is estimated 8 million children are reported missing each year". newstalk.
  12. "In 2012, 311 children went missing in Greece". GR Reporter. 25 May 2013. Archived from the original on 3 July 2019. Retrieved 26 May 2020.
  13. "Missing Children Day May 25, 2011", Youtube (video), DontYouForgetAboutMe
  14. " Countries around the world honor International Missing Children's Day on May 25" Archived 14 డిసెంబరు 2014 at the Wayback Machine, ICMEC

ఇతర లంకెలు

[మార్చు]