Jump to content

కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 14°2′N 80°3′E / 14.033°N 80.050°E / 14.033; 80.050
వికీపీడియా నుండి
కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
పటం
కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) is located in ఆంధ్రప్రదేశ్
కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
అక్షాంశ రేఖాంశాలు: 14°2′N 80°3′E / 14.033°N 80.050°E / 14.033; 80.050
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంకోట
విస్తీర్ణం15.24 కి.మీ2 (5.88 చ. మై)
జనాభా
 (2011)[1]
16,237
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,800/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు8,493
 • స్త్రీలు7,744
 • లింగ నిష్పత్తి912
 • నివాసాలు4,096
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్524411
2011 జనగణన కోడ్592524

కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, కోట మండలం లోని గ్రామం. ఇదే మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన గూడూరు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4096 ఇళ్లతో, 16237 జనాభాతో 1524 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8493, ఆడవారి సంఖ్య 7744. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4627 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2387. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 592524[2]. కోట సముద్రమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఉంది.

ఓ చిన్న గుట్ట దాని పక్కనే సాగే యేరు. ఆ నడుము వొంపులో మా ఊరు, ఊరి మధ్యలోని ఆంజనేయ స్వామి గుడి గంటలు మోగుతూ పవిత్రంగా కనిపిస్తుంది ఈ ఊరు. స్వర్ణముఖీ నది సముద్రంలో కలిసే ముందు రెండు పాయలుగా చీలి సాగితే దానిలోని ఒక పాయ చల్ల కాలువ పక్కన ఈ ఊరు ఉంటుంది.ఇది మండల కేంద్రం.బంగాళా ఖాతానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల గుడాలిలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల నెల్లూరులోను, పాలీటెక్నిక్ గూడూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం గూడూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కోటలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో19 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు 10 మంది, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఏడుగురు నాటు వైద్యులు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 270 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 222 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 76 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 3 హెక్టార్లు
  • బంజరు భూమి: 136 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 817 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 956 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కోటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 905 హెక్టార్లు* చెరువులు: 51 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కోటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

పంటలు వాణిజ్యం

[మార్చు]

ఇక్కడ మాగాణి.వరి,వేరు శెనగ,అరటి ఇలాంటి పంటలు బాగా పండుతాయి.మాగుంట .సుబ్బ రామిరెడ్డి గారు ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలో గల సముద్ర తీరం తూపిలి పాళెంలో రొయ్యల హచరీస్ పెట్టిన తరువాత ఇక్కడ చుట్టు పక్కల కూడా పొలాలు కొన్ని రొయ్యల గుంటలుగా మారిపోయాయి.ఇక్కడి నుండి టైగర్ రొయ్యలు ఒకప్పుడు బాగా ఎగుమతి అయ్యేవి.

సముద్రతీరం

[మార్చు]

ఇక్కడ నుండి సముద్రాన్ని చూడాలి అంటే తూపిలి పాళెం, గుమ్మల్ల దిబ్బ, దుగారాజపట్నం, ఈ మూడు తీరాలికి వెళ్లి చూడొచ్చు. గుమ్మల్ల దిబ్బకు వెళితే పడవ షికారు చేయడమే కాక, అటు వైపు కృష్ణ పట్నం ఓడ రేవు చూడొచ్చు.

గ్రామదేవత

[మార్చు]
  • ఈ ఊరి గ్రామ దేవత కోటమ్మ. ఆమె పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. జమదగ్ని మహర్షి రేణుకా దేవి తలను ఖండించమని తన పుత్రుడు పరశురాముని ఆదేశించితే, ఇక్కడే ఆయన తల నరికాడు అని ప్రశస్తి. అయితే ఖండించిన తరువాత తల అతికించేటపుడు, తొందరలో పక్కనే ఉండే మాతమ్మ తల కోటమ్మకు (రేణుకా దేవికి), కోటమ్మ తల మాతమ్మకు అతికించాడు అంటారు. ఇప్పటికీ కోటమ్మ తిరనాళలో జమదగ్ని ఋషి, పరుశురాముడు, మాతమ్మ విగ్రహాలు ఊరేగిస్తూ ఉంటారు.
  • గ్రామదేవత కోటమ్మ సాగనంపు ఉత్సవం, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించారు. కోటమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రట్యేక ఆభరణాలతో విశిష్ట అలంకరణలు చేసారు. ఉత్సవంలో భక్తులు, దారిపొడవునా కర్పూరహారతులిచ్చుచూ, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కీలుగుర్రాల విన్యాసాలు అలరించినవి. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నవి.
  • ఈ ఆలయంలో శ్రావణపూర్ణిమ సందర్భంగా, 2014, ఆగస్టు -10, ఆదివారం నాడు, అమ్మవారికి ఘనంగా విశిష్టపూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసారు. మేళతాళాలతో, బాణసంచా వేడుకలతో పొంగళ్ళుపెట్టి, పూజలు చేసారు, నైవేద్యాలు సమర్పించారు.

ఇతర ఆలయాలు

[మార్చు]
  • ఇక్కడే గంగమ్మ గుడి, నాగ దేవత పుట్ట ఉంటుంది.
  • పెళ్ళి కూతుర్ని చేసినా, పిల్లలు పుట్టక పోయినా, పుట్టిన తరువాత అయినా ఇక్కడకు వచ్చి మొక్కుకోవడం, పొంగలితో మొక్కు తీర్చుకోవడం, ఇక్కడి వాళ్లకు అలవాటు.

ప్రముఖులు

[మార్చు]
  • ఖైదిసినిమా నిర్మాత కొడవలూరు ధనుంజయ రెడ్డి
  • సినిమా సంగీత దర్శకులు సాలూరి కోటి ఈ ఊరి అల్లుడు
  • షకీలా

రాజకీయ ప్రాముఖ్యత

[మార్చు]

రాజకీయంగా మంచి పేరు. జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ నడిపించే నల్లపరెడ్డివాళ్ళు ఈ ఊరి వాళ్ళే.కోవూరు కంచు కోటగా ఒక్క సారి తప్ప ప్రతి సారీ ఏ పార్టీలో అయినా గెలిచి శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు.

శ్రీనివాసుల రెడ్డి

[మార్చు]

నల్లపరెడ్డి .శ్రీనివాసుల రెడ్డి రెవెన్యూ మినిష్ఠర్ గా చాలా సేవలు రాష్ట్రానికి అందించారు.ఏ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినా ప్రతి వంతెన మీద అతని పేరే ఉంటుంది. ఇక్కడి వాళ్ళు ఇంత అభివృద్ధి చెందటానికి అలమి కృషి చాలా ఉంది. దీనికి గుర్తుగా అతని విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".