Jump to content

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వికీపీడియా నుండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8,1914 కొరకు జర్మన్ ప్రచారపత్రం; తెలుగు అనువాదం (ఆంగ్లం నుండి)[1][2]
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంఅంతర్జాతీయ
ప్రాముఖ్యతపౌరహక్కుల జాగృతి దినోత్సవం
మహిళలు , యువతుల దినోత్సవం
లైంగికత్వ దినోత్సవం
ధనాత్మక విచక్షణ దినోత్సవం
జరుపుకొనే రోజు8 మార్చి
సంబంధిత పండుగసార్వత్రిక బాలల దినోత్సవం, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, అంతర్జాతీయ కార్మికులదినోత్సవం
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఒకటే రోజు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.[3] ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు నిస్తోంది. ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, వివిధ దేశాల్లో, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో భాగమైంది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరిస్తారు.

చరిత్ర

[మార్చు]

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3, న్యూయార్క్లో 1909 ఫిబ్రవరి 28న జరిగాయి. 1910 ఫిబ్రవరి 27 [4][5] రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.[6][7] 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు[8] తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమంది పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి.[6] వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు.[6] మహిళలు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు..[3] అమెరికాలో ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.[6]

ఆస్ట్రియా లోని,బిల్డర్స్ లేబరెర్స్ ఫెడరేష మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది.)

1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు.[5] అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.[5][9] 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.[9][10]

1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8).[3] ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు, శాంతి' డిమాండుగా వ్యవహరించారు.[5] లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".[9]

అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు.[11] 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.[12]

అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.[13]

1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.[5]

భారతదేశంలో మహిళా హక్కుల పోరాటం

[మార్చు]

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది.[14] భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌ విమలారణదివే, కెప్టెన్‌లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, [[పార్వతీకృష్ణన్‌]] ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం, నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది.[15]

యు.యెస్.ఎ లో అధికారిక గుర్తింపు

[మార్చు]

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం

[మార్చు]

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2022 మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది.[16][17] కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలకు భారత పురావస్తు విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలను ఈ రోజున ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది.[18]

అంతర్జాతీయ మహిళా దినోత్సవమునకు ఐక్యరాజ్య సమితి అధికారిక నేపధ్యములు

[మార్చు]
పాంపియోనాలో 2019 మార్చి8
2019 మార్చి 8 న స్పెయిన్ లో ర్యాలీ
సంవత్సరం యుఎన్ థీమ్[19]
1996 గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట
1997 మహిళలు, శాంతి టేబుల్
1998 మహిళలు, మానవ హక్కులు
1999 మహిళలపై హింసలేని ప్రపంచం
2000 శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట
2001 మహిళలు, శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట
2002 నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు, అవకాశాలు
2003 లింగ సమానత్వం, లింగ సమానత్వం, సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు
2004 మహిళలు, హెచ్.ఐ.వి / ఎయిడ్స్
2005 తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట
2006 నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు
2007 మహిళలు, బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట
2008 మహిళలు, అమ్మాయిలు ఇన్వెస్టింగ్
2009 మహిళలు, పురుషులు యునైటెడ్ మహిళలు, అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా
2010 సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్
2011 మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ,, సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్
2012 గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం, ఆకలి నిర్మూలన
2013 ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం
2014 మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి
2015 మహిళలను శక్తివంతం చేయడం, మానవత్వాన్ని శక్తివంతం చేయడం: చిత్రించండి.
2016 2030 నాటికి గ్రహం 50-50: లింగ సమానత్వం కోసం స్టెప్ ఇట్ అప్
2017 మారుతున్న పని ప్రపంచంలో మహిళలు: 2030 నాటికి ప్లానెట్ 50-50
2018 ప్రస్తుత సమయం: గ్రామీణ, పట్టణ కార్యకర్తలు మహిళల జీవితాలను మారుస్తున్నారు
2019 సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి.
2020 "నేను పురుషానుక్రమముతో సమానత్వం: మహిళల హక్కులను గ్రహించడం"
2021 నాయకత్వంలోని మహిళలు:కోవిడ్ - 19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం
2022 లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండి

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]
2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళలతో యు.యస్. ఆర్మీ అధికారిణి, లుటినెంట్ కర్నల్ పామ్ మూడీ!

సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు.[20] 2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి .[21] యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా 2011 మార్చిని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు.[20] రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా "100 మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు , బాలికల సాధికారత", ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు.[22] ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు.[23] పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.[ఆధారం చూపాలి]

ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.

ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- " బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు".[24]

ఇవి కూడా చూడండి

[మార్చు]

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ “గ్రామీణ మహిళా స్వశక్తీకరణ –ఆకలి పేద రిక నిర్మూలన”ని థీమ్ గా ఎంచుకుంది.[25] 2012 మహిళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్.సి. వారు, సైనిక దళాల్లో చనిపోయిన వారి తల్లుల భార్యల సంక్షేమానికి కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహిళలకు సమాజంలో చాలా ఆర్థిక , సామాజిక సమస్యలు ఎదురవుతుంటాయి. ఐ.సి.ఆర్.సి. వారు, తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యులకి తెలపడం చాలా ముఖ్యమని నొక్కి వక్కాణినించారు [26] 2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ మీద వేయబడిన గూగుల్ డూడుల్

2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

“ప్రమాణం చేసాక వెనుతిరగడం లేదు: మహిళలపై హింస నిర్మూలించడం కోసం పని చేద్దాం” అని 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ని యునిటేడ్ నేషన్స్ వారు ఏర్పరచుకున్నారు. "[27] 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఐ.సి.ఆర్.సి. వారు (అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ) జైలులో మగ్గుతున్న మహిళల సమస్యల మిద ఉద్గాటించార.[28]

2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

యునైటెడ్ నేషన్స్ "మహిళా సమానత్వమే అందరికీ హితం" అనే థీమ్ ని 2014 మహిళా దినోత్సవానికి ఎంచుకుంది.[29][30]

2015 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, కార్యకర్తలు బీజింగ్ డిక్లరేషన్, ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ యొక్క 20 వ వార్షికోత్సవ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఇది మహిళల హక్కులను సాకారం చేసే ఎజెండాను నిర్దేశించిన చారిత్రాత్మక రోడ్‌మ్యాప్.[31]

2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, "అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, భారత మహిళలకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ నిర్మాణంలో సంవత్సరాలుగా వారు చేసిన కృషికి కృతజ్ఞతలు." అనే సందేశాన్నిచ్చాడు.[32] దేశవ్యాప్తంగా ఇప్పటికే పనిచేస్తున్న ఎనిమిది వన్ స్టాప్ సంక్షోభ కేంద్రాలకు అదనంగా మార్చి 8 న మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.[33] మహిళా దినోత్సవానికి ముందు, జాతీయ ప్రయాణ ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా, ప్రపంచంలోనే అతి పొడవైన నాన్-స్టాప్ ఫ్లైట్ నడిపింది. ఇది ఢిల్లీ నుండి సాన్‌ఫ్రాన్సిస్కోకు సుమారు 17 గంటల్లో 14,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.[34]

2017 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

రష్యన్ విప్లవానికి 2017 నాటికి శతాబ్ద కాలం పూర్తవుతుంది. 1917 మార్చి 8 లో రష్యన్ మహిళలు బ్రెడ్డు కొరత గురించి సెయింట్ పీటర్స్బెర్గ్ వీధులలో నినదించారు. ఈ సంఘటనలు రెండవ సార్ నిచోలాస్ అభ్యంతరం వలన మార్చి 15న ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2017 మార్చి 8 నాటికి ఇవన్ని పుంజుకోవాలని యోచిస్తున్నారు. వారిలో యుక్రేనియన్ మహిళా కార్యాచరణ సంఘం ఫెమెన్ ముఖ్యమైనది. వారి ముఖ్య ఉద్దేశం మహిళల్ని ఉత్తేజితుల్క్ని చేయడం; సామాజిక పథంలో పాల్గొనేలా చేయడం; ఒక విప్లవం లోకి తీసుకు రావడం.[35][ఆధారం చూపాలి]ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ వర్కర్స్ మిద ఒక స్ట్రైక్ జరపాలని ప్రపంచంలో పలు యూనియన్లు నిర్ణయించాయి.

2019 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ఇతివృత్తం: 'సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి.' ఈ ఇతివృత్తం యొక్క దృష్టి లింగ సమానత్వం, మహిళల సాధికారత. ముఖ్యంగా సామాజిక రక్షణ వ్యవస్థలు, ప్రజా సేవలకు ప్రాప్యత, స్థిరమైన మౌలిక సదుపాయాలలో అభివృద్ధి చెందడానికి వినూత్న మార్గాలపై ఉంది.[36]

ఫెడరల్ స్టేట్ ఆఫ్ బెర్లిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారి ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించింది.

2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి ఇతివృత్తం : 'నేను జనరేషన్ సమానత్వం': మహిళల హక్కులను గ్రహించడం '. కోవిడ్ - 19 మహమ్మారి ఉన్నప్పటికీ, లండన్, పారిస్, మాడ్రిడ్, బ్రస్సెల్స్, మాస్కో, ఇతర యూరోపియన్ నగరాల్లో వీధి కవాతులు జరిగాయి..[37][38][39][40] ఇస్లామాబాద్‌లోని ఔరత్ మార్చ్‌ రాళ్ల దాడి వల్ల దెబ్బతింది. దీనిని ఇస్లామిక్ అని నిషేధించే ప్రయత్నం విఫలమైంది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెకెక్ లో ముసుగు వేసుకున్న పురుషులు కవాతుపై దాడి చేసిన కొద్దిసేపటికే పోలీసులు డజన్ల కొద్దీ కవాతులను అదుపులోకి తీసుకున్నారు.[37]

2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం 2021 ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం "నాయకత్వంలోని మహిళలు: కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం",[41] కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలికలు, మహిళలు ఆరోగ్య సంరక్షణ కార్మికులు, సంరక్షకులు, ఆవిష్కర్తలు, సమాజ నిర్వాహకులుగా చూపిన ప్రభావాన్ని ఎత్తిచూపారు.

2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

[మార్చు]

ఈ ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం థీమ్ #BreakTheBias - Imagine a gender equal world అంటే లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది.[42] EHK STUDYS

చిత్ర మాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. : “ మహిళలకు ఓటు హక్కు ఇవ్వండి. మహిళా దినోత్సవం మార్చి 8,1914. ఇప్పటిదాక హేతుబద్ధం కాని నమ్మకాలు , ప్రతిస్పందన భావాలు మహిళలకు పూర్తి పౌర హక్కులను ఇవ్వలేదు. వీరు కార్మికులుగా,తల్లులుగా,పౌరులుగా వారి విధులను పూర్తిగా నిర్వర్తిస్తూ , రాష్ట్రానికి , దేశానికి పన్నులను చెల్లిస్తున్నారు. ఈ సహజమైన మానవ హక్కు కొరకు పోరాటం, ప్రతి మహిళ , ప్రతి కార్మిక మహిళ యొక్క ధృఢమైన, తడబాటులేని ఉద్దేశం కావాలి. దీనికొరకు కొద్ది క్షణాల విశ్రాంతికికూడా ఆగేపనిలేదు.మహిళలు , యువతుల్లారా ఈ 9వ మహిళల బహిరంగసమావేశానికి ఆదివారం, మార్చి 8, 2014 న సాయంత్రం 3 గంటలకురండి ”
  2. "Give Us Women's Suffrage (March 1914)". German History in Documents and Images. Retrieved 2014-01-26.
  3. 3.0 3.1 3.2 "UN WomenWatch: International Women's Day – History". UN.org. Retrieved 2013-02-21.
  4. "United Nations page on the background of the IWD". Un.org. Retrieved 2012-03-08.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 "Today is International Women's Day". Take Back Halloween!. 2013-03-08. Archived from the original on 2014-02-01. Retrieved 2014-01-26.
  6. 6.0 6.1 6.2 6.3 Temma Kaplan, "On the Socialist Origins of International Women's Day", Feminist Studies, 11/1 (Spring, 1985)
  7. "History of International Women's Day". United Nations. Retrieved May 26, 2012.
  8. "About International Women's Day". Internationalwomensday.com. March 8, 1918. Retrieved 2013-03-08.
  9. 9.0 9.1 9.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-03-13. Retrieved 2014-03-04.
  10. "Women's Suffrage". Inter-Parliamentary Union. Retrieved 2014-01-26.
  11. Nelson, Jinty. "International Women's Day: a centenary to celebrate". History Workshop Online. Retrieved August 28, 2011.
  12. "Anniversaries of important events". China Factfile. Chinese Government. Archived from the original on 2015-03-12. Retrieved August 28, 2011.
  13. "WomenWatch: International Women's Day". Un.org. Retrieved 2012-03-08.
  14. ఎస్, పుణ్యవతి. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక కాదు". APUTF. Archived from the original on 2012-07-01. Retrieved 2014-03-10.
  15. ఎం., సంయుక్త,. "మహిళా దినోత్సవం : కర్తవ్యాలు". APUTF. Archived from the original on 2014-03-10. Retrieved 2014-03-10.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  16. "Vaartha Online ముఖ్యాంశాలు - ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు రేపు సెలవు ప్రకటించిన ప్ర‌భుత్వం". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-07. Retrieved 2022-03-07.[permanent dead link]
  17. "Andhra Pradesh: మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్". NTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-07. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.
  18. "రేపు మహిళలకు ఉచిత ప్రవేశం". EENADU. Retrieved 2022-03-07.
  19. "WomenWatch: International Women's Day". Un.org. Retrieved 2013-02-21.
  20. 20.0 20.1 Sindelar, Daisy. "Women's Day Largely Forgotten in West, Where It Got Its Start". Radio Free Europe. Radio Free Europe. Retrieved March 8, 2011.
  21. Pasha, Masroor Afzal. "To commemorate 100th International Women's Day". Daily Times. Daily Times. Retrieved March 8, 2011.
  22. McKellogg, JulieAnn. "Clinton Launches 100th Anniversary of International Women's Day". VOA News. voanews.com. Retrieved March 8, 2011.
  23. "International Women's Day: the fight against sexual violence must not falter". Icrc.org. Retrieved 2012-03-08.
  24. Hadeel Al-Shalchi, "Egyptian women's rights protest marred by hecklers", "The Washington Post", March 8, 2011
  25. "UN WomenWatch: International Women's Day 2012 – UN Observances Worldwide". Un.org. Retrieved 2013-02-20.
  26. Helping women take matters into their own hands International Committee of the Red Cross
  27. "UN WomenWatch: International Women's Day 2014". Un.org. Archived from the original on 2014-02-09. Retrieved 2014-02-02.
  28. "The forgotten plight of women behind bars". ICRC. Retrieved 2013-03-08.
  29. http://www.unwomen.org/en/news/in-focus/international-womens-day
  30. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-06. Retrieved 2014-03-04.
  31. "The Beijing Platform for Action, inspiration then and now | Beijing+20 campaign". UN Women. Retrieved February 11, 2015.
  32. "President of Indias message on the eve of International Women's Day". business-standard.com. Delhi. March 7, 2016.
  33. "Women's Day gift: Govt to come with 4 one-stop crisis centres". The Times of India. March 7, 2016.
  34. PTI (March 7, 2016). "Ahead of Women's Day, Air India operates 'world's longest all-women flight'". The Indian Express.
  35. (in Ukrainian) Femen: "Ми даємо чиновникам і політикам, проср...тися" Archived 2011-03-27 at the Wayback Machine, Табло ID (September 20, 2010)
  36. "International Women's Day 2019: Think equal, build smart, innovate for change". unwomen.org. UN Women. October 16, 2018. Retrieved March 8, 2019.
  37. 37.0 37.1 "International Women's Day: Marchers around the world call for equality". BBC News. March 8, 2020.
  38. "Thousands March in Spain on Women's Day Despite Coronavirus Fears". US News. Reuters. March 8, 2020.
  39. "International Women's Day Marked Across the World". VOA News. March 8, 2020.
  40. "International Women's Day 2020 around the world – in pictures". The Guardian. March 8, 2020.
  41. "International Women's Day 2021". UNWomen. Retrieved January 15, 2021.
  42. "IWD 2022 campaign theme: #BreakTheBias". International Women's Day (in ఇంగ్లీష్). Retrieved 2022-03-05.