ఏంజెల్ (2017 సినిమా)
Appearance
ఏంజెల్ | |
---|---|
దర్శకత్వం | పలాణి |
నిర్మాత | భువన్ సాగర్ |
తారాగణం | నాగ అన్వేష్ హెబ్బా పటేల్ |
ఛాయాగ్రహణం | గుణశేఖరణ్ |
సంగీతం | భీమస్ సెసిరోలె |
నిర్మాణ సంస్థ | సరస్వతి ఫిలింస్ |
విడుదల తేదీ | 3 నవంబరు 2017 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
ఏంజెల్ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, పలాణి దర్శకత్వం వహించాడు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సుమన్, సప్తగిరి, కబీర్ దుహాన్ సింగ్, సాయాజీ షిండే,ప్రదీప్ రావత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గుణశేఖరణ్ ఛాయాగ్రాహణం అందించగా, భీమస్ సెసిరోలె సంగీతాన్ని సమకూర్చాడు.
2017 నవంబర్ 3న విడుదలయ్యింది. తమిళ్ లో విన్నైతాంది వంద ఏంజెల్ పేరుతో అనువదించి విడుదల చేశారు. 2018లో హిందీలోకి అనువదించి విడుదల చేశారు.[1]
తారాగణం
[మార్చు]- నాగ అన్వేష్ (నాని)
- హెబ్బా పటేల్ (ఇంద్ర కుమార్తె/ నక్షత్రం)
- సుమన్ ఇంద్రుడు
- సప్తగిరి (గిరి)
- కబీర్ సింగ్ దుహా (గరుడ)
- సాయాజీ షిండే
- ప్రదీప్ రావత్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి భీమస్ సెసిరోలె సంగీతాన్ని సమకూర్చాడు.[2]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "చిన్న చిన్న కళ్ళే" | సునిధి చౌహాన్, షాహిద్ మాల్య | 04:34 |
2. | "అమరావతి" | నకాష్ అజీజ్ | 04:09 |
3. | "ఏంజెల్" | భీమస్ సెసిరోలె, కోరస్ | 01:14 |
క్రమసంఖ్య | పేరు | నిడివి |
---|---|---|
1. | "అమరావతి" | 04:09 |
2. | "ఏంజెల్" | 00:54 |
మూలాలు
[మార్చు]- ↑ AD-WISE MEDIA ACTION MOVIEPLEX (2018-12-09), ANGEL (2018) New Released Full Hindi Dubbed Movie | Naga Anvesh, Hebah Patel | South Movie 2018, retrieved 16 October 2019
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-10-16. Retrieved 2019-10-16.