Jump to content

కనువూరు విష్ణురెడ్డి

వికీపీడియా నుండి
కనువూరు విష్ణురెడ్డి
కనువూరు విష్ణురెడ్డి
జననంనెల్లూరు జిల్లా, సూళ్ళూరు పేట
నివాసంజర్మనీ
జాతీయతభారతీయుడు
వృత్తిసంస్థలుప్లానటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో అసోసియేట్ రీసెర్చి సైంటిస్టు
చదువుకున్న సంస్థలునార్త్ డకోటా విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిఖగోళ శాస్త్రవేత్త, "భారత్ 78125" గ్రహశకలాల ఆవిష్కర్త
ముఖ్యమైన పురస్కారాలుపెల్లార్ రైడర్ అవార్డు

కనువూరు విష్ణురెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఆయన యిప్పటివరకు 22 బెల్ట్ ఆస్టరాయిడ్సు, ఆరు బైనరీ ఆస్టరాయిడ్స్ ను కనుగొన్నాడు. ఆయన కనుగొన్న 22 గ్రహశకలాల్లో (ఏస్టరాయిడ్లు) ఒకదానికి "భారత్ 78125"గా నామకరణం చేసారు.[1] ఆయన గౌరవార్థం 1981 మార్చి 6 న ఎస్.జె.బస్ అనే ఖగోళ శాస్త్రవేత్త కనుగొన్న ఒక గ్రహ శకలానికి 8068 విష్ణురెడ్డిగా నామకరణం చేసారు.[2] ఆయన ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

విష్ణురెడ్డి నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరు పేటలోజన్మించారు. ప్రాథమిక విద్యను పూర్తిచేసి మద్రాసులో ఉన్నత విద్యను కొనసాగించారు. కోయంబత్తూరులో విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ తీసుకున్నారు.[4] ఆయన గ్రాండ్ పోర్క్స్ లోని నార్త్ డకోటా విశ్వవిద్యాలయం నుండి ఎర్త్ సిస్టం సైన్స్ లో పి.హెచ్.డి చేసారు.[5] ఆయన "మినరలాజికల్ సర్వే ఆఫ్ నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ పాపులేషన్"లో ఈ డాక్టరేట్ చేసారు.[6] ఆయన ప్రస్తుతం జర్మనీ లోని మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సోలార్ రీసెర్చి లో పనిచేస్తున్నారు.[7]

పరిశోధనలు

[మార్చు]

ఆయన 1999 నుండి అవిరామంగా గ్రహశకలాల యావత్తు సమాచారాన్ని వివిధ వనరుల ద్వారా సేకరించడం ప్రారంభించి, దాదాపు ఆరువేల పేజీల సమాచారాన్ని ప్రోగుచేసారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఇదే అభిరుచి, జిజ్ఞాస ఉన్న వారితో పరిచయం పెంచుకొని వారి సహాయ సహకారాలతో పరిశోధనలు చేసారు. వేల డాలర్లు ఖరీదు ఉన్న పాత టెలిస్కోపును కొనుక్కోలేని ఈయనకు ఇంటర్నెట్ స్నేహితులు స్వంత ఖర్చుతో పంపించారు.[4] ఇంతలో అమెరికాలో అంరర్జాతీయ స్థాయిలో ఖగోళ పరిశోధనలకు సంబంధించిన వర్క్ షాపులో పాల్గొనడానికి "యాహూ" ఇంటర్నెట్ స్నేహితులు సహాయం అందించగా 2002 ఏప్రిల్ లో వర్క్ షాపులో పాల్గొని ఖగోళ శాస్త్రంలో తనకు తెలియని నూతన గవాక్షాలను ఆవిష్కరించుకున్నారు.[4] ఆయన గ్రహశకలాలు, తోకచుక్కలపై పరిశోధనలు చేసారు.[8]

అమెరికా లోని ఖగోళ శాస్త్రవేత్తల కేంద్రం టెక్సన్ కు కూడా బయలుదేరి వెళ్ళారు. కాంతి కాలుష్యం లేని రాత్రివేళలు సంవత్సరంలో 300 వరకు లభించే టెక్సన్ ప్రాంతంలో ఈయన తన పరిశోధనలు ప్రారంభించారు. 2002 జూన్ 28 వ తేదీన పరిశోధనలు ప్రారంభించిన ఈయన వారం రోజులలో అఖండ విజయాన్ని సాధించి, మాతృదేశ ప్రతిష్ఠను ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో సుస్థిరం చేసారు.

2002 లో అమెరికా దేశ స్వాతంత్ర్య దినమైన జూలై, 4 వ తేదీన ఒక ఆస్టరాయిడ్ను ఆయన గుర్తించారు. దానిని అధికార ధృవీకరణ కోసం తన పరిశీలనా పత్రాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్కు సమర్పించారు. 15 మంది సభ్యులతో కూడిన బృందం వివిధ పరిశీలనలు జరిపి కొత్తగా ఒక గ్రహశకలాన్ని విష్ణు రెడ్డి కనిపెట్టారని 2002, ఆగస్టు 15, భారత స్వాతంత్ర్యం రోజున ప్రకటించింది.[4] ఈ గ్రహ శకలానికి "భారత్ 78118"గా నామకరణం చేసారు.[9][10] ఆయన యిప్పటివరకు 22 బెల్ట్ ఆస్టరాయిడ్సు, ఆరు బైనరీ ఆస్టరాయిడ్స్ ను కనుగొన్నాడు.[11]

ప్రచురణలు

[మార్చు]

ఆయన యిప్పటి వరకు 70 పరిశోధనా పత్రాలను ప్రచురించారు.[12]

అవార్డులు

[మార్చు]
  • 2010 : పెల్లార్ రైడర్ అవార్డు.[13]

మూలాలు

[మార్చు]
  1. "The sky's the limit!". హిందూ పత్రిక. Retrieved 2011-06-17.
  2. "Vishnu Reddy". planetory science institute. Archived from the original on 2015-04-08. Retrieved 2015-06-11.
  3. "Vishnu Reddy". Archived from the original on 2015-04-08. Retrieved 2015-06-11.
  4. 4.0 4.1 4.2 4.3 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 71.
  5. "Welcome to Vishnu Reddy's Astronomy Website". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-11.
  6. "ప్లానిటరీ సైన్స్ ఇనిస్టీట్యూట్ వెబ్‌సైటులో ఆయన జీవిత చరిత్ర". Archived from the original on 2015-04-08. Retrieved 2015-06-11.
  7. "Leap from Bolly stars to baby planet". No. The Telegraph. G.S. MUDUR. The Telegraph. 5 June 2011. Archived from the original on 14 మే 2012. Retrieved 5 June 2011.
  8. "Research". Archived from the original on 2015-01-13. Retrieved 2015-06-11.
  9. A celestial body - '78118 Bharat'
  10. "asteroid named after india". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-11.
  11. "Discoveries". Archived from the original on 2015-01-05. Retrieved 2015-06-11.
  12. "RESEARCH (PEER-REVIEWED) (70 PAPERS)". Archived from the original on 2015-01-05. Retrieved 2015-06-11.
  13. 2010 Pellas-Ryder Award for Vishnu Reddy

ఇతర లింకులు

[మార్చు]