తిరుపార్తన్ పళ్ళి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుపార్తన్ పళ్ళి Thiruppaarththanpalli | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
పేరు | |
ఇతర పేర్లు: | Taamaraiyaal Kelvan Temple |
ప్రధాన పేరు : | తిరుపార్తన్ పళ్ళి |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | నాగపట్నం |
ప్రదేశం: | పార్తన్ పల్లి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | తామరయాళ్ కేళ్వన్ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | తామరై నాయకి |
ఉత్సవ దైవం: | పార్థసారధి |
దిశ, స్థానం: | పశ్చిమముఖము |
పుష్కరిణి: | శంఖ పుష్కరిణి |
విమానం: | నారాయణ విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | అర్జునుడు, వరుణుడు, ఏకాదశ రుద్రులు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
తిరుపార్తన్ పళ్లి (Thiruppaarththanpalli) 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
శ్లో|| పార్తంపళ్లి పురేతు శంఖ సరసీ యుక్తే తు నారాయణం
వైమానం సమధిశ్శ్రిత స్థ్సితిలసన్ ప్రాచేతసాశీముఖః |
దేవస్తామరయాళ్ ప్రియోర్జున జలేశైకా దశేశేక్షితః ||
ప్రాప్తస్తామర నాయకీం విజయతే శార్జ్గాంశ యోగిస్తుతః ||
విశేషాలు
[మార్చు]ఇచ్చట పెరుమాళ్లు శ్రీదేవి, భుదేవి, నీలాదేవులతో కలసి ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఇక్కడ శంఖ చక్ర గదలతో వేంచేసియున్న కోలవిల్లి రామన్ ప్రతిష్ఠితమై ఉన్నాడు. స్వామి హస్తములో శార్జ్గమును (విల్లు) ధరించి ఉంటాడు. ఇచట అర్జునునకు వేరు సన్నిధి ఉంది.
చరమ శ్లోకార్ధము ప్రకాశించిన స్థలము - మకరం పుష్యమీ నక్షత్రం తీర్ధోత్సవం. అర్చకుని నివాసం సన్నిధికి సమీపముననే ఉంది.
మార్గము
[మార్చు]తిరునాంగూర్ కు దక్షిణం 3 కి.మీ. చిన్న గ్రామం. వసతులు లేవు.
తమిళ సాహిత్యం
[మార్చు]పా|| కవళయానై కొమ్బుశిత్త కణ్ణనెన్ఱుమ్; కామరుశీర్
క్కువళమేగ మన్నమేని కొణ్ఱ కోనెన్నానై యెన్ఱుమ్
తవళమాడునీడు నాజ్గై త్తమరైయాళ్ కేళ్వనెన్ఱుమ్
పవళవాయాళెన్ మడన్దై పార్తన్బళ్ళి పొడువాళే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొలి 4-8-1
శ్లో|| చోళదేశే ప్రసిద్ధానాం దేశానాం కమలాపతేః |
ఏవం చత్వా రింశ తస్తు వైభవో వర్ణితోమయా ||
వివ: ఇంతవరకు చోళదేశపు దివ్య తిరుపతులు నలుబది క్షేత్రములు వర్ణింపబడినవి.
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
తామరయాళ్ కేళ్వన్ | తామరై నాయకి | శంఖ పుష్కరిణి | పశ్చిమ ముఖము | నిలుచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | నారాయణ విమానము | అర్జునునకు, వరుణునకు, ఏకాదశ రుద్రులకు |