Jump to content

ఎలగందల్ కోట

వికీపీడియా నుండి
ఎలగందల్ కోట
కరీంనగర్, తెలంగాణ
ఎలగందల్ కోటలోని మినార్లు
ఎలగందల్ కోట is located in Telangana
ఎలగందల్ కోట
ఎలగందల్ కోట
భౌగోళిక స్థితి18°25′15″N 79°02′33″E / 18.420751°N 79.042601°E / 18.420751; 79.042601
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
వాడిన వస్తువులురాతి

ఎలగందల్ కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఎలగందల్ గ్రామంలో ఉంది.[1] కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఉన్న ఈ కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశము, మొఘల్ సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది. నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్ - దౌలా చేత నిర్మించబడింది.

ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఉఉగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

కరీంనగర్-వేములవాడ రహదారిలో ఎలగందల్ కోట నుండి మానకొండూరు వరకు 9 కిలోమీటర్లు మేర రహస్య సొరంగం ఉందని నమ్ముతారు.[2]

చరిత్ర

[మార్చు]

ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు. యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ లు దీనిని దృఢంగా చేశారు. 16 వ శతాబ్దంలో కుతుబ్ షాహి వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకొని, క్యుయినముల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు. తదనంతరం, మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్లింది. హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ నిజాం అసఫ్జాహ్ I (1724-1748), ముగర్రాబ్ ఖాన్ హయాంలలో, అమిన్ ఖాన్ ఎలగందల్ కు ఖిలేదార్ గా నియమించబడ్డాడు. నవాబ్ సలాబత్ జంగ్ హయాంలో మిర్జా ఇబ్రహీం దంసా ఖిలేదార్ అయ్యాడు. సికందర్ ఝా (1803-1823) హయాంలో 1754 లో దంసా ఈ కోటను పునర్నిర్మాణం చేశాడు. బహదూర్ ఖాన్, కరీముద్దీన్ లు తరువాతికాలంలో ఖిలేదార్లుగా పనిచేశారు. కరీముద్దీన్ పేరుమీద కరీంనగర్ గా మారింది. 1905 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా, ఆరవ నిజాం మహాబుబ్ ఆలీ ఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందల్ నుండి కరీంనగర్ కి మార్చారు.

శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు (16 అడుగులు) వెడల్పు, 4 మీటర్లు (13 అడుగులు) లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారు.[2]

ఈద్ ప్రార్థనల కొరకు ప్రత్యేక మసీదును కూడా ఈ కోటలో నిర్మించారు.

గుర్తించదగిన సైట్లు

[మార్చు]

ఎలగందల్ గ్రామం కరీంనగర్ నుండి 15 కిమీ దూరంలో ఉంది. ఇది ఒక చారిత్రక ప్రదేశం.

  • కొండ మీదవున్న కోటను ఎలగందల్ కోట అంటారు.
  • 1754 లో జఫర్-ఉద్-దౌలా కోట యొక్క తూర్పు ద్వారం దగ్గర బృందావన్ ట్యాంక్ ను నిర్మించాడు.
  • దో మీనార్. దో మీనార్ ను ముస్లిం మతం రాజులు (నిజాములు) చే నిర్మించారు. ఇది చార్మినార్ స్తంభాల ఎత్తున్న రెండు పొడవైన స్తంభాలతో ఉంటుంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ (25 January 2017). "పర్యాటక శోభితం." Archived from the original on 2018-07-16. Retrieved 17 July 2018.
  2. 2.0 2.1 ది హిందూ (November 18, 2010). "Wild bears make Elgandal Fort their home". Retrieved 16 October 2016.