దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్
నిర్దేశాంకాలు31°35′52″N 120°27′25″E / 31.597837°N 120.456848°E / 31.597837; 120.456848
OS grid reference[1]
దీనిపై వెళ్ళే వాహనాలురైలు
స్థలంచైనా జియంగ్సు ప్రావిన్స్
లక్షణాలు
మొత్తం పొడవు164.8 కిలోమీటర్లు (102.4 మై.)
చరిత్ర
నిర్మాణం ప్రారంభంca. 2006
నిర్మాణం పూర్తి2010
ప్రారంభం30 జూన్ 2011
ప్రదేశం
పటం

దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్ (Danyang–Kunshan Grand Bridge) అనేది ప్రపంచంలో అతిపొడవైన వంతెన. ఇది బీజింగ్-షాంఘై హై-స్పీడ్ రైలుమార్గం కోసం నిర్మించబడిన 164.8 కిలోమీటర్ల (102.4 మైళ్ళు) పొడవైన వయాడక్ట్ (అనేక మధ్య గోడల వంతెన).

వంతెన

[మార్చు]

వంతెన ఈస్ట్ చైనా జియంగ్సు ప్రావిన్స్ లో షాంఘై, నాన్జింగ్ మధ్య రైలు మార్గంలో ఉంది. ఇది యాంగ్జీ నది డెల్టా ప్రాంతంలో ఉంది ఈ భౌగోళిక ప్రాంతం లోతట్టు ప్రాంత వరి మడులు, కాలువలు, నదులు, సరస్సుల లక్షణాలను కలిగి ఉంది. ఈ వంతెన సుమారు 8 నుంచి 80 కిమీ (5 నుండి 50 మైళ్ళు) నదికి దక్షిణంగా, యాంగ్జీ నదికి సమాంతరంగా ఉంటుంది.

2010లో పూర్తయిన ఈ వంతెన 2011లో ప్రారంభించబడింది. దీని నిర్మాణానికి 10,000 మంది సిబ్బందితో నాలుగు సంవత్సరాలు పట్టింది, దీని నిర్మాణ వ్యయం 8.5 బిలియన్ డాలర్లు. ఈ బ్రిడ్జి 2011లో ప్రపంచంలో అతి పొడవైన వంతెనగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది.[1]

మూలాలు

[మార్చు]
  1. Longest bridge, Guinness World Records. Last accessed July 2011.