జేమ్స్ వాట్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేమ్స్‌ వాట్సన్‌

James Watson - జేమ్స్‌ వాట్సన్‌. జీవశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్త.

బాల్యం, విద్య

[మార్చు]

అమెరికాలోని షికాగో నగరంలో 1928 ఏప్రిల్‌ 6న సంపన్న కుటుంబంలో పుట్టిన జేమ్స్‌ డేవీ వాట్సన్‌ బాల మేధావిగా పేరొందాడు. రేడియో క్విజ్‌ కార్యక్రమాల్లో చురుగ్గా రాణించిన జేమ్స్‌ 15 ఏళ్ల కల్లా షికాగో విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. జంతుశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక 'వాట్‌ ఈజ్‌ లైఫ్‌' గ్రంథం చదివి ఉత్తేజితుడై జన్యుశాస్త్ర (జెనెటిక్స్‌) అధ్యయనం ఆరంభించాడు. ఆపై 22 ఏళ్లకే డాక్టరేట్‌ సాధించాడు. పరిశోధనలు కొనసాగించి లండన్‌లోని కేవిండిష్‌ లాబరేటరీలో ఫ్రాన్సిస్‌ క్రీక్‌, మారిస్‌ విల్కిన్స్‌తో కలిసి డీఎన్‌ఏను ఆవిష్కరించగలిగాడు. 'డబుల్‌ హెలిక్స్‌' గ్రంథం రాశాడు.


పరిశోధనలు

[మార్చు]

జీవశాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణగా పేరొందినది ఏమిటో తెలుసా? డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనిపెట్టడం. ఆ పరిశోధనలో ప్రముఖ పాత్ర వహించిన శాస్త్రవేత్తే జేమ్స్‌ వాట్సన్‌. ఇందుకుగాను నోబెల్‌ బహుమతిని అందుకునేనాటికి అతడి వయసు 25 సంవత్సరాలే! ఆయన పుట్టిన రోజు -1928 ఏప్రిల్‌ 6 .

మానవ శరీరం కోట్లాది జీవకణాలతో నిర్మితమైందని మీరు పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఒకో కణంలో సైటోప్లాజమ్‌ అనే జెల్లీలాంటి ద్రవ పదార్థం ఉంటుంది. కణ కేంద్రమైన న్యూక్లియస్‌లో క్రోమోజోమ్స్‌ అనే రసాయనిక పోగులుంటాయి. ఇవి క్లిష్టమైన DNA(Deoxy ribo Nucleic Acid) అనే రసాయనంతో తయారై ఉంటాయి. డీఎన్‌ఏ సర్పిలాకారపు నిచ్చెన (spiral ladder) రూపంలో ఉండే అతి పొడవైన రెండు దారాల్లాంటి నిర్మాణంతో మెలికలు తిరిగి ఉంటుంది. దీన్ని డబుల్‌ హెలిక్స్‌ అంటారు. జీవపదార్థాల్లో సమాచార మార్పిడికి ఇదెంతో కీలకం.

జేమ్స్‌ పరిశోధన వల్ల జీన్‌ క్లోనింగ్‌, జీన్‌ బ్యాంకులు, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల పుష్ఠికరమైన ఆహార పదార్థాల ఉత్పత్తి, నాణ్యమైన ఔషధాల ఉత్పాదన, రోగ నిర్దారణలో ప్రమాణాలు సాధ్యమవుతున్నాయి. జేమ్స్‌ సారధ్యంలో కేన్సర్‌కి కారణమైన ఆంకోజీన్‌ను కనుగొన్నారు. ఎనభై రెండేళ్ల వయసులో ఆయన ఇప్పటికీ పరిశోధనలను చురుగ్గా కొనసాగిస్తుండడం విశేషం.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]