అక్యూట్ మైలాయడ్ లుకేమియా
అక్యూట్ మైలాయడ్ లుకేమియా | |
---|---|
ప్రత్యేకత | Oncology, రక్త శాస్త్రం |
అక్యూట్ మైలాయడ్ లుకేమియా అనే ఈ రకము కాన్సర్ ఎముక మజ్జలోని మయలోసైట్స్ అనే కణములో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజిస్తూ ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందడము వలన దీనిని అక్యూట్ అని పిలుస్తారు. ఇది పిల్లల కన్నా పెద్దలలోనే ఎక్కువగ ఏర్పడుతుంది.[1] అక్యూట్ మైలాయడ్ లుకేమియా బారిన పడే పెద్దల సరాసరి వయస్సు 65 సంవత్సరములు.[2]
లక్షణములు
[మూలపాఠ్యాన్ని సవరించు]- రక్తహీనత[3]
- అలసటగా వుండుట[3]
- ఎముకల నొప్పి[4]
- రక్తము తొందరగా గడ్డ కట్టక పొవుట.[3]
- ఆకలి నశించటం[3]
- శశోషరస గ్రంథులు వాచియుండుట[4]
- దీర్ఘకాలిక జ్వరము[3]
పై చెప్పబడిన లక్షణాలు ఉన్న అందరికీ ఈ జబ్బు ఏర్పడదు, ఇతర వ్యాధులకు కూడా ఇటువంటి లక్షణాలుంటాయి.
కారణములు
[మూలపాఠ్యాన్ని సవరించు]అక్యూట్ మైలాయడ్ లుకేమియా కచ్చితమైన కారణములంటూ లేవు కాకపోతే కొన్ని కారణాల వలన అది సంభవించే ముప్పు అధికమౌతుంది.
- ఎక్స్ రేలు, ఇతర రేడియో ధార్మిక కిరణలు అధికమొత్తంలో శరీరంపై ప్రసరించుట.[1]
- పూర్వము ఇతర కాన్సర్లకు తీసుకున్న కీమోథెరపీ, రేడియోధార్మిక చికిత్సల వలన.[1]
- డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యు సంబంధిత రోగాలు ఉండుట.[1]
- పెట్రోల్, పెయింటు వంటి వాటిలోని బెంజీన్ అనే రసాయణము[1]
- ప్రొగ త్రాగుటవలన[1]
నిర్దారణ
[మూలపాఠ్యాన్ని సవరించు]రక్త పరీక్ష చెయడము ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. కానీ అది ఏ రకానికి చెందినదో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చెయ్యాలి. ఈ పరీక్షలకు నమూనాను ఎముక మజ్జ నుండి సేకరించాలి, దీనిని ఎముక మజ్జ జీవాణుపరీక్ష (Bone marrow biopsy) అని అంటారు.[5]
ఎముక మజ్జ నుండి సేకరించిన నమూనా సహాయంతో క్రింది పరీక్షలు నిర్వహిస్తారు.
- సూక్ష్మదర్శిని సహాయముతో ఎముక మజ్జలోని "బ్లాస్టుల" శాతాన్ని కనుగొనుట. (సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క మజ్జలో 3.5%కన్నా తక్కువ బ్లాస్టులుంటాయి) [5]
- ఫ్లో సైటోమెట్రి (Flow cytometry) తో ఇమ్యునోఫీనోటైపింగ్ పరీక్ష (Immunophenotyping) [5][6]
- ఎఫ్.ఐ.ఎస్.హెచ్ పరీక్ష (FISH testing) సహాయంతో కణములోని జన్యువులలో సంభవించిన మార్పులను కనుగొనుట.[6]
- వెన్నెముక నుండి కేంద్రనాడీమండల ద్రవ్యాన్ని, స్పైనల్ టాప్ లేదా లంబార్ పంక్చర్ అనే పద్ధతి ద్వారా వెలుపలకు తీసి కేంద్రనాడీమండలానికి జబ్బు వ్యాపించిందా అని పరిశోధన చెయ్యలి. కొంత మందికి రోగాన్ని కనుక్కునే సమయానికి కాన్సర్ కేంద్రనాడీమండలానికి వ్యాపించి వుంటుంది.[6]
- వీటితో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, సి.టి స్కాన్, ఎం.ఆర్.ఐ వంటి పరీక్షలు చేయడము వలన కాన్సర్ మరే ఇతర భాగాలకు వ్యాపించిందా అని వైద్యులు చూస్తారు. సాధారణంగా చాలా మందికి వ్యాధి ప్లీనముకు, కాలేయమునకు వ్యాపించి వుంటుంది.[5][6]
రకములు
[మూలపాఠ్యాన్ని సవరించు]రకము | పేరు | క్రోమోజోమ్లు | |
---|---|---|---|
M0 | మినిమలీ డిఫరెంషియేటడ్ అక్యూట్ మైలాయడ్ లుకేమియా | ||
M1 | అక్యూట్ మైలాయడ్ లుకేమియా, వితౌట్ డిఫరెంషియేటడ్ | ||
M2 | అక్యూట్ మైలాయడ్ లుకేమియా, విత్ గ్రానిలోసైట్ మెచ్యురేషన్ | t (8;21) (q22;q22), t (6;9) | |
M3 | అక్యూట్ ప్రోమైలోసైటిచ్ లుకేమియా (APL) | t (15;17) | |
M4 | అక్యూట్ మైలో మొనోసైటిక్ లుకేమియా | inv (16) (p13q22), del (16q) | |
M4eo | మొనోసైటిక్ లుకేమియాతోపాటు ఎముక మజ్జ ఈశనోఫీలియా | inv (16), t (16;16) | |
M5 | అక్యూట్ మొనోబ్లాస్టిక్ లుకేమియా (M5a) or అక్యూట్ మొనోసైటిక్ లుకేమియా (M5b) | del (11q), t (9;11), t (11;19) | |
M6 | అక్యూట్ యెరిత్రాయడ్ లుకేమియాలు | ||
M7 | అక్యూట్ మొగాకార్యో బ్లాస్టిక్ లుకేమియా | t (1;22) |
చికిత్స
[మూలపాఠ్యాన్ని సవరించు]చికిత్సగా సాధారణంగా కీమోథెరపీను ఇస్తారు. కొన్ని సందర్భాలలో కీమోథెరపీతో పాటు రేడియోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, ఇమ్యునోథెరపీని ఇస్తారు. ఇవి పని చేయని పక్షములో ఎముక మజ్జ మార్పడి చికిత్సను చేయవలసి వస్తుంది. సాధారణంగా రక్త వ్యాధి నిపుణుడు లేదా కాన్సర్ వ్యాధి నిపుణుడు ఆధ్వర్యంలో చికిత్స చేయబడును. కీమోథెరపీ మందులు ఒక్కో రకానికి మారుతుంది.
రెమిషన్ ఇండక్షన్
[మూలపాఠ్యాన్ని సవరించు]రెమిషన్ ఇండక్షన్ విభాగము 30రోజుల పాటు కొనసాగుతుంది. రోగి ఆసుపత్రిలోనే గడపవలసి వస్తుంది. ఈ విభాగము యొక్క లక్ష్యము లుకేమియాను కనిపించనంతగా తగ్గించడమే. మజ్జలోని "బ్లాస్టు" కణాలు 5% కన్నా తక్కువగా చేయడమే ఈ దశయొక్క లక్ష్యము.[7]
ఇంటెన్సిఫికేషన్
[మూలపాఠ్యాన్ని సవరించు]రెమిషన్ ఇండక్షన్లో చాలా లుకేమియా కణాలు తగ్గినా, శరీరంలో మిగిలి ఉన్న కణాలు మరలా లుకేమియాగా మారుతాయి. ఈ దశలో రెమిషన్ ఇండక్షన్లో వాడిన మందులతో పాటు మరికొన్ని కొత్త మందులను వాడుతారు. మిగిలిన లుకేమియా కణాలును చంపడమే ఈ దశ యొక్క లక్ష్యము.[7]
దుష్ప్రభావము
[మూలపాఠ్యాన్ని సవరించు]కీమోథెరపీమందులతో చాలా దుష్ప్రభావాలున్నాయి. కొన్ని ప్రాణంతకంగా కూడా వుండవచ్చును.కానీ చాలా వరకు దుష్ప్రభావలు చికిత్స ఆపిన వెంటనే నిలచిపోవును. తరచుగా కనిపించే దుష్ప్రభావాలు.[8]
కాన్సర్ తిరగబెట్టుట
[మూలపాఠ్యాన్ని సవరించు]రకమును బట్టి 20-70 శాతము మందిలో మాత్రమే కీమోథెరపీ చికిత్సతోనే లుకేమియాను నయం చేయవచ్చును.[9][10][11] తక్కిన వారిలో లుకేమియా మరలా తిరగబెట్టును. వీరికి ఎముక మజ్జ మార్పిడి చికిత్స మాత్రమే శాశ్వత పరిస్కారం చూపగలదు. ఇందులో రోగి యొక్క ఎముక మజ్జను సమూలంగా నాశనం చేసి దాని స్థానంలో దాత వద్ద నుండి సేకరించిన మజ్జ ఇవ్వబడుతుంది. ఇది అత్యంత ఖర్చుతో కూడుకొన్న విషయము పైగా, సరైన దాత దొరకనిచో ఇది చెయడం సాధ్యము కాదు. కొన్ని సార్లు రోగి యొక్క సొంత కణాలనే సేకరించి మరలా అతనికే ఇవ్వబడుతుంది, కానీ ఇటువంటి చికిత్స యొక్క ఫలితాలు సంతృప్తికరంగా లేవు. కొన్ని సార్లు రోగికి జబ్బు నయమయ్యే అవకాశము లేనిచో బాధను తగ్గించడానికి మాత్రమే చికిత్స ఇవ్వవలసి వస్తుంది. దీనిని పాలిటివ్ కేర్ అని అంటారు,[12] [13]
మందులు
[మూలపాఠ్యాన్ని సవరించు]ఆధారములు
[మూలపాఠ్యాన్ని సవరించు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 [1],webmd.
- ↑ [2] Archived 2013-08-25 at the Wayback Machine,bethematch.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 [3],nlm.
- ↑ 4.0 4.1 [4],mayoclinic.
- ↑ 5.0 5.1 5.2 5.3 [5],umm.
- ↑ 6.0 6.1 6.2 6.3 [6],మయొ.
- ↑ 7.0 7.1 [7].,
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 8.5 [8] Archived 2013-11-18 at the Wayback Machine.,
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-23. Retrieved 2013-08-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-17. Retrieved 2013-08-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-24. Retrieved 2013-08-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-26. Retrieved 2013-08-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-25. Retrieved 2013-08-11.