ఓషో
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భగవాన్ శ్రీ రజినీష్ | |
---|---|
బాల్య నామం | చంద్ర మోహన్ జైన్ |
జననం | 11 డిసెంబర్ 1931 కుచ్వాడ, భోపాల్ రాష్ట్రం, బ్రిటీష్ రాజ్ (ఇప్పుడు మధ్యప్రదేశ్, భారతదేశం) |
మరణం | 19 జనవరి 1990 (aged 58) పుణె, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
రంగం | ఆధ్యాత్మికత |
శిక్షణ | డా. హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం |
ఉద్యమం | జీవన్ జాగృతి ఆందోళన్ (నియో-సన్న్యాస్) |
చేసిన పనులు | 600 పుస్తకాలు, అనేక వేల ఆడియో, వీడియో ప్రసంగాలు |
రజినీష్ చంద్రమోహన్ జైన్ (డిసెంబరు 11, 1931 - జనవరి 19, 1990). 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో 11.12.1931న జన్మించాడు.19.1.1990 న మరణించాడు.
ఓషో బోధన
[మార్చు]జీవితానికి సంబంధించిన గొప్ప విలువలు ఎఱుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని అతను బోధించాడు. జ్ఞానోదయం (ఎన్‌లైటెన్‌మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి, కానీ అది తెలుసుకోలేకపోతున్నారు - మనషి ఆలోచనా విధానం ముఖ్య కారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని అతను అన్నాడు.
హిందీ, ఆంగ్లభాషలలో అతను అనర్గళంగా ప్రవచించాడు. బుద్ధుడు, కృష్ణుడు, గురు నానక్, ఏసుక్రీస్తు, సోక్రటీసు, జెన్ గురువులు, గురుజెఫ్, యోగ సంప్రదాయాలు, సూఫీ, హస్సిడిజమ్, తంత్ర వంటి బోధనలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎన్నింటిలోనో అతను ఆరితేరిన దిట్ట. ఏ తత్వమూ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేదు అనే నమ్మకాన్ని కలిగి, ఏ "ఆలోచనా పద్ధతి"లో కూడా తనను ఎవరూ నిర్వచించలేరని అతను ప్రకటించాడు.
అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు అతను్ని "సెక్స్ గురువు" అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని Sex to Superconsciousness అనే ఆంగ్ల పుస్తకంగా ప్రచురించారు, ఈ పుస్తకం సంబోగం నుండి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో అనువదించబడింది. అతను చెప్పినది, "తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే" సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్యసహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని.
"ప్రేమ ఓ ప్రదేశం. స్వేచ్చగా మనస్పూర్తిగా అనుభవించు. జీవితంలో ఏ రహస్యం ఉండదు. దాచిపెట్టడమే ఉంటుంది. సెక్స్ వల్లనే మనం పుడతాము. అన్ కాన్షస్ నుండి సెక్స్ సూపర్ కాన్షస్ కు తీసుకు వెళుతుంది. సెక్స్ తోనే ముక్తి.జీవితం పక్షి.ప్రేమ,స్వేచ్చ రెండు రెక్కలు.అందరూ మనల్ని వదిలివేయటం ఒంటరితనం.అందర్నీ మనం వదిలి వేయటం ఏకాంతం"
చెప్పుకోదగ్గవి
[మార్చు]ప్రతి ఏటా 2,00,000 మంది పర్యాటకులతో, పూణే పట్టణములోని ఓషో అంతర్జాతీయ ధ్యాన విహారము (Osho International Meditation Resort) ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక ఆరామాలలో ఒకటి.
నేడు 50 భాషలలో అనువాదం చెయ్యబడి ఓషో పుస్తకాలు మున్నెన్నడు లేనంతగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అతను వ్యాఖ్యానాలు, పలుకులు గొప్ప వార్తాపత్రిక లెన్నింటిలోనో మనకు కనిపిస్తాయి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవలాకారుడు, విలేఖరి కుష్వంత్ సింగ్, సినిమా నటుడు, రాజకీయనాయకుడు వినోద్ ఖన్నా, అమెరికా కవి రూమీ, అనువాదకుడు కోల్‌మన్ బార్క్స్, అమెరికా నవలాకారుడు టామ్ రాబిన్స్.
కొత్త ఢిల్లీ లోని భారత పార్లమెంటు గ్రంథాలయంలో కేవలం ఇద్దరు ప్రముఖుల పూర్తి జీవితకాల రచనలను మాత్రమే పొందుపరిచారు, ఒకరు ఓషో కాగా మరొకరు మహాత్మా గాంధీ.