జీశాట్-6 ఉపగ్రహం
మిషన్ రకం | Communication సమాచార ఉపగ్రహం |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 2015-041A |
SATCAT no. | 40880 |
వెబ్ సైట్ | http://www.isro.gov.in/gslv-d6/gslv-d6-gsat-6-live-launchpad |
మిషన్ వ్యవధి | 9 సంవత్సరాలు (ప్రణాళిక ప్రకారం) |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-2K |
తయారీదారుడు | ISRO Satellite Centre Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 2,117 కిలోగ్రాములు (4,667 పౌ.) |
శక్తి | 2 kilowatts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 27 August 2015, 11:22 | UTC
రాకెట్ | GSLV-D6జీఎస్‌ఎల్‌వీ -డీ6 |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం SLP |
కాంట్రాక్టర్ | Indian Space Research Organisationఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
ఎపోచ్ | Planned |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | 5, C x S transponders (9 megahertz bandwidth) 5, S x C transponders (2.7 megahertz bandwidth)[విడమరచి రాయాలి] |
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రోవారు 2015 సంవత్సరం, అగస్టు27 వతేది సాయంత్రం 4:52గంటలకు, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా లోని, శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి, జీఎస్‌ఎల్‌వి-డీ6 అను భూస్థిరకక్ష అంతరిక్ష వాహననౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు[1]. రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి జీఎస్‌ఎల్‌వీ-డీ6 వాహక నౌక బయలు దేరిన 17:04నిమిషాల్లో కచ్చితంగా జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సమాచార రంగంలో కొత్త శకానికి తెరలేపింది. ఎస్ బ్యాండ్ ద్వారా సమాచార రంగంలో ఆధునిక సేవలు అందించే లక్ష్యంతోరూపొందించిన జీశాట్-6 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండవ లాంచింగ్ పాడ్ నుంచి జీఎస్‌ఎల్‌వీ డీ6 వాహననౌక ద్వారా ఉపగ్రహాన్ని గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగించారు[2]. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని వాహన నౌక లక్ష్యాన్ని చేరుకుంది. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జీశాట్-6 ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించగానే ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు అభినందించుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి సత్తా చాటినట్లయింది.జీఎస్‌ఎల్‌వీ డీ6 ప్రయోగం విజయవంతం అయ్యిందని ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ ప్రకటించారు. జీశాట్-6 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ -డీ6 రాకెట్ దానిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ డీ6లోని అన్ని వ్యవస్థలుసక్రమంగా పనిచేశాయన్నారు. స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ పనితీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు. ఈ ప్రయోగంలో భాగస్వామ్యులైన శాస్త్రవేత్తలను అందరినీ ఆయన అభినందించారు[3]
కౌంట్‌డౌన్
[మార్చు]రాకెట్ ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్ డౌన్ బుధవారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభమైంది. 29 గంటలపాటు కౌంట్ సాగింది. అది పూర్తయిన తరువాత గురువారం సాయంత్రం 4.52 గంటలకు జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకుపోయింది. 1,024 సెకన్లకు 170 కిలోమీటర్ల పెరూజీ (భూమికి అతి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) 19.95 డిగ్రీల భూ సమాంతర కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ దశతో రెండోసారి చేస్తున్న ప్రయోగం ఇది. భారత్ ఇప్పటి వరకు 24 సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.[1]
జీశాట్-6 ఉపగ్రహం వివరాలు
[మార్చు]జీఎస్‌ఎల్‌వీ-డీ6ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టబడిన జీశాట్-6 ఉపగ్రహం 2117 కేజీల బరువైనది. ఉపగ్రహంలో ఇంధనం బరువు1,132 కిలోలు. కేవలం ఉపగ్రహం బరువు985కిలోలు. ఇందులో భాగంగా 10 ఎస్ బ్యాండ్ ట్రాన్స్ పాండర్స్ ఏర్పాటు చేశారు[4] జీశాట్-6 సమాచార ఉపగ్రహం డిజిటల్ మల్టీమీడియా, మొబైల్‌సమాచార రంగంలో అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుంది. దీనిద్వారా రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగాలకు మరింత భద్రమైన సమాచార వ్యవస్థలు అందుబాటులోకి రానున్నవి. శాటిలైట్ పోన్ల ద్వారా ఈ వర్గాలవారు దేశంలోని ఏ ప్రాంతంనుంచైనా ఇతరప్రాంతాలవారితో మాట్లాడేటందుకు వీలుంటుంది. జీశాట్-6 ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ ద్వారా 5 స్పాట్‌బీమ్స్, సీ బ్యాండ్‌లో ఒక జాతీయ స్థాయి బీమ్ అందుబాటులోకి వస్తుంది. రేడియా ఫ్రీక్వేన్సీని అత్యంత సమర్థంగా పయోగించుకొనుటకు వీలున్నది.గతంలో ఏ ఉపయ్రహానికి లేనటువంటీ అతిపెద్ద యాంటెన్నాను ఈఉపగ్రహం కలిగిఉన్నది.6 మీటర్లవ్యాసార్ధమున్న ఈ యాంటెన్నావల్ల ఉపగ్రహం నుండి సమాచారాన్ని ఎక్కువ తెలుసుకొను అవకాశం ఉంది.ఈ ఉపగ్రహం 9సంవత్సరాలపాటు సేవ లంధిస్తుందని ఇస్రో తెలిపినది.[5] భారత సమాచార ఉపగ్రహాలలో 25వది అయిన జీశాట్-6 దేశంలో నిర్మించిన సమాచార ఉపగ్రహాలలో 12వది. జీశాట్ ఉపగ్రహంలో సమాచార సేవలను అందించే 10 ఎస్ బ్యాండ్, సీ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు పొందుపరిచారు (అయిదు 9 MHzతరంగ దైర్గ్యం గల C x Sట్రాన్సుఫాండరులు,2.7 MHzతరంగ దైర్గ్యం గల SxC ట్రాన్సుఫాండరులు).[6] దీని ద్వారా ట్రాన్స్ పాండర్ల కొరత తీరనుంది. ఇస్రో అభివృద్ధి పరిచిన అత్యంత పెద్దదైన 6 డయామీటర్ల యాంటెనా ఈ ఉపగ్రహంలో అమర్చారు. ఇది కక్ష్యలోకి ఉపగ్రహం చేరుకున్న తర్వాత విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఈ యాంటీనా ద్వారా ఎస్ బాండ్ ట్రాన్స్ పాండర్లు దేశాన్ని పూర్తిగా కవర్ చేసి మల్టీమీడియా, శాటిలైట్ ఫోన్‌లకు తమ సేవలను అందించనున్నాయి. 83 డిగ్రీల తూర్పు అక్షాంశంపై చేరిన తర్వాత ఈ ఉపగ్రహం యాంటెనా పూర్తిగా విచ్చుకుంటుంది. తరువాత తన సేవలను అందించడం ప్రారంభిస్తుంది[7]
నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహన్ని స్థిరపరచడం
[మార్చు]ఇస్రో అంతరిక్షంలోకి పంపిన జీశాట్ -6 సమాచార ఉపగ్రహం కక్ష్య పెంపు విజయవంతం అయ్యింది. బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎమ్‌సీఎఫ్) శాస్త్రవేత్తలు శుక్రవారం మొదటి విడతలో అపోజీ మోటారును 3,385 సెకన్లపాటు మండించి కక్ష్య ఎత్తును 8,408 కిలోమిటర్లు పెరూజీ (భూమినుండి దగ్గరి ఎత్తు),35,708 కిలోమీటర్లు అపోజీ (భూమినుంచి దూరపు ఎత్తు) కు చేర్చినట్లు ఇస్రో తెలిపినది.శనివారం జీశాట్-6 లోని అపోజీ ఇంజిన్లలో వున్న 1132 కిలోల ఇంధనంలో కొంత ఉపయోగించి మరోసారి కక్ష్య దూరాన్ని పెంచారు.8,048 కిలోమీటర్లు పెరూజీని పెంచుతూ, అపోజీ త్తును 26,998 కిలోమిటర్లకు ఎత్తును కొద్దిగా తగ్గించారు.తరువాత వివిధ విడతల్లో జీశాట్-6 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో స్థిరపరచేందుకు ఇస్రో శాస్త్రవేయత్తలు కృషి చేస్తున్నారు.[8] 30 అగస్టు,2015న ఉదయం 7గంటల 46నిమిషాలకు (భారతీయ కాలమానం) మూడోసారి, ఉపగ్రహం యొక్క అపోజీ మోటారును 580.32సెకండ్లు మండించి ఉపగ్రహాన్ని కక్ష్యలో ఎత్తు పెంచి స్థిరపరచారు.[9] జీశాట్-6 ఉపగ్రహంయొక్క 6మీటర్ల వ్యాసమున్న ముడుచుకొనే/తెరచుకొనే అంటెన్నాను విజయవంతంగా ఇస్రో శాస్త్రవేత్తలు తెరచారు/విస్తరించారు.[10] 2015 సెప్టెంబరు 1 నాటికి ఉపగ్రహం పెరిజీ 35,634 కిలోమీటర్లు, అపోజీ35,681 కిలోమీటర్లు.ఏటవాలు 1.17 డిగ్రీలు[11]
ఇవికూడా చూడండి
[మార్చు]- జీశాట్-9
- జీఎస్ఎల్వీ -డీ6
- భాస్కర – I ఉపగ్రహం
- భాస్కర –II ఉపగ్రహం
- కార్టోశాట్-1 ఉపగ్రహం
- ఆర్యభట్ట ఉపగ్రహం
- జీశాట్-1 ఉపగ్రహం
- జీశాట్-2 ఉపగ్రహం
- జీశాట్-3 ఉపగ్రహం
- జీశాట్-7 ఉపగ్రహం
- జీశాట్-16
- Indian National Satellite System
- GSAT
- Direct-broadcast satellite
- List of Indian satellites
బయటి విడియో లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీశాట్-6". telugugateway.com. Archived from the original on 2015-08-29. Retrieved 2015-08-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "GSLV Successfully Launches India's Latest Communication Satellite GSAT-6". isro.gov.in. 2015-08-27. Archived from the original on 2015-08-29. Retrieved 2015-08-30.
- ↑ "జీశాట్-6 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగం : ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్". chalanam.net. Archived from the original on 2015-08-29. Retrieved 2015-08-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "నింగికెగిరిన జీఎస్‌ఎల్‌వీ-డి6". andhrajyothy.com. Archived from the original on 2015-08-28. Retrieved 2015-08-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ఇస్రో సుపర్ సిక్స్". shakshi. Archived from the original on 2015-08-28. Retrieved 2015-08-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "GSAT-6". sac.gov.in. Archived from the original on 2015-08-28. Retrieved 2015-08-28.
- ↑ "జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం". tnews.media. Archived from the original on 2015-08-28. Retrieved 2015-08-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "జీశాట్-6 కక్ష్యపెంపు సక్సెస్". Sakshi.com. Archived from the original on 2015-08-30. Retrieved 2015-08-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "GSAT-6 Update: Third orbit raising operation of GSAT-6 was successfully completed". isro.gov.in. Archived from the original on 2015-09-01. Retrieved 2015-08-31.
- ↑ "Deployment of the unfurlable antenna (UFA) is successfully completed". isro.gov.in. Archived from the original on 2015-09-01. Retrieved 2015-08-31.
- ↑ "GSAT-6 UPDATE". .facebook.com. Retrieved 2015-09-01.