Jump to content

అన్నదాత (పత్రిక)

వికీపీడియా నుండి
అన్నదాత జనవరి 2009 పత్రిక ముఖచిత్రం.

అన్నదాత[1] తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక. తెలుగునాట రైతాంగం సమస్యలకు తగిన పరిష్కారాలను సూచిస్తూ వ్యవసాయ విజ్ఞాన సమాచారంతో వెలువడుతున్న పత్రిక. దీని వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు పాత్రికేయులు చెరుకూరి రామోజీరావు. అన్నదాత తొలి సంచికను అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు జనవరి, 1969లో ఆవిష్కరించాడు. అదే సంవత్సరం జూన్ 28వ తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది.[2]

పత్రిక ప్రారంభించినప్పుడు కె.ఎస్.రెడ్డి సంపాదకులు. 1987 నుండి కార్యనిర్వాహక సంపాదకుడుగా డా.వాసిరెడ్డి నారాయణరావు పనిచేస్తున్నాడు. ప్రతి సంవత్సరం అన్నదాత డయరీని కూడా ప్రచురించి చందాదారులకు అందిస్తున్నారు. ఇందులో రైతాంగానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని ఏడాది పొడుగునా ఉపయోగపడే విధంగా రూపొందిస్తున్నారు.

2019 నాటికి, ఇది 345,000 సర్క్యులేషన్‌తో భారతదేశంలో అత్యధికంగా పంపిణీ అవుతున్న పత్రికగా నమోదు అయింది.[3][4]

డిసెంబరు 2022- అన్నదాత చివరి సంచిక

గత 55 ఏళ్లుగా వెలువడుతున్న అన్నదాత మ్యాగజైన్ డిసెంబరు 2022 సంచికతో ప్రచురణను ఆపివేస్తున్నట్లు సంపాదక వర్గం ప్రకటించింది. [5]

బయటి లింకులు

[మార్చు]
  1. "ఈనాడు వెబ్ సైటులో అన్నదాత మాసపత్రిక పిడిఎఫ్ తీరులో ప్రస్తుతసంచిక, పరిశీలన తేది:2013-01-01". Archived from the original on 2014-01-05. Retrieved 2014-01-01.
  2. "Registrar of Newspapers for India లో వివరాలు వెతకవచ్చు Annadata పదంతో". Archived from the original on 2015-03-13. Retrieved 2009-05-22.
  3. "ABC Certificate" (PDF). Eenadu.
  4. "Highest Circulated Dailies, Weeklies & Magazines amongst Member Publications" (PDF). Audit Bureau of Circulations of India.
  5. Velugu, V6 (2022-11-30). "డిసెంబర్ నుంచి నిలిచిపోనున్న అన్నదాత మాసపత్రిక". V6 Velugu. Archived from the original on 2022-12-01. Retrieved 2022-12-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)