అష్టగురువులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అష్ట గురువులలో ఒకరైన ఉపనయనం చేసిన గురుతు

వివిధ రకాలైన జ్ఞానాన్ని అందించే వారు గురువులు. ఆ గురువులు వారు అందించే జ్ఞానం ఆధారంగా ఎనిమిది రకాలుగా వర్గీకరించబడతారు.

అష్టగురువులు:

  1. అక్షరాభ్యాసం చేయించినవారు
  2. ఉపనయనంలో గాయత్రీ మంత్రము ఉపదేశించినవారు
  3. వేదాధ్యయనం చేయించినవారు
  4. శాస్త్రాభ్యాసం చేయించినవారు
  5. పురాణాదికాలను చెప్పినవారు
  6. శైవ, వైష్ణవ సంప్రదాయాలను బోధించినవారు
  7. టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు నేర్పినవారు
  8. బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవారు

వివిధ రకాల గురువులు[1]

[మార్చు]
  1. బోధక గురువులు : శాస్త్రాన్ని యధాతధంగా చెప్పేవారు. ఏమాత్రము అనుభవ జ్ఞానం లేక, గ్రంథములో ఉన్న విషయాన్ని యదాతథంగా బోధించేవాడు. వీరు బోధక గురువులుగా వ్యవహరించబడతారు.
  2. వైదిక గురువులు : వేదార్ధంతో భగవంతుని వైపు దృష్టి మరల్చేవారు. అనగా వేదాలలోని వేదాంత భావములను వివరించువారు.
  3. ప్రసిద్ధ దేశికులు: ఫతిఫలాన్ని ఆశించకుండా ఆధ్యాత్మిక బోధనలు చేసే వారు.
  4. కామ్యక గురువులు: పుణ్యకార్యాల ద్వారా పుణ్యసంపాదన చేయించేవారు. పాప పుణ్య క్రియల వల్ల సంభవించే పాపపుణ్య ఫలితాల గూర్చి చెప్పేవారు.
  5. వాచక గురువు : యోగాతత్వాన్ని బోధించి ఆత్మతత్వాన్ని అనుభవింప చేసేవారు. అన్ని అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువాడు.
  6. సూచక గురువు : శమాది షట్కసంపత్తిని బోధించి ఇంద్రియ నిగ్రహం కలిగించే వారు. ఏకాగ్రతతో చూపు నిలిపి, కన్నులలో దర్శించే, విశ్వములోని కళలన్నీ ఏవిధంగా సాధమవుతాయో తెలిపే గురువులు.
  7. కారణ గురువు : జీవబ్రహ్మలకు ఐక్యతను బోధించేవారు. ఇహలోక, సంపద సుఖాలపై, మోహమును పోగొట్టి ముక్తి అనే సంపదను కైవసం చేగించగల గురువు.
  8. విహిత గురువు : సందేహాలను తీర్చి చిత్తశుద్ధి కలిగించి, ఆత్మయే సత్యమని దృఢమైన బోధ చేసేవారు. అంతు చిక్కని, అని నిగూఢమైన, సృష్టి తత్వాన్నిబోధించి విశ్వరూపుని దర్శింగు మార్గమును చూపించే గురువు. ఇతనిని విహితోపదేష్ట గురువు అనికూడా అంటారు.

మూలాలు

[మార్చు]
  1. Unknown. "అష్ట విధ గురువులు - వారి లక్షణములు". Retrieved 2020-08-24.