Jump to content

ఆండిలే ఫెహ్లుక్వాయో

వికీపీడియా నుండి
ఆండిలే ఫెహ్లుక్వాయో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండిలే లకీ ఫెహ్లుక్వాయో
పుట్టిన తేదీ (1996-03-03) 1996 మార్చి 3 (వయసు 28)
డర్బన్, క్వాజులు నాటల్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
బంధువులుOkuhle Cele (cousin)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 333)2017 సెప్టెంబరు 28 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2018 జనవరి 24 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 118)2016 సెప్టెంబరు 25 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2022 అక్టోబరు 11 - ఇండియా తో
తొలి T20I (క్యాప్ 68)2017 జనవరి 20 - శ్రీలంక తో
చివరి T20I2022 జూలై 31 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013/14–2018/19క్వాజులు-నాటల్
2014/15–2020/21డాల్ఫిన్స్
2018కేప్‌టౌన్ బ్లిట్జ్
2019/20డర్బన్ హీట్
2021/22–presentక్వాజులు-నాటల్ Coastal
2023పార్ల్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 4 76 38 50
చేసిన పరుగులు 19 781 149 1,409
బ్యాటింగు సగటు 9.50 24.40 9.93 23.88
100లు/50లు 0/0 0/2 0/0 1/7
అత్యుత్తమ స్కోరు 9 69* 27* 107
వేసిన బంతులు 250 2,947 670 3,992
వికెట్లు 11 89 45 63
బౌలింగు సగటు 13.36 31.88 21.57 37.96
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/13 4/22 4/24 5/62
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 17/– 7/– 21/–
మూలం: ESPNcricinfo, 17 September 2023

ఆండిలే లక్కీ ఫెహ్లుక్వాయో (జననం 1996 మార్చి 3) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు.[1] అతను ఎడమచేతి వాటం దిగువ వరుస బ్యాటరు, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు. 2016 సెప్టెంబరులో దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించాడు.[2]

జీవితం తొలి దశలో

[మార్చు]

ఆండిలే, ఫీల్డ్ హాకీలో డర్బన్‌లోని గ్లెన్‌వుడ్ హై స్కూల్‌కు బర్సరీని గెలుచుకున్నాడు. తన సంరక్షకురాలు రోజ్‌మేరీ డిస్మోర్ అతనికి క్రికెట్‌ను పరిచయం చేసింది. ఆండిలే తల్లి ఆమె ఇంటిలో పనిమనిషిగా చేసేది. [3]

ప్రారంభ దేశీయ కెరీర్

[మార్చు]

2014 జనవరిలో ఆండిలే, 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మందితో కూడిన దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [4]

2015 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ క్రికెట్ జట్టు లోకి ఆండిలేను తీసుకున్నారు.[5]

2017 ఆగస్టులో, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం జో'బర్గ్ జెయింట్స్ జట్టులో ఆండిలే ఎంపికయ్యాడు. [6] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ సౌత్‌ ఆఫ్రికా, ఆ టోర్నమెంటును 2018 నవంబరు కు వాయిదా వేసి, ఆ వెంటనే రద్దు చేసింది.[7]

2018 సెప్టెంబరులో ఆండిలే, 2018 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ జట్టుకు ఎంపికయ్యాడు. [8] అతను టోర్నమెంటు నాలుగు మ్యాచ్‌లలో పది వికెట్లు తీసుకుని, క్వాజులు-నాటల్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచాడు. [9]

2018 అక్టోబరులో, ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషనులో కేప్ టౌన్ బ్లిట్జ్ జట్టుకు ఆండిలే ఎంపికయ్యాడు. [10] [11] ఎంజాన్సీ సూపర్ లీగ్ 2019 కోసం డర్బన్ హీట్ జట్టులో చేరాడు.[12] 2021 ఏప్రిల్లో, అతన్ని దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు క్వాజులు-నాటల్ జట్టులోకి తీసుకున్నారు.[13]

2022 మార్చి 27న, 2021–22 CSA వన్-డే కప్‌లో డివిజన్ వన్‌లో ఆండిలే, 100 నాటౌట్‌తో లిస్టు A క్రికెట్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు. [14]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2016 సెప్టెంబరులో, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ జట్టుకు ఆండిలే ఎంపికయ్యాడు. [15] 2016 సెప్టెంబరు 25న ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా తరపున తన వన్‌డే రంగప్రవేశం చేసాడు.[16] 2017 జనవరిలో, అతను శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో చేరాడు.[17] 2017 జనవరి 20న శ్రీలంకపై దక్షిణాఫ్రికా తరపున తన T20I రంగప్రవేశం చేసాడు.[18]

2017 జూన్లో ఆండిలే, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఎంపికయ్యాడు గానీ ఆడలేదు.[19] 2017 సెప్టెంబరులో, బంగ్లాదేశ్‌తో జరిగిన వారి సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [20] అతను 2017 సెప్టెంబరు 28న బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ప్రవేశించాడు.[21]

2019 ఏప్రిల్లో ఆండిలే, 2019 క్రికెట్ ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా 15 మంది వ్యక్తుల జట్టులో ఎంపికయ్యాడు.[22][23] 2019 జూన్ 23న, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఆండిలే తన 50వ వన్‌డే ఆడాడు.[24] ప్రపంచ కప్ తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆండిలేను జట్టులో రైజింగ్ స్టార్‌గా పేర్కొంది.[25]

2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లలో ఆండిలే ఒకడిగా ఎంపికయ్యాడు. [26]

మూలాలు

[మార్చు]
  1. "Andile Phehlukwayo". ESPN Cricinfo. Retrieved 27 June 2015.
  2. "Andile Phehlukwayo profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 26 July 2021.
  3. రౌండరు-andile-phehlukwayo "Go in with a game plan". Red Bulletin Magazine. Retrieved 26 February 2017. {{cite web}}: Check |url= value (help)
  4. "All 16 squads for the ICC U19 Cricket World Cup UAE 2014 confirmed". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 26 July 2021.
  5. క్వాజులు-నాటల్ Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  6. "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
  7. "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
  8. "క్వాజులు-నాటల్ Squad". ESPN Cricinfo. Retrieved 12 September 2018.
  9. "Africa T20 Cup, 2018/19 - క్వాజులు-నాటల్: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 16 September 2018.
  10. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  11. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  12. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
  13. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
  14. "Another century for Klaasen as Titans take the lead in One Day Cup". Citizen. Retrieved 30 March 2022.[permanent dead link]
  15. "South Africa pick Phehlukwayo for Australia ODIs". ESPNcricinfo. ESPN Sports Media. 6 September 2016. Retrieved 6 September 2016.
  16. "Ireland tour of South Africa, Only ODI: South Africa v Ireland at Benoni, Sep 25, 2016". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
  17. "Behardien to lead in T20 as SA ring changes". ESPN Cricinfo. Retrieved 9 January 2017.
  18. "Sri Lanka tour of South Africa, 1st T20I: South Africa v Sri Lanka at Centurion, Jan 20, 2017". ESPN Cricinfo. Retrieved 20 January 2017.
  19. "Kuhn, Phehlukwayo in South Africa's Test squad". ESPN Cricinfo. Retrieved 26 June 2017.
  20. "Markram set for Test debut against Bangladesh". ESPN Cricinfo. Retrieved 22 September 2017.
  21. "1st Test, Bangladesh tour of South Africa at Potchefstroom, Sep 28-Oct 2 2017". ESPN Cricinfo. Retrieved 28 September 2017.
  22. "Hashim Amla in World Cup squad; Reeza Hendricks, Chris Morris miss out". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
  23. "Amla edges out Hendricks to make South Africa's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
  24. "ICC Cricket World Cup 2019 (Match 30): Pakistan vs South Africa – Stats Preview". Cricket Addictor. Retrieved 23 June 2019.
  25. "CWC19 report card: South Africa". International Cricket Council. Retrieved 9 July 2019.
  26. "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.