జాతీయ రహదారి 134
National Highway 134 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 34 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 95 కి.మీ. (59 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ చివర | ధరసు | |||
ఉత్తర చివర | యమునోత్రి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తరాఖండ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 134 (ఎన్‌హెచ్ 134) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది జాతీయ రహదారి 34 కు చెందిన శాఖా మార్గం. ఎన్‌హెచ్-134 ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది.[1][2][3]
మార్గం
[మార్చు]ధరసు - కుత్నౌర్ - యమునోత్రి[1]
జంక్షన్లు
[మార్చు]ఎన్‌హెచ్ 34 ధరసు వద్ద ముగింపు.[1]
సిల్క్యారా బెండ్ - బార్కోట్ టన్నెల్
[మార్చు]2018 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా బెండ్ - బార్కోట్ టన్నెల్‌కు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సొరంగం 4.531 కిలోమీటర్లు (2.815 మై.) పొడవు, రెండు లేన్లు, తప్పించుకునే మార్గాలతో ఈ సొరంగాన్ని నిర్మిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1383.78 కోట్లు కాగా సొరంగం ప్రాజెక్టుకు రూ. 1119.69 కోట్లు. ఈ సొరంగం, ధరసు నుండి యమునోత్రికి ప్రయాణ దూరాన్ని దాదాపు 20 కిలోమీటర్లు (12 మై.) తగ్గిస్తుంది. ప్రయాణ సమయం సుమారు ఒక గంట. దీని వలన సకల వాతావరణ రవాణా సౌకర్యం కలుగుతుంది.[4][5]
2023 నవంబరు 12 న, నిర్మాణంలో ఉండగా సొరంగంలోని ఒక భాగం కూలిపోయి, 41 మంది సొరంగం కార్మికులు చిక్కుకుపోయారు.[6][7] రెస్క్యూ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించారు. 16 రోజుల తర్వాత నవంబరు 28 న కార్మికులను కాపాడారు.[8] [9]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "New Numbering of National Highways notification – Government of India" (PDF). The Gazette of India. Archived (PDF) from the original on 4 May 2018. Retrieved 23 Sep 2018. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "List of National Highways in Uttarakhand" (PDF). Public Works Department – Government of Uttarakhand. Archived (PDF) from the original on 20 July 2018. Retrieved 23 Sep 2018.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 23 Sep 2018.
- ↑ "Cabinet approves Silkyara Bend-Barkot Tunnel in Uttarkhand". Archived from the original on 23 September 2018. Retrieved 23 Sep 2018.
- ↑ "Nod to tunnel for all-weather connectivity to Yamunotri". The Tribune. 21 Feb 2018. Archived from the original on 23 September 2018. Retrieved 23 Sep 2018.
- ↑ Sebastian, Meryl (14 November 2023). "Uttarakhand tunnel collapse: Rescuers race to save 41 workers trapped in India tunnel". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "Uttarakhand Tunnel Collapse Update: How Will The Trapped Workers Be Rescued?". NBC Right Now (in ఇంగ్లీష్). India times. 14 November 2023. Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "Uttarakhand tunnel rescue live: Trapped workers rescued after 17 days". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 28 November 2023. Archived from the original on 28 November 2023. Retrieved 28 November 2023.
- ↑ Mishra, Ishita (2023-11-28). "Uttarkashi tunnel collapse | After 17-day ordeal, trapped workers rescued". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 28 November 2023. Retrieved 2023-11-28.