చిష్తియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిష్తియా లేదా చిష్తీ తరీఖా (ఆంగ్లం : Chishti Order) (పర్షియన్ : چشتی ) - ఇస్లాం మతములోని ఒక తత్వ తరీఖా అయిన సూఫీ తరీఖా. సా.శ. 930, ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రాంతపు చిష్త్ అనే పట్టణంలో మొదలైన ఒక ఆధ్యాత్మిక విధానం. ఈ చిష్తీ విధానంలో ప్రేమ, సహనం, ఉదాత్తతకు ప్రథమస్థానాలివ్వబడ్డాయి.[1]

ఈ తరీఖా స్థాపకుడు సిరియాకు చెందిన అబూ ఇస్‌హాక్ షామి, ఇతను ఈ విధానాన్ని చిష్త్ పట్టణానికి గైకొని వచ్చాడు. అప్పటి అమీర్ కుమారుడైన ఖ్వాజా అబూ అహ్మద్ అబ్దాల్ (మరణం : 966) ను శిక్షణ, తర్ఫీదు నిచ్చాడు. తరువాత ఆవిధానం పట్టణపు పేరుతోనే స్థిరపడి ప్రాశస్తం పొందింది.

ఈ విధానంలోని ప్రసిద్ధ ఔలియా ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి (ఖ్వాజా గరీబ్ నవాజ్), అజ్మీర్లో స్థిరపడ్డారు. భారతదేశంలో ఈయనే ఈ తరీఖా లేదా విధానాన్ని స్థాపించారు. నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీ, ఫరీదుద్దీన్ గంజ్ షకర్ పాక్ పట్టణ్, ముహమ్మద్ బదేష్ ఖాద్రి వాడి కర్నాటక, కుతుబుద్దీన్ బక్తియార్ కాకీ, అష్రఫ్ జహాంగీర్ సేమ్నానీ ఖచోచ్ ఉత్తర ప్రదేశ్. చిష్తియా తరీకా ప్రేమా వాత్సల్యాలకు, సహనానికి, విశాలత్వానికి పెట్టింది పేరు. ఈ తరీకా మూలాలు అలీ, ముహమ్మద్ ప్రవక్త వరకూ తీసుకెళతాయి.

సమా లేదా ఖవ్వాలీ ఓ విధమైన ధార్మిక సంగీతం, దీని ద్వారా అల్లాహ్ నామాన్ని జపిస్తూ తరించుట ధ్యేయం. ఈ సమా, ఖవ్వాలీలు ప్రార్థనలు, ఇబాదత్ లేదా పూజా భాగాలు మాత్రం కావు.[2] ఇనాయత్ ఖాన్ అనునతను చిష్తియా తరీఖాను ఉత్తర అమెరికాకు గైకొని పోయాడు. పాకిస్తాన్కు చెందిన పీర్ జాదా మసూద్ అలీ చిష్తీ, ఈ చిష్తియా తరీకాను యునైటెడ్ కింగ్ డం తీసుకెళ్ళాడు. చిష్తీ కుటుంబీకులు నేటికినీ పాక్ పట్టణ్, బహావల్ నగర్, పాకిస్తాన్ లోని ఉత్తర పంజాబ్లో కానవస్తారు.

తొమ్మిది సూత్రాలు

[మార్చు]

చిష్తియా తరీకా ఈ క్రింది తొమ్మిది సుత్రాలకూ ప్రసిద్ధి :

దక్షిణ ఆసియా లో చిష్తియా గొలుసుక్రమం

[మార్చు]

ప్రధాన వనరు :

సూఫీ తరీఖా ప్రారంభం :

  1. హసన్ అల్-బస్రి
  2. అబ్దుల్ వాహిద్ బిన్ జైద్ అబుల్ ఫజల్
  3. ఫుజైల్ బిన్ అయాజ్
  4. ఇబ్రాహీం బిన్ అద్‌హమ్
  5. హుజైఫా అల్ మరాషి
  6. అబూ హుబైరా బస్రి
  7. ఇల్వ్ ముమ్‌షద్ దిన్వారి

చిష్తీ తరీఖా ప్రారంభం :

  1. అబూ ఇస్‌హాక్ షామి
  2. అబూ అహ్మద్ అబ్దాల్
  3. అబూ ముహమ్మద్ బిన్ అబీ అహ్మద్
  4. సయ్యద్ అబూ యూసుఫ్ బిన్ సమాన్ అల్ హుసేని
  5. మౌదూద్ చిష్తి
  6. షరీఫ్ జందాని
  7. ఉస్మాన్ హారూని
  8. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి
  9. కుతుబుద్దీన్ బక్తియార్ కాకీ
  10. ఫరీదుద్దీన్ గంజ్ షకర్

ఇక్కడి నుండి దక్షిణ ఆసియా లోని చిష్తియా తరీకా అనేక శాఖలుగా చీలినది :

(ఫరీదుద్దీన్ గంజ్ షకర్ ముగ్గురు ప్రముఖ వారసులను కలిగి వున్నారు. ప్రతి ఒక్కరి పేరుతో ఒక శాఖ ఉత్పన్నమైనది.)

  1. నిజాముద్దీన్ ఔలియా - నిజామియా శాఖ - అమీర్ ఖుస్రో గురువు.
  2. అలావుద్దీన్ అలీ అహ్మద్ సాబిర్ కలియరి - సాబిరీ శాఖ
  3. నసీరుద్దీన్ చరాగ్ ఎ దిల్లీ
  4. ఖ్వాజా బందా నవాజ్, గుల్బర్గా

చిష్తియా తరీఖా యొక్క ఇతర శాఖలు :

  1. అష్రఫ్ జహాంగీర్ సేమ్నాని - అష్రఫీ శాఖ
  1. ఇమ్దాదుల్లా ముహాజిర్ మక్కీ - చిష్తియా సాబిరియా ఇమ్దాదియా

నోట్స్

[మార్చు]
  1. Ernst, Carl W. and Lawrence, Bruce B. (2002) Sufi Martyrs of Love: The Chishti Order in South Asia and Beyond Palgrave Macmillan, New York, p. 1 ISBN 1403960267
  2. ‘Atā, Shāh Muḥammad Mahdī (1902) Lam‘at al-Anvār fī Bayān al-Aurād va al-Azkār Naval Kishor, Lucknow, India, OCLC 71847168 in Persian, about Chishti Sufi ritual

మూలాలు

[మార్చు]
  • Haeri, Muneera (2000) The Chishtis: a living light Oxford University Press, Oxford, UK, ISBN 0195793277
  • Ernst, Carl W. and Lawrence, Bruce B. (2002) Sufi Martyrs of Love: The Chishti Order in South Asia and Beyond Palgrave Macmillan, New York, ISBN 1403960267
  • Farīdī, Iḥtishāmuddīn (1992) Tārīk̲h̲-i iblāg̲h̲-i Cisht Āl Inḍiyā Baz-i Ḥanafī, Delhi, OCLC 29752219 in Urdu with biographies
  • Āryā, Ghulām ‘Alī (2004) Ṭarīqah-i Chishtīyah dar Hind va Pākistān: ta’līf-i Ghulām‘alī Āryā Zavvār, Tehran, ISBN 9644012003 in Persian

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిష్తియా&oldid=4055516" నుండి వెలికితీశారు