జగదానంద రాయ్
జగదానంద రాయ్ (Bengali: জগদানন্দ রায) 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాళీ సైన్స్ ఫిక్షన్ రచయిత. ఆయన 1857లో వ్రాసిన శుక్ర భ్రమణ్ (బృహస్పతి గ్రహానికి ప్రయాణం) 22 ఏళ్ల తర్వాత 1879లో ప్రచురించాడు. ఈ కథ సాహితీ చరిత్రకారుల ఆసక్తిని చూరగొన్నది. కథలో ఇతర గ్రహాలకు గ్రహాంతర ప్రయాణాన్ని వర్ణిస్తుంది. ఇందులో యురేనస్ గ్రహంలో నివసించే గ్రహాంతరవాసుల వర్ణనకు ఆధునిక పరిణామ సిద్ధాంతానికి పోలిన సిద్ధాంతాన్ని జగదానంద రాయ్ ఉపయోగించాడు. "అవి చాలామటుకు మన వానరాలను పోలి ఉన్నాయి. వాటి శరీరం దట్టమైన నల్లని వెంట్రుకలతో నిండి ఉన్నది. వాటి తలలు శరీర పరిమాణానికి పెద్దవిగా ఉన్నవి. కాళ్ళు చేతులకు పొడువాటి గోళ్లతో పూర్తి నగ్నంగా ఉన్నాయి" అని గ్రహాంతవాసులను వర్ణించాడు. ఈ కథ హె.జి.వెల్స్ బుధ గ్రహవాసులను వర్ణించిన నవల "ది వార్ ఆఫ్ ద వరల్డ్స్" కంటే ఒక దశాబ్దం ముందే ప్రచురించబడి ఉండటం విశేషం.
మూలాలు
[మార్చు]- Debjani Sengupta (2003), Sadhanbabu’s Friends: Science Fiction in Bengal from 1882-1961