Jump to content

ఆడియో పుస్తకం

వికీపీడియా నుండి

ఆడియో పుస్తకం అనగా ఎవరో ఒకరి చేత పుస్తకాన్ని బిగ్గరగా చదివించి దానిని మళ్ళీ మళ్ళీ వినుటకు ఆడియో రూపంలో భద్రపరచిన పుస్తకం. ఈ రోజుల్లో ఇవి సాధారణంగా కాంపాక్ట్ డిస్క్‌ల (CDలు) లో భద్రపరుస్తున్నారు, అయితే కొన్ని పాత సంచికలు కేసెట్ టేపులపై భద్రపరచబడివున్నాయి. ఇటీవల, ఆడియో పుస్తకాలు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ కొరకు అందుబాటులో ఉన్నాయి (ఉచిత లేదా చెల్లింపు పద్ధతిలో), ప్రత్యేక ఎంపీ3 ప్లేయర్ లందు ముందే రికార్డు చేయబడివుంటున్నాయి. ఆడియో పుస్తకాలు ఎవరైనా ఉపయోగించవచ్చు, అయితే చూపులేని లేదా చూపుసరిగా లేని వారి కొరకు ఇవి ఒక ప్రధాన వనరుగా ఉపయోగపడుతున్నాయి. అనేక ప్రముఖ పుస్తకాలను తరచూగా ఆడియో పుస్తకములుగా రూపొందించుటకు ఎంపిక చేస్తున్నారు. పుస్తక అసలు రచయిత అయినను లేదా కాకపోయినను చదువుట కొరకు పాఠకుడిని ఎంపిక చేసి ఆడియో పుస్తకమును రూపొందించవచ్చు. కొంతమంది రచయితలు తరచుగా అనేక ఆడియో పుస్తకాల కొరకు అదే పాఠకుడిని ఉపయోగించుకుంటారు, అందువలన వారి ఆడియో పుస్తకముల శబ్దం లేదా/, శైలి ఒకేరీతిగా ఉంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]