ఉంగరపు వేలు
ఉంగరపు వేలు | |
---|---|
వివరములు | |
లాటిన్ | డిజిటస్ IV మానస్, డిజిటస్ క్వార్టస్ మానస్, డిజిటస్ యాన్యులారిస్ మానస్, డిజిటస్ మెడిసినాలిస్ |
అరచేతి లోని వేళ్ళ ధమనులు, అరచేతి వెనుక ఉన్న వేళ్ళ ధమనులు | |
అరచేతి లోని వేళ్ళ సిరలు, అరచేతికి వెనుక ఉన్న వేళ్ళ సిరలు | |
Dorsal digital nerves of radial nerve, Dorsal digital nerves of ulnar nerve, Proper palmar digital nerves of median nerve | |
Identifiers | |
TA | A01.1.00.056 |
FMA | 24948 |
Anatomical terminology |
ఉంగరపు వేలు, మనిషి చేతి మధ్య వేలికీ, చిటికెన వేలికీ మధ్య ఉన్న వేలు. చేతివేళ్ళలో ఇది నాలుగవది.[1]
సాధారణంగా ఉంగరం ధరించే వేలు కాబట్టి దీన్ని ఉంగరపు వేలు అంటారు. సాంప్రదాయికంగా వివాహ సందర్భంగా ఉంగరాలను ధరించే చాలా సమాజాల్లో ఉంగరాన్ని ఈ వేలికే పెట్టుకుంటారు. సాంప్రదాయకంగా, వివాహ ఉంగరాన్ని వధువు మాత్రమే ధరిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పురుషులు కూడా వివాహ ఉంగరాన్ని ధరిస్తున్నారు. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఉంగరపు వేలుకు ధరించడం కూడా కొన్ని సమాజాలలో ఆచారం.
శరీర నిర్మాణ శాస్త్రంలో, ఉంగరపు వేలును డిజిటస్ మెడిసినాలిస్, నాల్గవ వేలు, డిజిటస్ యాన్యులారిస్, డిజిటస్ క్వార్టస్ లేదా డిజిటస్ IV అని పిలుస్తారు. లాటిన్లో, యాన్యులస్ అనే పదానికి "రింగు" అని, డిజిటస్ అంటే "అంకె" అనీ, క్వార్టస్ అంటే "నాల్గవది" అనీ అర్థాలు.
పేరులేని వేలు
[మార్చు]ఉంగరపు వేలును సంస్కృతంలో "అనామిక" అనీ, ఫిన్నిష్ భాషలో "నిమెటాన్" అనీ, రష్యన్‌లో "బెజిమియాని" అనీ అంటారు. వీటన్నిటికీ అర్థం "పేరులేని" అని.
పేరులేని ఉంగరపు వేలుకు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రాచీన కవుల్లో గొప్ప కవుల్ని లెక్కించుదామని మొదలు పెట్టి, చిటికెన వేలెత్తి ‘కాళిదాసు’ అన్నారు. తర్వాతి కవిని ఎంచడానికి, చిటికినవేలు కంటే పెద్దదైన ఉంగరం వేలిని ఎత్తి, కాళిదాసును మించిన కవి కనిపించక లెక్కపెట్టేవారు అక్కడే ఆగిపోయారు. ఆ కారణం వలన ఉంగరపు వేలికి అనామిక (పేరులేనిది) అనే పేరు సార్థకమైపోయింది.[2]
పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా
అద్యాపి తత్తుల్యకవే రభావాదనామికా సార్ధవతీ బభూవా
అరబిక్, హీబ్రూ వంటి సెమిటిక్ భాషలలో, ఉంగరపు వేలును బాన్సుర్ (అంటే "విజయం") అనీ, కిమిట్సా (అంటే "చేతి నిండుగా తీసుకోవడం") అనీ అంటారు.
చరిత్ర
[మార్చు]రక్తప్రసరణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వైద్య శాస్త్రం కనిపెట్టడానికి ముందు, ఒక సిర నేరుగా ఎడమ చేతి నాల్గవ వేలి నుండి గుండెకు వెళ్తుందని అనుకునేవారు.[3] ఈ చేతి-గుండె లింకు కారణంగా వారు, ఈ సిరను ప్రేమ సిర అని అన్నారు. దీని లాటిన్‌లో దీని పేరు వీనా అమోరిస్ అయింది.[4]
ఈ పేరు ఆధారంగా, ఆనాటి ప్రజలు వివాహ రంగంలో నిపుణులుగా భావించేవారు, వివాహ ఉంగరాన్ని ఈ వేలికి ధరించాలని రాశారు. ఎడమ చేతి నాల్గవ వేలికి ఉంగరాన్ని ధరించడం ద్వారా, వివాహిత జంట ఒకరిపట్ల మరొకరి శాశ్వతమైన ప్రేమను ప్రతీకాత్మకంగా ప్రకటిస్తారు.[5]
బ్రిటన్‌లో, ప్రపంచ యుద్ధాల తర్వాత, వివాహిత మగ సైనికులు తమ భార్యను గుర్తుచేసుకోవడానికి ఉంగరాలు ధరించడం ప్రారంభించే వరకు మహిళలు మాత్రమే వివాహ ఉంగరాన్ని ధరించేవారు.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Synonyms of annulary | Thesaurus.com". www.thesaurus.com (in ఇంగ్లీష్). Retrieved 17 August 2022.
- ↑ "కవికులగురువు". ఈమాట (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-05-01. Archived from the original on 2020-04-20. Retrieved 2024-09-21.
- ↑ Kunz, George Frederick (1917). Rings for the finger: from the earliest known times, to the present, with full descriptions of the origin, early making, materials, the archaeology, history, for affection, for love, for engagement, for wedding, commemorative, mourning, etc. J. B. Lippincott company. pp. 193–194.
- ↑ Mukherji, Subha (2006), Law and Representation in Early Modern Drama, Cambridge University Press, pp. 35–36, ISBN 0521850355
- ↑ "Ruby And The Wolf". Retrieved 22 July 2023.
- ↑ "Wedding rings: Have men always worn them?". BBC. 8 April 2011.
World War II is considered to have heralded a seismic shift, as many Western men fighting overseas chose to wear wedding rings as a comforting reminder of their wives and families back home.