అక్షాంశ రేఖాంశాలు: 15°35′24.000″N 80°12′54.000″E / 15.59000000°N 80.21500000°E / 15.59000000; 80.21500000

కనపర్తి (నాగులుప్పలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనపర్తి (నాగులుప్పలపాడు)
పటం
కనపర్తి (నాగులుప్పలపాడు) is located in ఆంధ్రప్రదేశ్
కనపర్తి (నాగులుప్పలపాడు)
కనపర్తి (నాగులుప్పలపాడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°35′24.000″N 80°12′54.000″E / 15.59000000°N 80.21500000°E / 15.59000000; 80.21500000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంనాగులుప్పలపాడు
విస్తీర్ణం42.93 కి.మీ2 (16.58 చ. మై)
జనాభా
 (2011)[1]
5,927
 • జనసాంద్రత140/కి.మీ2 (360/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,023
 • స్త్రీలు2,904
 • లింగ నిష్పత్తి961
 • నివాసాలు1,612
ప్రాంతపు కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523180
2011 జనగణన కోడ్591048


ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్థూపాలున్న ముఖ్య క్షేత్రాలలో కనుపర్తి ఒకటి

కనుపర్తి ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగులుప్పలపాడు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1612 ఇళ్లతో, 5927 జనాభాతో 4293 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3023, ఆడవారి సంఖ్య 2904. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 787 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 127. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591048[2].కనపర్తి గ్రామం ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఈ గ్రామం కనకాపురి, కనకభంజనపురి, కనకాంబుజపురి. అను పేర్లతో చారిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందినది.

సమీప గ్రామాలు

[మార్చు]

తిమ్మసముద్రం 4 కి.మీ, దేవరంపాడు 5 కి.మీ, చేజర్ల 6 కి.మీ, రాపర్ల 7 కి.మీ. పెదగంజాం 7 కి.మీ. అమ్మనబ్రోలు 9.2 కి.మీ.

గ్రామ చరిత్ర

[మార్చు]

బ్రహ్మకుండి అని పిలువబడే గుండ్లకమ్మ నది, అనంతసాగరంలో కలగలసిపోయే ప్రాంతంలో వెలసిన ప్రదేశమే కనపర్తి. ఈ గ్రామం రెండవ శతాబ్దం నుండి బౌద్ధ నివాస కేంద్రం. శాతవాహన పాలకులు పరిపాలించిన, పవిత్ర పుణ్యక్షేత్రంగా అలరారిన కనపర్తిలో ఈనాటికీ అనేక బౌద్ధస్తూపాలు, శిల్పాలు దర్శనం ఇస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో వెలసిన కనపర్తి క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకూ విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఈ గ్రామ సమీపంలోనుండి ప్రవహించుచున్న బకింగ్ హాం కాలువద్వారా ఆంగ్లేయుల కాలంలో, విజయవాడ నుండి చెన్నై వరకు, నావల (జలమార్గం) ద్వారా సరకు రవాణా నిత్యం జరిగేది. మార్గమధ్యంలో విడిదికోసం కనపర్తిలో అతిధులకోసం, బంగళాను గూడా ఏర్పాటు చేసారు. అప్పట్లోనే ప్రత్యేకంగా రంగూను నుండి టేకును తెప్పించి, మరుగుదొడ్డి, ప్రత్యేక పాన్ ల వంటివి ఏర్పాటుచేసి మరీ బంగళాను నిర్మించారు. చెన్నై నుండి సరిగ్గా 191వ మైలు వద్ద ఈ బంగళాను నిర్మించారు. (ఈ 191వ మైలురాయి ఇప్పటికీ ఇక్కడ దర్శనమిచ్చుచూ సందర్శకులను ఆకట్టుకొనుట విశేషం). ఈ బంగళాలో గతంలో బ్రిటిష్ రణి విడిది చేసినట్లుగా స్థానికులు చెబుతుంటారు. అప్పటి నుండి ఈ బంగళాకు "బకింగ్ హాం బంగళా"గా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ బంగళా శిథిలావస్థలో ఉంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు:- కనపర్తి, తోపుపాలెం, దాసరివారిపాలెం, పల్లెపాలెం, యానాదికాలనీ, చిన్నంగారి పట్టపుపాలెం, ఎం.ఎస్.పట్టపుపాలెం, కుక్కలవారిపాలెం.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చాట్ల నారాయణ, సర్పంచిగా ఎన్నికైనారు.[3]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి అమ్మనబ్రోలులో ఉంది.సమీప జూనియర్ కళాశాల అమ్మనబ్రోలులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మద్దిరాలపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల చేకూరుపాడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కనుపర్తిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురుఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

బావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కనుపర్తిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటో సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

రోడ్డు మార్గం

[మార్చు]

ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనున్న కనపర్తికి చేరుకోవాలంటే ఒంగోలు డిపోనుంచి ఉదయం 5 గంటలనుంచే ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. సముద్ర తీరానికి చేరుకోవాలంటే అక్కడి మ్యూజియం నిర్వాహకులే వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు వాహనాలలో కూడా కనపర్తి సముద్ర తీరానికి చేరుకోవచ్చు.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కనుపర్తిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1343 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 337 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2612 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2190 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 421 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కనుపర్తిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 129 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 292 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కనుపర్తిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, వేరుశనగ, శనగ

సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

కనుపర్తి ఎత్తిపోతల పథకం:- ఈ పథకం ద్వారా, మొదట 6,000 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ గత 23 సంవత్సరలుగా, ఈ పథకం క్రింద 4,500 ఎకరాలు మాత్రమే సాగుచేసుకుంటున్నారు. మిగిలిన 1500 ఎకరాలకు, సాగునీరందక మెట్టభూములుగానే మిగిలిపోయినవి. ప్రస్తుతం ఈ పథకం క్రింద సాగవుచున్న 4,500 ఎకరాలభూమిని మాత్రమే గుండ్లకమ్మ జలాశయానికి అనుసంధానం చేసారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

పురావస్తు ప్రదర్శనశాల

[మార్చు]

కనపర్తి గ్రామంలో పురావస్తు శాఖ అధ్వర్యంలో ఒక మ్యూజియం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అయిన టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ఈ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో వినాయక, కుమారస్వామి, నారాయణ, బ్రాహ్మణి. సూర్య, పరశురామ, వర్షిణి, విగ్రహాలతోపాటు వివిధ పరిమాణాల, ఆకారాల శివలింగాలు ఉన్నాయి. కనపర్తి పురావస్తు ప్రదర్శనశాలలో అందరినీ కనువిందు చేసే వాటిల్లో ముఖ్యమైనది బ్రహ్మపాశంగల ధారాలింగం. దీనిపై పాలుపోస్తే శివలింగం చుట్టూ 32 ధారలుగా పాలు కిందకు కారే విధంగా ప్రత్యేకంగా చెక్కబడి ఉంటుంది. దీంతో ఈ శివలింగం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.[4] పూర్వకాలంలో కనాపురి పట్టణంలో వాడిన రాతి గొడ్డళ్లు, ఇటుకలు, అలంకరణ సామగ్రి, పూసలు.. తదితర వస్తువులు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డాయి. అలాగే అనేక బావులు, వాటి నిర్మాణానికి వినియోగించిన పెద్ద పెద్ద ఇటుకలు, బ్రహ్మలిపిలో ఉండే బౌద్ధ స్తూపాలు, ప్రాకృత భాషలో గల విజయనగర రాజు కృష్ణదేవరాయులవారి శాసనాలు, ద్రావిడ భాషల్లో గల తూర్పు చాళుక్యుల, చోళుల శాసనాలను మనం అక్కడ చూడవచ్చు. మ్యూజియంలో ఎల్లప్పుడూ గైడ్‌ అందుబాటులో ఉంటారు. ఇక కనపర్తి గ్రామంలోని శైవ, వైష్ణవ ఆలయాలు ఆనాటి ప్రజల జీవన చిత్రాన్ని కళ్లకు కట్టేటట్లుగా ఉన్నాయి.

చారిత్రిక సంపద

[మార్చు]

ఈ గ్రామంలోని పోలేరమ్మ ఆలయ సమీపంలో ఇంటిమెరకకోసం రైతు శ్రీ పోతినేని సోమయ్య, తన స్వంత పొలంలో మొరక సరిచేస్తుండగా ఒక మట్టికుండ బయల్పడినది. ఆ మట్టికుండలో 14 బుద్ధుడి విగ్రహాలతోపాటు, ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు, ఎగిరే భంగిమలోని గంధర్వుడి పంచలోహ విగ్రహాలు లభ్యమైనవి. పూజాదికాలకు వినియోగించే గంటలు, మూకుడు, ధూపం వేసే వస్తువులు దొరికినవి. మరో రెండు స్థూపాలు గూడా లభ్యమైనవి. ఇవి 5వ శతాబ్దానికి చెందినవిగా భావించుచున్నారు.

కనపర్తి బీచ్‌

[మార్చు]

పురావస్తు ప్రదర్శన శాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కనపర్తి సముద్ర తీరం సౌందర్యం వర్ణనాతీతం. సాధారణంగా సముద్ర తీరానికి వెళ్లిన వారికి దూరంగా మాత్రమే ఒంపు కన్పిస్తుంది. ఒంపు వద్దకు వెళ్లాలని ప్రయత్నిస్తే, మరికొంచెం దూరంలో కన్పిస్తుంది. అయితే కనపర్తి తీరంలో మాత్రం ఒయ్యారాలు ఒలకబోస్తున్నట్లుండే సముద్ర తీరపు ఒంపుసొంపులను దగ్గర్నించే చూడవచ్చు. సెలవు దినాల్ని ఆహ్లాదకరంగా గడపాలనుకునేవారు ముఖ్యంగా పార్క్‌లకు బీచ్‌లకు వెళ్లడం చేస్తుంటారు. అయితే... ఆ బీచ్‌లకు దగ్గరే గుళ్లూ, గోపురాలు, చారిత్రక స్థలాలు కూడా ఎలా ఉంటే ఎలావుంటుంది? ప్రకృతి ఆహ్లాదంతో పాటు... ఆధ్యాత్మిక అనుభూతి, చారిత్రక విజ్ఞానం కూడా మీ సొంతమవుతుంది. అలాంటి అరుదైన బీచ్‌... ఈ కనపర్తి బీచ్‌.

దేవాలయాలు

[మార్చు]

ఇక్కడ చాళుక్య రాజులకాలంనాటి ఒక రామాలయం, పదవ శతాబ్దంనాటి ఏలేశ్వరస్వామి ఆలయం అనే శివాలయం శిథిలావస్థలో ఉన్నాయి.[5]

కనపర్తి సముద్రతీరంలోని పట్టపుపాలెంలో, 2017,మార్చి-7వతేదీ మంగళవారంనాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవం కన్నులపండువగా సాగినది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ రథోత్సవంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించిపోయినారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గామానికి చెందిన శ్రీమతి ఊర విజయలక్ష్మి, తన సృజనాత్మకతను విభిన్నరీతిలో చాటుకున్నారు. ఈమె వంట ఇంటి ఆహార పదార్ధాలతో, "క్రికెట్టు మైదానం, ప్రపంచ కప్పు" నమూనాలను తయారుచేసి ఆకట్టుకున్నారు. క్యారట్టుతో క్రికెట్టు బాటు, బంతి, పాలకూర అన్నంతో మైదానం, బంగాళదుంపలతో వికెట్లు, క్యారట్టు, ఉల్లి, నిమ్మతో ప్రపంచ కప్పు నమూనాను తయారుచేసి, శభాష్ అనిపింఛుకున్నారు. [6]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,219. ఇందులో పురుషుల సంఖ్య 3,132, మహిళల సంఖ్య 3,087, గ్రామంలో నివాస గృహాలు 1,433 ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-2; 1వపేజీ.
  4. http://www.suryaa.com/features/article.asp?subcategory=4&contentId=149027[permanent dead link]
  5. ది హిందూ దినపత్రిక; 2013,ఏప్రిల్-18; పేజీ-20

వెలుపలి లంకెలు

[మార్చు]