తీస్తా సీతల్వాడ్
తీస్తా సేతల్వాడ్ | |
---|---|
జననం | ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం | 1962 ఫిబ్రవరి 9
జాతీయత | ఇండియన్ |
వృత్తి | పౌర హక్కుల కార్యకర్త , పాత్రికేయురాలు |
తీస్తా సేతల్వాడ్ (ఆంగ్లం: Teesta Setalvad) ఒక భారతీయ పౌర హక్కుల కార్యకర్త. ఆమె పాత్రికేయురాలు కూడా. 2002 గుజరాత్ అల్లర్ల బాధితుల పక్షాన వాదించేందుకు ఏర్పాటు చేసిన సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) సంస్థకు ఆమె కార్యదర్శి.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1962లో గుజరాతీ కుటుంబంలో జన్మించిన తీస్తా సేతల్వాడ్ ముంబైకి చెందిన న్యాయవాది అతుల్ సేతల్వాడ్, సీతా సేతల్వాడ్ దంపతుల కుమార్తె. ఆమె తాత భారతదేశపు మొదటి అటార్నీ జనరల్ అయిన ఎం. సి. సేతల్వాడ్.[2][3] మైనారిటీ హక్కుల కార్యకర్తగా మారిన జర్నలిస్టు జావేద్ ఆనంద్‌ను తీస్తా సేతల్వాడ్ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
గుజరాత్ అల్లర్ల కేసు
[మార్చు]గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చిన ఆరోపణలపై తీస్తా సీతల్వాడ్‌ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) 2022 జూన్ 25న అరెస్ట్ చేసింది. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Teesta Setalvad". Human Rights office of the city of Nuremberg.
- ↑ "India THE NEXT DECADE". Archived from the original on 25 జూన్ 2007.
- ↑ "Nürnberger Menschenrechtspreisträger 2003" (in జర్మన్). Archived from the original on 8 March 2012.
- ↑ "Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్". web.archive.org. 2022-06-26. Archived from the original on 2022-06-26. Retrieved 2022-06-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)