జర్‌ట్రూడ్ బేలే ఎలియన్
జర్‌ట్రూడ్ బేలే ఎలియన్ | |
---|---|
జననం | జర్‌ట్రూడ్ బేలే ఎలియన్ Gertrude Belle Elion 1918 జనవరి 23 న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మరణం | 1999 ఫిబ్రవరి 21 చాపెల్ హిల్, USA | (వయసు 81)
పౌరసత్వం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
వృత్తిసంస్థలు | బరో వెల్‌కం |
చదువుకున్న సంస్థలు | హంటర్ కళాశాల |
ముఖ్యమైన పురస్కారాలు | Garvan-Olin Medal (1968), నోబెల్ బహుమతి (1988) National Medal of Science (1991) Lemelson-MIT Lifetime Achievement Award (1997) National Inventors Hall of Fame (1991) (first woman to be inducted) |
జర్‌ట్రూడ్ బేలే ఎలియన్ (ఆంగ్లం: Gertrude Belle Elion) (జనవరి 23, 1918 – ఫిబ్రవరి 21, 1999) [1] ప్రముఖ అమెరికన్ రసాయనిక శాస్త్రవేత్త. ఈమెకు 1988 లో శరీర విజ్ఞానానికి సంబంధించిన నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. హృద్రోగం, గ్యాస్ కు సంబంధించిన అల్సర్ కు సంబంధించిన వైద్య ఔషధాలను వీరు కనిపెట్టారు.
బాల్యం
[మార్చు]ఈమె 1918 జనవరి 23 తేదీన న్యూయార్క్ పట్టణంలో జన్మించారు. రాబర్ట్ ఎలియన్, బర్థా ఎలియల్ వీరి తల్లిదండ్రులు. ఈమెకు చిన్ననాటినుండే జిజ్ఞాస ఎక్కువ; అందువలన ఏ పనిలోనూ మనసు స్థిరంగా ఉండేది కారు. "తనకు 15 ఏళ్ళ వయసులో తన తాత కాన్సర్ తో చనిపోవడం తనని ఎంతో బాధించిందని ఆయనతో ఎంతో అనుబంధం ఉండడం వలన, ఆయనను తననుండి దూరం చేసిన క్యాన్సర్ ను, మందుల ద్వారా దూరం చేయాలని తనకు ప్రేరణ కలిగిందని" అన్నారామె.
విద్యాభ్యాసం
[మార్చు]ఈమె 1933లో న్యూయార్క్ లోని మహిళా ఇంటర్ కళాశాలలో ప్రవేశం పొంది రసాయనశాస్త్రంలో పట్టా పొందారు. తదుపరి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో 1941 లో రసాయన శాస్త్రంలో ఎం.ఎస్. పూర్తిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆమెకు ఎక్కడ సరైన ఉద్యోగం దొరకలేదు. టకహో లోని బరో వెల్‌కం (Burroughs Wellcome) ప్రయోగశాలల్లో ఫార్మసీ ఔషధాల అన్వేషణలో పనిచేస్తున్న జార్జి హెచ్. హిచింగ్స్తో కలిసి పనిచేశారు. 1948 లో ల్యుకేమియా (Leukemia) వ్యాధి వ్యాపించకుండా నిరొధించే సమ్మిశ్రకాన్ని ఆమె కనుగొన్నారు. తర్వాత దానిపై ప్రయోగాలు చేసి మనుషుల్లో ఈ మందు దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని గుర్తించారు. ఈ లోపాన్ని సవరించి, 6 మరకైపటా పురీన్ లేదా 6 ఎమ్.పి. (6-Mercaptopurine or 6 M P) అన్న రూపం ఇచ్చారామె. దీనికి ల్యుకేమియాను ఆపే ఔషధంగా గుర్తింపు లభించింది.
మూలాలు
[మార్చు]- ↑ doi:10.1098/rsbm.2007.0051
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
బయటి లింకులు
[మార్చు]- Autobiography at the Nobel e-Museum Archived 2001-10-04 at the Wayback Machine
- Biographical Memoirs by Mary Ellen Avery Archived 2013-01-31 at the Wayback Machine
- Women of Valor exhibit on Gertrude Elion at the Jewish Women's Archive
- New York Times obituary
- Gertrude B. Elion, Biography of Gertrude B. Elion, Jewish Women Encyclopedia