Jump to content

గోపాల్ గోయల్ కందా

వికీపీడియా నుండి
గోపాల్ గోయల్ కందా

పదవీ కాలం
2019 – 2024
ముందు మఖన్ లాల్ సింగ్లా
తరువాత గోకుల్ సెటియా
నియోజకవర్గం సిర్సా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ హర్యానా లోక్‌హిత్ పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

గోపాల్ గోయల్ కందా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2019 శాసనసభ ఎన్నికలలో సిర్సా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

గోపాల్ గోయల్ కందా స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2009 శాసనసభ ఎన్నికలలో సిర్సా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం 2014 మే 2న హర్యానా లోక్‌హిత్ పార్టీని స్థాపించి 2014 శాసనసభ ఎన్నికలలో హెచ్‌ఎల్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి మఖన్ లాల్ సింగ్లా చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

గోపాల్ గోయల్ కందా 2019 ఎన్నికలలో రానియా, సిర్సా నియోజకవర్గాల నుండి హెచ్‌ఎల్‌పి అభ్యర్థిగా పోటీ చేసి సిర్సా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సిర్సా నియోజకవర్గం నుండి హెచ్‌ఎల్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోకుల్ సెటియా చేతిలో 7,234 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4][5]


మూలాలు

[మార్చు]
  1. CNBC TV18 (25 October 2019). "Haryana election results 2019: Who is Gopal Kanda?" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. The Indian Express (8 October 2024). "Gopal Kanda Sirsa Election Result 2024: Congress's Gokul Setia defeats HLP's Gopal Kanda by 7,234 votes" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
  4. Election Commision of India (8 October 2024). https://results.eci.gov.in/AcResultGenOct2024/candidateswise-S0745.htm. Retrieved 2 November 2024. {{cite news}}: Missing or empty |title= (help)
  5. Hindustantimes (8 October 2024). "Sirsa election result: HLP's Gopal Kanda suffers defeat by margin of 7,234 votes".